Share News

Viral Video: వామ్మో.. హార్న్ కొడితే పరిస్థితి ఇలా ఉంటుందా? బస్సు డ్రైవర్లకు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు..

ABN , Publish Date - Jan 22 , 2025 | 07:10 PM

మన దేశంలో వాహనాల హార్న్ విషయంలో ఎలాంటి రూల్స్ లేవు. వాహనం ఒక్క నిమిషం ఆగితే చాలు హారన్ మోగించి విసిగిస్తుంటారు. అందులోనూ మన బస్సులు, లారీల హార్న్‌ల మోత ఓ రేంజ్‌లో శబ్ద కాలుష్యం కలిగిస్తుంది. మనదేశం గురించి విదేశీ పర్యాటకులు చేసే ఫిర్యాదుల్లో ఈ హార్న్ అంశం కూడా తప్పనిసరిగా ఉంటుంది.

Viral Video: వామ్మో.. హార్న్ కొడితే పరిస్థితి ఇలా ఉంటుందా? బస్సు డ్రైవర్లకు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు..
Police taught such a lesson to bus drivers

చాలా దేశాల్లో వాహనాల హార్న్ (Vehicle Horn) విషయంలో చాలా పరిమితులు ఉంటాయి. కొన్ని దేశాల్లో హార్న్ కొట్టే విషయంలో స్పష్టమైన పరిమితులు ఉంటాయి. మరికొన్ని దేశాల్లో హార్న్ కొట్టడాన్ని నేరంగా కూడా పరిగణిస్తారు. అయితే మన దేశంలో మాత్రం హార్న్ విషయంలో ఎలాంటి రూల్స్ లేవు. వాహనం ఒక్క నిమిషం ఆగితే చాలు హారన్ మోగించి (Horn sound) విసిగిస్తుంటారు. అందులోనూ మన బస్సులు, లారీల హార్న్‌ల మోత ఓ రేంజ్‌లో శబ్ద కాలుష్యం కలిగిస్తుంది. మనదేశం గురించి విదేశీ పర్యాటకులు చేసే ఫిర్యాదుల్లో ఈ హార్న్ అంశం కూడా తప్పనిసరిగా ఉంటుంది. తాజాగా కర్ణాటక (Karnataka)లో ఓ బస్సు డ్రైవర్ అనవసరంగా హార్న్ మోగించడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ వెరైటీ శిక్ష విధించాడు (Viral Video).


బస్సు డ్రైవర్‌కు తగిన గుణపాఠం చెప్పిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. @NaadaPremiSha అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వోల్వో బస్సు డ్రైవర్ అనవసరంగా ఎదుటి వారి చెవులు చిల్లుపడేలా హరన్ కొడుతూ వెళుతున్నాడు. వోల్వో బస్సు హార్న్ ఏ స్థాయిలో శబ్దం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా చేసిన డ్రైవర్లకు కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు వెరైటీ పనిష్మెంట్ ఇచ్చారు. అదే పనిగా హర్న్‌లు మోగిస్తుంటే ఇతరులు ఎలా ఇబ్బంది పడుతుంటారో వారికి తెలియజేయాలనుకున్నారు.


బస్సు డ్రైవర్లను కిందకు దించి హార్న్ శబ్దాన్ని వినిపించే స్పీకర్ ముందు కూర్చోబెట్టారు. కానిస్టేబుల్ బస్సు హార్న్ మోగించాడు. ఆ భారీ శబ్దానికి ఓ డ్రైవర్ అదిరిపడ్డాడు. తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోకు భారీగా లైక్‌లు, వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఆ ట్రాఫిక్ పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. అనవసర శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలని చాలా మంది కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral Helmet Rule: ఇండియాలో ఇంతే.. హెల్మెట్ రూల్‌ను పెట్రోల్ బంక్ సిబ్బంది ఎలా పాటిస్తున్నారో చూడండి..


Viral News: కొంప ముంచిన పిల్లి.. చైనా మహిళ ఉద్యోగం ఊడింది.. బోనస్ పోయింది..


Optical Illusion Test: మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలోని రెండో డేగ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..


Viral Video: ఇదెక్కడి వింత.. ఈ పంపు నీటినే కాదు.. నిప్పును కూడా వదులుతోంది.. కారణమేంటి?


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 22 , 2025 | 07:10 PM