Share News

Viral Helmet Rule: ఇండియాలో ఇంతే.. హెల్మెట్ రూల్‌ను పెట్రోల్ బంక్ సిబ్బంది ఎలా పాటిస్తున్నారో చూడండి..

ABN , Publish Date - Jan 22 , 2025 | 05:52 PM

హెల్మెట్ విషయంలో బైకర్స్ ఉపయోగించే తెలివితేటలు అమోఘం అనే చెప్పాలి. చాలా మంది హెల్మెట్‌ను తమ భద్రత కోసం కాకుండా పోలీసుల కోసం పెట్టుకోవాలి అని భావిస్తుంటారు. అందువల్ల పోలీసులకు దొరకకుండా రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు.

Viral Helmet Rule: ఇండియాలో ఇంతే.. హెల్మెట్ రూల్‌ను పెట్రోల్ బంక్ సిబ్బంది ఎలా పాటిస్తున్నారో చూడండి..
Petrol Pump's Helmet Rule in UttarPradesh

మన దేశవాసుల భద్రత కోసం ప్రభుత్వం ఎన్నో నిబంధనలను (Rules) పెడుతుంటుంది. గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టినా పౌరులు మాత్రం వాటిని ఉల్లంఘించేందుకు అనంత కోటి దారులు వెతుకుంటారు. ముఖ్యంగా హెల్మెట్ (Helmet) విషయంలో బైకర్స్ ఉపయోగించే తెలివితేటలు మాత్రం అమోఘం అనే చెప్పాలి. చాలా మంది హెల్మెట్‌ను తమ భద్రత కోసం కాకుండా పోలీసుల కోసం పెట్టుకోవాలి అని భావిస్తుంటారు. అందువల్ల పోలీసులకు దొరకకుండా రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. (Viral Video)


ఉత్తరప్రదేశ్‌ (UttarPradesh) లో బైకర్స్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధన ఉంది. హెల్మెట్ లేని బైకర్లకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ వేయకూడదని గవర్నమెంట్ నిబంధన విధించింది. ఆ రూల్‌ను ఓ పెట్రోల్ బంక్ ఎలా బ్రేక్ చేస్తోందో చూస్తే షాకవడం ఖాయం. ఆ విషయాన్ని ఓ సోషల్ మీడియా యూజర్ బయటపెట్టాడు. gopalll అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ హెల్మట్ లేకుండా స్కూటీ వేసుకుని పెట్రోల్ బంక్ లోపలికి వెళ్లాడు. అక్కడ సిబ్బంది అతడికి హెల్మెట్ లేదు కాబట్టి.. తాత్కాలికంగా ఓ హెల్మెట్‌ను ఇచ్చారు. ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నాక అతడి బైక్‌లో పెట్రోల్ పోశారు. అంటే హెల్మెట్ లేకుంటే పెట్రోల్ వేయకూడదు కాబట్టి వాళ్లే ఓ హెల్మెట్‌ను పంప్ దగ్గర ఏర్పాటు చేశారన్నమాట.


తమ బంక్‌లో పెట్రోల్ సేల్స్ తగ్గకుండా ఉండేందుకు మేనేజ్‌మెంట్ చేసిన ఏర్పాటు అది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. లక్షల మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ``ఇండియాలో తెలివితేటల స్థాయి అది``, ``రూల్స్‌ను అతిక్రమించడానికి అద్భుతమైన తెలివితేటలు వాడతారు``, ``మన దేశంలో నైతిక బాధ్యత అనేది ఎవరికీ ఉండదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral News: కొంప ముంచిన పిల్లి.. చైనా మహిళ ఉద్యోగం ఊడింది.. బోనస్ పోయింది..


Optical Illusion Test: మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలోని రెండో డేగ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..


Viral Video: ఇదెక్కడి వింత.. ఈ పంపు నీటినే కాదు.. నిప్పును కూడా వదులుతోంది.. కారణమేంటి?


Viral Video: వామ్మో.. ఈ కుక్క చాలా డేంజర్.. తన ఢీకొన్న కారుపై ఎలా పగ తీర్చుకుంటోందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 22 , 2025 | 05:52 PM