Viral Video: చనిపోయిన వ్యక్తిని నరకానికి పంపించడమంటే ఇదే.. చుట్టూ చేరి వీళ్లు చేస్తున్న నిర్వాకం చూడండి..
ABN , Publish Date - Jan 22 , 2025 | 12:56 PM
చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో బంధువులు, స్నేహిుతులు, సన్నిహితులంతా పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. అంత్యక్రియల సమయంలో వారు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. మృతదేహాన్ని చితిపై పడుకోబెట్టి నిప్పంటించే సమయంలో..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు చేసే విచిత్ర ప్రయోగాలు, పిచ్చి పిచ్చి పనులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాగైనా నెట్టింట ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చనిపోయిన వ్యక్తికి కొందరు మద్యం, సిగరెట్లు తాగించడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘చనిపోయిన వ్యక్తిని నరకానికి పంపించడమంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో బంధువులు, స్నేహిుతులు, సన్నిహితులంతా పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. అంత్యక్రియల సమయంలో వారు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. మృతదేహాన్ని (dead body) చితిపై పడుకోబెట్టి నిప్పంటించే సమయంలో మృతుడి స్నేహితులంతా అక్కడికి చేరుకున్నారు.
Viral Video: ఎంత మందికైనా చిటికెలో చపాతీలు.. ఈమె ట్రిక్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
చనిపోయిన వ్యక్తికి ఎంతో ఇష్టమైన మందు, సిగరెట్లను (Alcohol and cigarette) తీసుకొని వచ్చారు. తీసుకురావడమే కాకుండా మృతదేహం నోరు తెరచి మందును పోశారు. ఆ తర్వాత సిగరెట్ వెలిగించి మరీ మృతదేహం నోట్లో పెట్టారు. ఇలా చాలా సేపు వారు మృతదేహం వద్దే నిల్చుని.. మందు, సిగరెట్లు తాగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: ఏనుగు మొండితనం ఎప్పుడైనా చూశారా.. మావటి వెనుక నిలబడి ఏం చేస్తుందో చూడండి..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘చనిపోయిన వ్యక్తిని మళ్లీ చంపడమంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేస్తే బతికున్న వారు కూడా చనిపోతారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వార్నీ.. వీడేంట్రా మరీ కామెడీగా ఉన్నాడే.. భిక్షం అడిగితే ఏం చేశాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..