Man Chewed Burning Wood: అగ్గి నిప్పులు నమిలేశాడు.. చివరకు జరిగింది చూస్తే..
ABN , Publish Date - Sep 23 , 2025 | 06:12 PM
ఓ వ్యక్తి చేసిన వినూత్నమైన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. అగ్గి నిప్పు సమీపానికి వెళ్తేనే అంతా భయపడతాం. పొరపాటున అగ్గి నిప్పు చేతికి తగిలితే ప్రాణం పోయినంత పనవుతుంటుంది. అయితే తాజాగా, అగ్గినిప్పులతో ఓ వ్యక్తి చేసిన డేంజరస్ స్టంట్ చూసి అంతా షాక్ అవుతున్నారు.
ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతో చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు వింత వింత ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొందరు ఎవరూ చేయలేని సాహసాలను ఎంతో అవలీలగా చేసేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి అగ్గినిప్పులను నమలడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేసిన వినూత్నమైన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. అగ్గి నిప్పు సమీపానికి వెళ్తేనే అంతా భయపడతాం. పొరపాటున అగ్గి నిప్పు చేతికి తగిలితే ప్రాణం పోయినంత పనవుతుంటుంది.
అయితే ఓ వ్యక్తి అగ్గి నిప్పును పట్టుకోవడం కాదు.. ఏకంగా నోట్లోనే పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా నిప్పులను (Man Chewed Burning Wood) బఠానీల తరహాలో కరకరా నమిలేశాడు. ఇంత చేసినా ఆ వ్యక్తి ముఖంలో ఎక్కడా అగ్గి నిప్పులు తింటున్న ఫీలింగ్ కలగలేదు. పైగా స్వీట్స్ తింటున్నట్లుగా ఎంజాయ్ చేస్తూ వాటిని నమలడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఇదెక్కడి విన్యాసంరా నాయనా’.. అంట కొందరు, ‘నరక ప్రయాణానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 వేలకు పైగా లైక్‌లు, 9 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..
పడుకుందామని వెళ్లాడు.. చివరకు దుప్పటి లోపల చూసి ఖంగుతిన్నాడు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి