Lemon Sold For Rs 13,000: ఒక్క నిమ్మకాయకు రూ.13 వేలు.. ఈ వేలంపాట చాలా స్పెషల్
ABN , Publish Date - Mar 06 , 2025 | 02:20 PM
Lemon Auction: నిమ్మకాయకు రూ.13 వేలు అంటే నమ్ముతారా.. కానీ ఇది నిజం. ఒక చోట వేలంపాటలో కేవలం ఒక్క నిమ్మకాయ ఏకంగా రూ.13 వేల భారీ ధర పలికింది. మరి.. అంత ధర చెల్లించి నిమ్మకాయను తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది.. అందులో అంత ప్రత్యేకత ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా ఒక నిమ్మకాయ ఖరీదు రూ.2 నుంచి రూ.5 లోపు ఉంటుంది. అదే వేసవి కాలమైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధర ఇంకాస్త పెరగొచ్చు. కానీ వందలు, వేలల్లో రేట్ మాత్రం పలకదు. కానీ ఒక నిమ్మకాయ ఏకంగా రూ.13 వేల ధర పలికింది. దీంతో అసలు అంతగా ఆ నిమ్మకాయలో ఏం ఉంది.. అంత భారీ ధర పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది.. అని అంతా ఆలోచనల్లో పడ్డారు. మరి.. అత్యంత భారీ ధర పలికిన ఆ నిమ్మకాయ ఎక్కడిది.. దాన్ని ఎవరు కొన్నారు.. అనేది ఇప్పుడు చూద్దాం..
భారీ క్రేజ్
తమిళనాడులోని ఎరోడ్ జిల్లా, విల్లకేతి గ్రామంలో మహా శివరాత్రి సంబురాలు ఘనంగా జరిగాయి. కరుప్ప ఈశ్వరన్ ఆలయంలో నిర్వహించిన సెలబ్రేషన్స్‌లో భారీగా భక్తులు పాల్గొన్నారు. ఇదే క్రమంలో ఆయలంలోని స్వామి వారి సన్నిధిలో సమర్పించిన నిమ్మకాయ, వెండి స్పూన్, వెండి కాయిన్‌ను ఎప్పటిలాగే వేలంలో ఉంచారు. ఇందులో తంగరాజ్ అనే ఓ భక్తుడు రూ.13 వేల ధర చెల్లించి నిమ్మకాయను సొంతం చేసుకున్నాడు. చిదంబరం అనే మరో భక్తుడు రూ.43,100 చెల్లించి సిల్వర్ రింగ్‌ను దక్కించుకున్నాడు. రవికుమార్ అనే ఇంకో భక్తుడు రూ.35,000 ధరకు సిల్వర్ కాయిన్‌ను గెలుచుకున్నాడు. వేలానికి ముందు ఈ అన్ని వస్తువులను స్వామి వారి వద్ద ఉంచి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఇలా దైవ సన్నిధిలోని వస్తువులను దక్కించుకుంటే బాగా కలిసొస్తుందని, కోరుకున్న కోరికలు నెరవేరతాయని అక్కడి భక్తుల విశ్వాసం. అందుకే నిమ్మకాయ కోసం అంత ధర చెల్లించడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది. కాగా, గతేడాది విల్లుపురంలోని మురుగన్ ఆలయంలో నిర్వహించిన వేలంపాటలో ఓ భక్తుడు 9 నిమ్మకాయలను ఏకంగా రూ.2.36 లక్షల ధరకు దక్కించుకోవడం విశేషం.
ఇవీ చదవండి:
వేప చెట్టు నుండి పాలు కారుతున్నాయోచ్..
పిల్లిలో తల్లి ప్రేమ.. పిల్లలను ఆడించడానికి ఎంత కష్టపడిందో చూస్తే..
థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం క్లిక్ చేయండి