Python Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. నాలా ద్వారా ఇంట్లోకి దూసుకొస్తున్న కొండచిలువ..
ABN , Publish Date - Jan 24 , 2025 | 08:24 AM
ఓ ఇంటి బయట నాల పైపుల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటి నాళా పైపు వద్ద ఓ కుక్క పదే పదే మొరుగుతూ కనిపించింది. మొదట ఎవరికీ అనుమానం కలగలేదు. చివరకు చూడగా.. నాలా పైపు గుండా ఇంట్లోకి వస్తున్న కొండచిలువ కనిపించింది...

సోషల్ మీడియాలో పాములు, కొండచిలువలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. బైకులు, కార్లలో దూరే పాములను చూశాం. అలాగే మంచాల కింద, ఫ్రిడ్జిలు, కూలర్లో దాక్కున్న పాములు, చివరికి ఇంటి సీలింగ్ నుంచి బయటికి వచ్చిన కొండచిలువలను కూడా చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. నాలా ద్వారా ఇంట్లోకి దూసుకొస్తున్న కొండచిలువను చూసి అంతా షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి బయట నాల పైపుల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటి నాళా పైపు వద్ద ఓ కుక్క పదే పదే మొరుగుతూ కనిపించింది. మొదట ఎవరికీ అనుమానం కలగలేదు. అయితే చాలా సేపు అలాగే మొరుగుతూ ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.
దగ్గరికి వెళ్లి చూడగా నాలా పైపులో వారికి షాకింగ్ సీన్ కనిపించింది. ఓ పెద్ద కొండచిలువ నాలా గుండా (Python entering the house through Nala pipe) ఇంట్లోకి దూసుకొస్తున్నట్లు కనిపించింది. అంత పెద్ద కొండచిలువ ఇలా నాలా పైపు ద్వారా ఇంట్లోకి చొరబడి రావడం చూసి అంతా షాక్ అవుతున్నారు. కుక్క మొరుగుతుండడంతో కాసేపు ఆగిపోయిన కొండచిలువ.. కొద్ది సేపటి తర్వాత యథావిధిగా మళ్లీ ముందుకు కదులుతూ ఉంది.
Funny Viral Video: పెళ్లిలో భోజనం చేస్తున్న వ్యక్తి.. వెనుక నుంచి వీళ్లు చేసిన పని చూస్తే..
ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘వామ్మో.. చూస్తుంటేనే గుండె ఆగిపోయేలా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘అంతపెద్ద కొండచిలువ అక్కడికి ఎలా వెళ్లింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 5.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇది కడుపా లేక కాంక్రీటా.. ఇటుకతో ఇతను ఏం చేశాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..