Share News

Kulu Manali Trip : రూ.15వేల ఖర్చుతోనే.. జంటగా మనాలీ చుట్టేయండి ఇలా..

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:25 PM

Kulu Manali Trip : ఇక రాబోయేది వేసవి కాలం. మండే ఎండల్లో ఫ్యామిలీతో కలిసి చల్లని ప్రదేశాల్లో సేద తీరేందుకు, సరదాగా గడిపేందుకు మన దేశాల్లో చెప్పుకోదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ కూడా ఒకటి. సాధారణంగా తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేందుకు చాలా ఖర్చవుతుందని అనుకుంటారు. ఇలా ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే హిమాలయ అందాలను ఆస్వాదించవచ్చు.

Kulu Manali Trip : రూ.15వేల ఖర్చుతోనే.. జంటగా మనాలీ చుట్టేయండి ఇలా..
manali trip cost for 3 days for couples

Kulu Manali Trip : వేసవిలో ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు కులూ మనాలీని అత్యద్భుతమైన ప్రదేశం. చుట్టూ తెల్లగా మెరిసిపోయే హిమాలయ పర్వతాలు, ప్రశాంతంగా వయ్యారంగా వంపులు తిరుగుతూ ప్రవహించే నదులు, నేలపై ప్రకృతి నేసిన ఆకుపచ్చని తివాచీలు కనువిందు చేస్తాయి. వాటి మధ్యన గడిపే ప్రతి క్షణం మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. ఎండాకాలంలో ఇలాంటి చోట చల్లటి గాలిని ఆస్వాదిస్తే వచ్చే మజానే వేరు. తెలుగు రాష్ట్రాల నుంచి మనాలీ వెళ్లేందుకు మీరు అనుకుంటున్నట్లుగా ఎక్కువ ఖర్చేం కాదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మినిమం బడ్జెట్‌లోనే మనాలీ చుట్టేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..


మనాలీలో చూడదగ్గ ప్రదేశాలు..

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ అద్భుతమైన హిల్ స్టేషన్. ఇక్కడ తప్పక సందర్శించాల్సిన కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో చారిత్రాత్మక హడింబా దేవి ఆలయం ఒకటి. సాహస క్రీడలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలకు సోలాంగ్ వ్యాలీ ప్రసిద్ధి. స్కీయింగ్, ట్రెక్కింగ్, అత్యద్భుతమైన సుందర దృశ్యాలకు నెలవైన రోహ్‌తాంగ్ పాస్.. టిబెటన్ సంస్కృతి, ఆధ్యాత్మికతను అన్వేషించడానికి ప్రశాంతమైన వశిష్ట టిబెటన్ ఆశ్రమం, అద్భుతమైన దృశ్యాలు, వేడి నీటి బుగ్గలు, స్థానిక సంస్కృతిని పరిచయం చేసే కులు మణికరణ్ చూడదగ్గ ముఖ్యమైన ప్రాంతాలు.

Temple.jpg


కనీస బడ్జెట్‌తో మనాలీ ట్రిప్ ప్లాన్..

బస్సు : ఇద్దరు వ్యక్తులకు తెలుగు రాష్ట్రాల నుండి ఢిల్లీకి బస్సు ఛార్జీ ₹3,000 - ₹6,000. ఢిల్లీ నుండి మనాలికి ే₹1,600 - ₹3,000. మొత్తంగా ₹4,600 - ₹9,000 వరకూ అవుతుంది. మనాలీలో వసతి ఖర్చులు ఒక రాత్రికి ₹750 - ₹1,500. ఆహారానికి రోజుకు ₹750 - ₹1,500. స్థానిక రవాణా, ఇతర ఖర్చులు కలిపి ఇద్దరు వ్యక్తులు ₹14,600 - ₹29,000 ఖర్చుతో మనాలీ సందర్శించవచ్చు. నలుగురు వ్యక్తులకైతే బస్సు ఛార్జీ ఖర్చులు తెలుగు రాష్ట్రాల నుండి ఢిల్లీకి ₹6,000 - ₹12,000. ఢిల్లీ నుండి మనాలికి ₹3,200 - ₹6,000. మొత్తం ప్రయాణ ఖర్చులు ₹29,200 - ₹58,000 వరకూ అవుతాయి.

Manali-tour.jpg


IRCTC ప్యాకేజీలు..

IRCTC తెలుగు రాష్ట్రాల నుండి కులు మనాలి ప్యాకేజీని అందిస్తోంది.

ప్యాకేజీ పేరు: కులూ మనాలి టూర్ ప్యాకేజీ

బయలుదేరే స్థలం: హైదరాబాద్/సికింద్రాబాద్

గమ్యస్థానం: కులు మనాలి

వ్యవధి: 6 రాత్రులు/7 పగళ్లు. మనాలిలో 3 రాత్రులు. చండీగఢ్‌లో 2 రాత్రులు. సోలాంగ్ వ్యాలీ, కులు, మనాలీలోని స్థానిక దర్శనీయ స్థలాలు సందర్శించవచ్చు. అల్పాహారం, రాత్రి భోజనం ఉచితం. (భోజనం, స్నాక్స్, వ్యక్తిగత ఖర్చులు, అదనపు సందర్శనా స్థలాలు ఖర్చుల్లో మినహాయింపు)

ప్యాకేజీ ఖర్చు:

సింగిల్ ఆక్యుపెన్సీ: ₹34,990

డబుల్ ఆక్యుపెన్సీ: ₹29,990

ట్రిపుల్ ఆక్యుపెన్సీ: ₹26,990

బుకింగ్: IRCTC వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ బుకింగ్ అందుబాటులో ఉంది. IRCTC పాలసీ ప్రకారం రద్దు ఛార్జీలు వర్తిస్తాయి.

ధరలు ప్యాకేజీ వివరాలు మారవచ్చు. మీ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి IRCTC వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్ చేయండి.

vacation.jpg


విమాన ఖర్చులు : హైదరాబాద్ నుండి ఢిల్లీ/చండీగఢ్ ₹4,000 - ₹6,000.

విశాఖపట్నం నుండి ఢిల్లీ/చండీగఢ్ ₹5,000 - ₹7,000.

ఢిల్లీ/చండీగఢ్ నుండి మనాలి ₹2,000 - ₹3,000.

వసతి, టాక్సీ రవాణా, ఆహారం తదితర ఖర్చులు కలుపుకుంటే 2 రోజుల మనాలీ ట్రిప్ కోసం హైదరాబాద్ నుంచి ₹18,000 - ₹25,000. విశాఖపట్నం నుంచి ₹20,000 - ₹28,000 వరకూ ఖర్చవుతుంది.


Read Also: Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్

నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద కదలిక.. ఏముందా అని

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

మరిన్ని ప్రత్యేక, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 05:21 PM