
Breaking News: నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు
ABN , First Publish Date - Apr 28 , 2025 | 02:31 PM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-04-28T18:43:08+05:30
గోరంట్ల మాధవ్‌కు కండీషనల్ బెయిల్
గుంటూరు: వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌కు కండీషనల్ బెయిల్
ప్రతి శనివారం నగరంపాలెం పీఎస్‌లో సంతకం చేయాలన్న కోర్టు
రెండు నెలలపాటు పీఎస్‌లో సంతకం చేయాలని కోర్టు ఆదేశం
రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు జామీన్లతో బెయిల్ మంజూరు
చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నించిన కేసులో అరెస్టయి..
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గోరంట్ల
-
2025-04-28T18:42:35+05:30
కాల్పుల కలకలం
అనంతనాగ్‌లో మరోసారి కాల్పుల కలకలం
ఈనెల 22న పహల్గామ్‌లో ఉగ్రదాడి
మరోసారి అదే ప్రాంతంలో కాల్పులు
-
2025-04-28T18:41:38+05:30
సీఎం చంద్రబాబుతో ముగిసిన రాజధాని రైతుల సమావేశం
రాజధాని అభివృద్ధికి ఫేజ్-2 భూసేకరణ తప్పనిసరి: చంద్రబాబు
అంతర్జాతీయ విమానాశ్రయం వస్తేనే అమరావతి అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుంది: చంద్రబాబు
లేనిపక్షంలో మున్సిపాలిటీగా మిగిలిపోతుంది: చంద్రబాబు
అమరావతిని మున్సిపాలిటీగా చూడాలనుకుంటున్నారా, అంతర్జాతీయ స్థాయి నగరంలా చూడాలనుకుంటున్నారా? అడిగిన సీఎం చంద్రబాబు
అమరావతి అభివృద్ధి విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి ఏకగ్రీవంగా అంగీకరిస్తామన్న రాజధాని రైతులు
-
2025-04-28T18:40:22+05:30
రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
తెలుగు రాష్ట్రాల్లో ఏడుగురికి 'పద్మ' అవార్డులు
వైద్య విభాగంలో దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్
సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్
ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణకు పద్మశ్రీ
విద్య, సాహిత్యం విభాగంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ
కళారంగంలో మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ
కళారంగంలో మిరియాల అప్పారావుకు పద్మశ్రీ
విద్య, సాహిత్యం విభాగంలో రాఘవేంద్రాచార్యకు పద్మశ్రీ
-
2025-04-28T18:17:47+05:30
నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు
10 జిల్లాలకు సహకార బ్యాంక్, సంఘాల ఛైర్మన్ల నియామకం
శ్రీకాకుళం డీసీసీబీ చైర్మన్‌గా శివ్వల సూర్యనారాయణ(TDP)
విశాఖ డీసీసీబీ చైర్మన్‌గా కోన తాతారావు( జనసేన)
విజయనగరం డీసీసీబీ చైర్మన్‌గా కిమిడి నాగార్జున(TDP)
గుంటూరు డీసీసీబీ చైర్మన్‌గా మాకినేని మల్లికార్జునరావు(TDP)
కృష్ణా డీసీసీబీ చైర్మన్‌గా నెట్టెం రఘరామ్(TDP)
నెల్లూరు డీసీసీబీ చైర్మన్‌గా ధనుంజయరెడ్డి(TDP)
చిత్తూరు డీసీసీబీ చైర్మన్‌గా అమాస రాజశేఖర్‌రెడ్డి(TDP)
అనంతపురం డీసీసీబీ చైర్మన్‌గా కేశవరెడ్డి(TDP)
కర్నూలు డీసీసీబీ చైర్మన్‌గా విష్ణువర్థన్‌రెడ్డి(TDP)
కడప డీసీసీబీ చైర్మన్‌గా బి. సూర్యనారాయణరెడ్డి(TDP)
శ్రీకాకుళం DCMS చైర్మన్‌గా అవినాష్ చౌదరి(TDP)
విశాఖ DCMS చైర్మన్‌గా కొట్ని బాలాజీ(TDP)
విజయనగరం DCMS చైర్మన్‌గా గొంప కృష్ణ(TDP)
గుంటూరు DCMS చైర్మన్‌గా వడ్రాణం హరిబాబు(TDP)
కృష్ణా DCMS చైర్మన్‌గా బండి రామకృష్ణ(జనసేన)
నెల్లూరు DCMS చైర్మన్‌గా గొనుగోడు నాగేశ్వరరావు(TDP)
చిత్తూరు DCMS చైర్మన్‌గా సుబ్రమణ్యం నాయుడు(TDP)
అనంతపురం DCMS చైర్మన్‌గా నెట్టెం వెంకటేశ్వర్లు(TDP)
కర్నూలు DCMS చైర్మన్‌గా నాగేశ్వరయాదవ్(TDP)
కడప DCMS చైర్మన్‌గా యర్రగుండ్ల జయప్రకాశ్(TDP)
-
2025-04-28T18:04:46+05:30
కరీంనగర్ డీసీసీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత
ఇన్‌ఛార్జ్ పురమళ్ళ శ్రీనివాస్‌పై కాంగ్రెస్ శ్రేణుల దాడి
కరీంనగర్ జిల్లా డీసీసీ ఆఫీస్ నుంచి వెళ్ళే ఫైళ్లను..
మంత్రి పొన్నం అడ్డుకుంటున్నారంటూ శ్రీనివాస్ వ్యాఖ్యలు
శ్రీనివాస్ వ్యాఖ్యలతో రెండు గ్రూపుల మధ్య తీవ్ర వాగ్వాదం
AICC సెక్రటరీ విశ్వనాథన్ ఎదుటే తోపులాట, ఘర్షణ
-
2025-04-28T17:51:14+05:30
విచారణ వాయిదా..
కౌశిక్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌పై టీజీ హైకోర్టులో విచారణ వాయిదా
హనుమకొండలో నమోదైన కేసు కొట్టేయాలని కౌశిక్‌రెడ్డి పిటిషన్
రూ.50 లక్షలు ఇవ్వాలని క్యారీ వ్యాపారిని బెదిరించారని కేసు
తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
-
2025-04-28T17:21:42+05:30
నరసరావుపేట కోర్టుకు బోరుగడ్డ అనిల్
పల్నాడు: నరసరావుపేట కోర్టుకు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్
పీటీ వారెంట్‌పై కోర్టులో హాజరుపరిచిన ఫిరంగిపురం పోలీసులు
బోరుగడ్డ అనిల్‌కి మే 9వరకు రిమాండ్ విధించిన కోర్టు
అనంతపురం జిల్లా జైలుకి బోరుగడ్డ అనిల్ తరలింపు
-
2025-04-28T17:16:28+05:30
హైకోర్టులో TGPSC పిటిషన్.. ఎందుకంటే..
గ్రూప్-1పై తెలంగాణ హైకోర్టులో అప్పీల్ పిటిషన్
సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులపై TGPSC పిటిషన్
గ్రూప్-1 నియామకంపై ఇప్పటికే స్టే విధించిన సింగిల్ బెంచ్
విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని గతంలో ఆదేశం
TGPSC అప్పీల్‌పై రేపు తెలంగాణ హైకోర్టు విచారణ
-
2025-04-28T15:44:46+05:30
కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్..
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పదేళ్లుగా నల్లగొండ జిల్లాను నిర్లక్ష్యం చేశారు: మంత్రి ఉత్తమ్
డిండి, ఏదుల ప్రాజెక్టులను కేసీఆర్ పట్టించుకోలేదు: మంత్రి ఉత్తమ్
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు నల్లగొండ జిల్లా నాయకులం మద్దతు తెలుపుతున్నాం: మంత్రి ఉత్తమ్
SLBC సొరంగం పనులను కేసీఆర్ పట్టించుకోలేదు: మంత్రి ఉత్తమ్
-
2025-04-28T14:48:18+05:30
ఘోర రోడ్డుప్రమాదం
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు, ఐదుగురు మృతి
పాకాల మండలం తోటపల్లి దగ్గర ఘటన
ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు
-
2025-04-28T14:47:14+05:30
టీడీపీ నాయకుల అసహనం..
ప.గో.: టీడీపీ కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం
పాల్గొన్న టీడీపీ నేతలు చిట్టిబాబు, బాబ్జీ, పలువురు నేతలు
చిట్టిబాబుపై అసహనం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు
పార్టీ కోసం కష్టపడిన పనిచేసిన వారికి గుర్తింపు లేదని ఆవేదన
-
2025-04-28T14:45:51+05:30
తెలంగాణ సీఎస్ కు నూతన పదవి..
MCHRD వైస్ చైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతికుమారి
శాంతికుమారిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
ఈనెల 30న సీఎస్‌గా పదవీ విరమణ చేయనున్న శాంతికుమారి
-
2025-04-28T14:34:06+05:30
పహల్గామ్ దాడి ఘటన.. సంతాప సభ..
అమరావతి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పహల్గామ్ దాడి ఘటనపై సంతాప సభ
కార్యక్రమానికి హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పార్టీ శ్రేణులు
-
2025-04-28T14:31:55+05:30
బంజారాహిల్స్‌లో ఈడీ దాడులు
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఈడీ దాడులు
మునావర్ నివాసంలో ఉదయం నుంచి కొనసాగుతోన్న సోదాలు
భూదాన్ భూముల వ్యవహారంలో కీలకంగా ఉన్న మునావర్
గ్యాంగ్‌గా ఏర్పడి భూదాన్ భూములు కొట్టేసిన మునవార్
మునావర్ నివాసంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఈడీ
మునావర్‌కు చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లోనూ తనిఖీలు
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో 34 వాహనాలు సీజ్ చేసిన ఈడీ