
Breaking News: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ..
ABN , First Publish Date - May 27 , 2025 | 09:24 AM
TDP Mahanadu 2025 Live: కడప జిల్లాలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సహా టీడీపీ శ్రేణులు తండోపతండాలుగా తరలివచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

Live News & Update
-
May 27, 2025 18:21 IST
భారీ వర్షాలు..
దక్షిణ తెలంగాణలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు
గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
రేపు తెలంగాణలోని 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ: వాతావరణ శాఖ
-
May 27, 2025 18:14 IST
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ..
మాదిగ సామాజికవర్గ టి.కాంగ్రెస్ MLAల రహస్య భేటీ.
పాల్గొన్న లక్ష్మీకాంతరావు, సామెల్, కవ్వంపల్లి.
మాదిగలకు కేబినెట్‌లో చోటు కల్పించాలని డిమాండ్.
మీనాక్షి నటరాజన్‌తో ఫోన్‌లో సంప్రదింపులు.
బుధవారం నాడు స్వయంగా కలవాలని మీనాక్షి నటరాజన్ సూచన.
-
May 27, 2025 16:11 IST
రాజకీయ నేతలు భాష మార్చుకోవాలి: లోకేష్
అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం.
నా తల్లి ఎంత ఆవేదన చెందారో కళ్లారా చూశా.
కానీ మేం జగన్ కుటుంబాన్ని ఒక్క మాట అనడం లేదు.
మేం రాష్ట్రానికి మంచి చేస్తాం.. 2029లో ప్రజలే డిసైడ్ చేస్తారు.
రెడ్‌బుక్ పేరు చెబితే చాలామంది భయపడుతున్నారు.
కొందరు అడవుల్లోకి వెళ్తే.. కొందరు బాత్‌రూమ్‌ల్లో జారిపడుతున్నారు.
మరికొందరు ఆస్పత్రుల పాలవుతున్నారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలు, చేసిన పనులపై త్వరలో సమీక్ష.
-
May 27, 2025 16:09 IST
వైఎస్ జగన్‌కు మంత్రి నారా లోకేష్ సవాల్
URSA కంపెనీకి ఎకరం 99 పైసలకు ఇచ్చామని నిరూపిస్తే.. నా పదవికి రాజీనామా చేస్తా.
జగన్ తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉంది.
వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను తరిమేసింది.
లిక్కర్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగుతోంది.
కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి జిందాల్ కంపెనీ ముందుకొచ్చింది.
మరో 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తారు.
-
May 27, 2025 15:22 IST
టీడీపీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్
మహానాడులో నోటిఫికేషన్
సా.5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
రేపు నామినేషన్ల పరిశీలన
-
May 27, 2025 13:14 IST
వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు చూశాం: మంత్రి లోకేష్
గత వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారు: మంత్రి లోకేష్
సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశారు: లోకేష్
సమాజంలో ఆడవాళ్లను చులకనగా మాట్లాడారు: లోకేష్
గతంలో ఓ మహిళా మంత్రి నాకు చీర, గాజులు పంపారు: లోకేష్
అవమానించిన వారి పరిస్థితి ఏమైంది.. అర్థమైందా రాజా?: లోకేష్
-
May 27, 2025 13:14 IST
నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలు తీసుకొచ్చాం: లోకేష్
1. తెలుగు జాతి-విశ్వ ఖ్యాతి
2. పేదల సేవలో-సోషల్ రీఇంజినీరింగ్
3. స్త్రీ శక్తి
4. అన్నదాతకు అండగా
5. యువగళం
6. కార్యకర్తే అధినేత
ఈ 6 శాసనాలు తప్పకుండా అమలు చేస్తాం: లోకేష్
-
May 27, 2025 13:14 IST
కార్యకర్తలే పార్టీకి బలం, బలగం: మంత్రి నారా లోకేష్
ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పది: లోకేష్
పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే నాకు స్ఫూర్తి..
తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ: లోకేష్
మనకు ప్రతిపక్షం కొత్త కాదు.. అధికారం కొత్తకాదు..
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే నిలబడ్డాం
మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు అవసరం
తెలుగువారి ఆత్మగౌరవమే పార్టీ మూల సిద్ధాంతం: లోకేష్
-
May 27, 2025 12:40 IST
తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు
పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు రాజ్యాధికారం: చంద్రబాబు
రూ.2 కిలో బియ్యం, సబ్సిడీ కరెంట్ టీడీపీ తెచ్చినవే: చంద్రబాబు
అన్ని ప్రాంతాలు, వర్గాల అభివృద్ధే టీడీపీ లక్ష్యం: చంద్రబాబు
-
May 27, 2025 12:40 IST
గతంలో విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: చంద్రబాబు
పాలన అంటే వేధింపులే అన్నట్లు గతంలో వ్యవహరించారు: సీఎం చంద్రబాబు
తెలుగుదేశంతోనే సామాజిక న్యాయం: చంద్రబాబు
బీసీలను అధికారంలో భాగస్వాములం చేశాం: చంద్రబాబు
అవినీతి రహిత పాలన అందిస్తున్నాం: చంద్రబాబు
ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడ్డాం: చంద్రబాబు
జవాబుదారీ వ్యవస్థను దేశానికే పరిచయం చేశాం: చంద్రబాబు
భావితరాల భవిష్యత్ కోసం కార్యక్రమాలు రూపకల్పన: చంద్రబాబు
-
May 27, 2025 12:39 IST
రాష్ట్రం ఫస్ట్ అనేదే టీడీపీ నినాదం: సీఎం చంద్రబాబు
కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇచ్చి సంక్షేమం అందిస్తాం: సీఎం చంద్రబాబు
సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా పార్టీ ప్రస్థానం సాగుతోంది: చంద్రబాబు
సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధికి టీడీపీనే ట్రెండ్ సెట్టర్: చంద్రబాబు
స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం: చంద్రబాబు
2047కి జీరో పావర్టీ సాధిస్తాం: చంద్రబాబు
ప్రజల్లో ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం: చంద్రబాబు
అందరూ ఆరోగ్యం, ఆనందంగా ఉండాలన్నదే మన విధానం: చంద్రబాబు
-
May 27, 2025 12:39 IST
రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ టీడీపీ: చంద్రబాబు
ప్రాంతీయ పార్టీగా పుట్టి.. జాతీయస్థాయిలో ఎదిగాం: చంద్రబాబు
పార్టీ పనైపోయిందన్నవారి పనే అయిపోయింది: చంద్రబాబు
ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను ఎదుర్కొన్నాం: చంద్రబాబు
నీతి, నిజాయితీకి టీడీపీ బ్రాండ్: చంద్రబాబు
-
May 27, 2025 12:37 IST
ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నాం: చంద్రబాబు
ఒక్కో ఇటుక పేరుస్తూ రాష్ట్రాన్ని నిలబెడుతున్నాం: చంద్రబాబు
2024లో ఏపీ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వచ్చాయి: చంద్రబాబు
కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది: చంద్రబాబు
2024 ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో ఆశలు చిగురించాయి: చంద్రబాబు
-
May 27, 2025 12:36 IST
ఏపీలో నేరస్తులకు చోటు లేదు: సీఎం చంద్రబాబు
ఎవరు అవినీతి చేసినా మొత్తం కక్కిస్తాం: చంద్రబాబు
తప్పు చేసిన వారికి కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదు: సీఎం చంద్రబాబు
నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టం: చంద్రబాబు
వైసీపీ అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేశాం: సీఎం చంద్రబాబు
ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతిపరులను తరిమేశారు: సీఎం చంద్రబాబు
అక్రమార్కులను శిక్షించే బాధ్యత మనకు అప్పగించారు: చంద్రబాబు
-
May 27, 2025 12:36 IST
వాట్సాప్ గవర్నెన్స్ ఒక గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
ఏడాదిలో 3 విడతలుగా అన్నదాత సుఖీభవ: చంద్రబాబు
కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి 3 విడతల్లో రూ.20 వేలు: చంద్రబాబు
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: చంద్రబాబు
దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలి: చంద్రబాబు
వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ మా విధానం: సీఎం చంద్రబాబు
-
May 27, 2025 12:16 IST
పసుపు సింహం చంద్రన్నను దారుణంగా చంపారు: చంద్రబాబు
ఎంతోమంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు: చంద్రబాబు
కార్యకర్తల పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుంది: చంద్రబాబు
కార్యకర్తల త్యాగాలను వృథా కానివ్వం: చంద్రబాబు
నా పాదయాత్ర నుంచి లోకేష్ యువగళం వరకు కార్యకర్తల్లో అదే స్ఫూర్తి, అదే పోరాట పటిమ: చంద్రబాబు
జెండా మోస్తున్న కార్యకర్తలే టీడీపీ బలం: చంద్రబాబు
-
May 27, 2025 12:16 IST
కార్యకర్తల పోరాటాలతోనే అధికారంలోకి వచ్చాం: చంద్రబాబు
ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాటం చేశారు: చంద్రబాబు
గతంలో ప్రశ్నించే గొంతులను నొక్కారు: చంద్రబాబు
అక్రమ కేసులు పెట్టి హింసించారు: చంద్రబాబు
ప్రశ్నించిన కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు: చంద్రబాబు
-
May 27, 2025 12:06 IST
మహానాడు.. సీఎం చంద్రబాబు ప్రసంగం..
తొలిసారి దేవునిగడప కడపలో మహానాడు: సీఎం చంద్రబాబు
ఈసారి మహానాడు చరిత్ర సృష్టించబోతోంది: చంద్రబాబు: సీఎం చంద్రబాబు
ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గానూ 7 చోట్ల గెలిచాం: సీఎం చంద్రబాబు
ఈసారి మరింత కష్టపడి మొత్తం 10 స్థానాలు గెలవాలి: చంద్రబాబు
-
May 27, 2025 11:20 IST
ఉగ్రదాడి.. సంతాపం..
ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్తలకు మహానాడు సంతాపం
పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు మహానాడు సంతాపం
-
May 27, 2025 11:20 IST
కడపలో మహానాడు కోలాహలం
మహానాడుకు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
6 అంశాలపై తీర్మానం చేయనున్న మహానాడు
కార్యకర్తే అధినేత, యువగళం, తెలుగుజాతి-విశ్వఖ్యాతి..
స్త్రీ శక్తి, సామాజిక న్యాయం-పేదల ప్రగతి అంశాలపై చర్చ, తీర్మానాలు
పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
May 27, 2025 11:20 IST
మహానాడు.. జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం చంద్రబాబు
మహానాడు ప్రతినిధుల సభా వేదికపై చంద్రబాబు
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు
వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం చంద్రబాబు
వేదికపై పార్టీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు
కాసేపట్లో సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసం
-
May 27, 2025 11:20 IST
కడప: మహానాడు సభా ప్రాంగణంలో చంద్రబాబు
మహానాడు ప్రాంగణంలో సభ్యత్వ నమోదు సహా..
రిజిస్ట్రేషన్ చేయించుకున్న సీఎం చంద్రబాబు
ఫొటో ప్రదర్శనను తిలకించిన చంద్రబాబు
-
May 27, 2025 11:17 IST
లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు: పల్లా శ్రీనివాస్
అభివృద్ధి వికేంద్రీకరణపై మహానాడులో చర్చిస్తాం: ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్
లోకేష్‌కు పార్టీ పగ్గాలపై మహానాడులో నిర్ణయం: పల్లా శ్రీనివాస్
పార్టీని లోకేష్ సమర్థంగా నడిపిస్తారనే నమ్మకం ఉంది: పల్లా శ్రీనివాస్
ఇప్పటికే లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు: పల్లా శ్రీనివాస్
లోకేష్‌కు పగ్గాలు అప్పగించాలన్నదే కేడర్ కోరిక: పల్లా శ్రీనివాస్
-
May 27, 2025 11:15 IST
కడపలో మహానాడు కోలాహలం..
మహానాడుకు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
450 మంది కూర్చునేలా వేదిక.. 300 ఎకరాల్లో పార్కింగ్
6 అంశాలపై తీర్మానం చేయనున్న మహానాడు
కార్యకర్తే అధినేత, యువగళం, తెలుగుజాతి-విశ్వఖ్యాతి..
స్త్రీ శక్తి, సామాజిక న్యాయం-పేదల ప్రగతి అంశాలపై చర్చ, తీర్మానాలు
పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
May 27, 2025 10:10 IST
ఎదురుకాల్పులు, మావోయిస్టు కీలక నేత హతం..
జార్ఖండ్‌లో ఎదురుకాల్పులు, మావోయిస్టు కీలక నేత మృతి
మృతుడిపై రూ.15 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపిన పోలీసులు
ఘటనా స్థలిలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం
-
May 27, 2025 10:10 IST
టీడీపీకి వారే బలం, బలగం: మంత్రి నారా లోకేష్
కార్యకర్తలే పార్టీకి బలం, బలగం: మంత్రి నారా లోకేష్
ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పది: లోకేష్
పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే నాకు స్ఫూర్తి: లోకేష్
-
May 27, 2025 10:10 IST
ఉగ్రకుట్ర.. కేసు విచారణ..
విజయనగరం: ఐదోరోజు పేలుళ్ల కుట్ర కేసు నిందితుల విచారణ
నిందితులు సిరాజ్, సమీర్‌ను ప్రశ్నించనున్న NIA, ATS, ఇంటెలిజెన్స్
-
May 27, 2025 10:10 IST
గుజరాత్‌లో ప్రధాని మోదీ..
గుజరాత్‌లో ప్రధాని మోదీ రెండోరోజు పర్యటన
అర్బన్ గ్రోత్ స్టోరీ 20 ఏళ్ల వేడుకలో పాల్గొననున్న మోదీ
గాంధీనగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
-
May 27, 2025 09:46 IST
కన్నప్ప సినిమా టీమ్‌కు షాక్..
హైదరాబాద్: కన్నప్ప సినిమా హార్డ్‌డ్రైవ్ మాయం
24 ఫ్రేమ్స్ సంస్థ ఉద్యోగులపై కేసు నమోదు
యువతి చరితతో పాటు మరో వ్యక్తిపై ఫిల్మ్‌నగర్ పీఎస్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఫిర్యాదు
-
May 27, 2025 09:46 IST
900కి పైగా డ్రోన్లు దాడి చేశాయి: జెలెన్ స్కీ
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
3 రోజుల్లో 900కి పైగా రష్యా డ్రోన్ల దాడి: జెలెన్ స్కీ
శాంతిచర్చలు జరిపినా దాడులు ఆపలేదు: జెలెన్ స్కీ
రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, యూరప్‌లు కఠిన ఆంక్షలు విధించాలి: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
-
May 27, 2025 09:24 IST
పాక్ గూఢచారి అరెస్ట్..
పాక్‌కు గూఢచర్యం చేస్తున్న CRPF ASI మోతీరామ్ అరెస్టు
ఉగ్రదాడికి ముందు పహల్గామ్‌లోనే మోతీరామ్‌కు పోస్టింగ్
పాక్‌కు మోతీరామ్ కీలక సమాచారం చేరవేసినట్లు NIA వెల్లడి