Share News

TDP Mahanadu: టీడీపీ కార్యకర్తలే నా బలం.. బలగం: సీఎం చంద్రబాబు

ABN , First Publish Date - May 29 , 2025 | 09:47 AM

టీడీపీ మహానాడు మూడో రోజు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఏపీలోని కడప జిల్లాలో జరుగుతున్న మహానాడుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు..

TDP Mahanadu: టీడీపీ కార్యకర్తలే నా బలం.. బలగం: సీఎం చంద్రబాబు

Live News & Update

  • May 29, 2025 19:54 IST

    వల్లభనేని వంశీకి బెయిల్..

    • అమరావతి: నకిలీ ఇళ్లపట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్

    • ఆరోగ్య పరిస్థితి పరిశీలించి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

    • గన్నవరం మైన్స్ కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు

    • వంశీని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశం

  • May 29, 2025 18:50 IST

    కడప ఎయిర్‌పోర్టుకు ఏపీ సీఎం చంద్రబాబు..

    • కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

    • రేపు ఢిల్లీలో CII సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు

    • రేపు రాత్రి ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస

    • ఎల్లుండి ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రికి చంద్రబాబు

    • గున్నేపల్లిలో పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న చంద్రబాబు

    • జూన్ 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లు

    • అనంతరం గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి

  • May 29, 2025 18:50 IST

    రోజుకో స్లోగన్‌.. సీజన్‌కో వాగ్దానం: హరీష్ రావు

    • ఇటీవల రైజింగ్‌ తెలంగాణ అన్నారు: మాజీ మంత్రి, ఎమ్మెల్సే హరీష్ రావు

    • ఇప్పుడు 2047-రైజింగ్‌ తెలంగాణ అంటున్నారు: హరీష్‌రావు

    • రోజుకో స్లోగన్‌.. సీజన్‌కో వాగ్దానం.. కానీ ఏదీ నెరవేరలేదు: హరీష్‌రావు

    • మీ తుగ్లక్‌ ఆలోచనలతో రాష్ట్రం తిరోగమనం: హరీష్‌రావు

    • ఇది తెలంగాణ రైజింగ్‌ కాదు.. తెలంగాణ ఫెయిలింగ్‌: హరీష్‌రావు

  • May 29, 2025 18:50 IST

    కలకలం సృష్టిస్తున్న జంట ఆత్మహత్య..

    • తిరుపతి: నాయుడుపేట హోటల్‌లో జంట ఆత్మహత్య

    • మృతులు దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాలెం వాసులు సుబ్రహ్మణ్యం, శిరీషగా గుర్తింపు

    • సుబ్రహ్మణ్యం గొంతు కోసుకోగా.. ఉరి వేసుకుని శిరీష సూసైడ్‌

    • ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణంగా పోలీసుల అనుమానం

  • May 29, 2025 18:32 IST

    భారత ఎయిర్‌స్ట్రైక్స్‌పై స్పందించిన పాక్‌ ప్రధాని షాబాజ్

    • మేం దాడి చేయాలనుకుని ప్లాన్‌ చేశాం.. ఈలోగానే.. భారత్‌ మాపై బ్రహ్మోస్‌ను ప్రయోగించింది: పాక్‌ ప్రధాని షాబాజ్‌

    • రావల్పిండి లక్ష్యంగా భారత్‌ దాడులు చేసింది: పాక్‌ ప్రధాని షాబాజ్‌

    • పాక్‌లోని అనేక ప్రావిన్సులపై క్షిపణి దాడులు చేశారు: షాబాజ్

    • దాడి విషయాన్ని ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌ చెప్పారు: షాబాజ్

  • May 29, 2025 18:32 IST

    కాలం చెల్లిన రూపాయి ప్రధాని మోదీ: రేవంత్‌

    • దేశానికి రాహుల్‌ నాయకత్వం అవసరం: రేవంత్‌

    • బలూచిస్థాన్‌ను విడగొట్టి మరో దేశంగా చేయమన్నాం: రేవంత్‌

    • ఇది చేతకాదు కానీ.. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు: రేవంత్‌

    • యుద్ధంలో ఎన్ని రఫెల్‌ విమానాలు నేలకూలాయో లెక్క చెప్పండి..

    • పాక్‌ను ఓడించాలంటే ఇందిరాగాంధీ మార్గంలో నడవాలని ప్రధాని మోదీకి సూచించాం: రేవంత్

  • May 29, 2025 18:32 IST

    ఇందిరాగాంధీని ప్రధాని మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలి: రేవంత్‌

    • 1967 చైనా, 71లో పాక్‌ను ఓడించినందుకా కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు?

    • మోదీకి వీరతిలకం దిద్ది యుద్ధం చేయాలని చెబితే..

    • ఎందుకు వెనుకడుగు వేశారో బీజేపీ నేతలే చెప్పాలి: రేవంత్‌

    • ట్రంప్‌ బెదిరించగానే మోదీ ఎందుకు తలొగ్గారు?: రేవంత్‌రెడ్డి

    • ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం.. మీ సొంత వ్యవహారం కాదు

    • భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్‌ దగ్గర తాకట్టు పెడతారా?: రేవంత్‌

    • యుద్ధం అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు: రేవంత్‌

    • దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి: రేవంత్‌

    • మేం నిర్వహించిన ర్యాలీ ఎన్నికలు, ఓట్ల కోసం కాదు..

    • సైనికుల ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం నిలబెట్టడానికి: రేవంత్‌

  • May 29, 2025 18:32 IST

    1971 యుద్ధంలో పాకిస్థాన్‌ను ఓడించాం: రేవంత్‌

    • భారత్‌ వైపు ఎవరు కన్నెత్తి చూసినా కనుగుడ్లు పీకేస్తామని..

    • చైనాకు ఇందిరాగాంధీ వార్నింగ్‌ ఇచ్చారు: రేవంత్‌

    • యుద్ధం ఆపాలని ఇందిరను అమెరికా అధ్యక్షుడు బెదిరించారు

    • ఇందిరాగాంధీ అమెరికా బెదిరింపులకు లొంగలేదు: రేవంత్‌రెడ్డి

    • నాటి ఇందిర యుద్ధ తంత్రాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు: రేవంత్‌

  • May 29, 2025 17:55 IST

    అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధాన్ని అర్ధంతరంగా ఆపేశారా?: రేవంత్‌

    • ట్రంప్‌ మీడియా ముందుకు వచ్చి యుద్ధం ఆపానని ప్రకటించారు: రేవంత్‌

    • అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధాన్ని అర్ధంతరంగా ఆపేశారా?: రేవంత్‌

    • పాక్‌కు గుణపాఠం చెప్పడానికి సైన్యానికి స్వేచ్ఛ ఇవ్వాలి: సీఎం రేవంత్‌

    • POKను స్వాధీనం చేసుకోవాలని చెప్పాం: సీఎం రేవంత్‌

  • May 29, 2025 17:55 IST

    యుద్ధం అంటే ధైర్యం, వెన్నెముక, యుద్ధతంత్రం ఉండాలి: రేవంత్‌

    • 4 రోజుల యుద్ధం తర్వాత అర్ధాంతరంగా యుద్ధం ఆపేశారు: రేవంత్‌

    • యుద్ధం చేయాలనుకున్నప్పుడు అఖిలపక్షాన్ని పిలిచారు..

    • యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదు?: రేవంత్‌

    • గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు: రేవంత్‌

  • May 29, 2025 17:53 IST

    జవాన్లకు అండగా ఉంటాం: సీఎం రేవంత్‌..

    • 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కుట్ర చేసి కొడంగల్‌లో ఓడిస్తే 14 రోజుల్లోనే మల్కాజ్‌గిరిలో నన్ను ఎంపీగా గెలిపించారు: సీఎం రేవంత్‌ రెడ్డి

    • అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎంపికయ్యా: సీఎం రేవంత్‌

    • ఇప్పుడు తెలంగాణ సీఎంగా మీ ముందుకొచ్చా: రేవంత్‌

    • ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మోదీ నిర్ణయాలకు అండగా నిలిచాం: రేవంత్‌

    • దేశంపై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు: రేవంత్‌

    • ఉగ్రవాదులను తుదముట్టించేవరకు సైన్యానికి అండగా ఉంటాం: రేవంత్‌

  • May 29, 2025 17:53 IST

    కొనసాగుతున్న NIA దర్యాప్తు

    • విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కొనసాగుతున్న NIA దర్యాప్తు

    • హైదరాబాద్‌లో నాలుగు చోట్ల NIA అధికారుల సోదాలు

    • సిరాజ్‌, సమీర్‌కు టచ్‌లో ఉన్నవారి ఇళ్లలో తనిఖీలు

    • సమీర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తి ఇంట్లో NIA సోదాలు

  • May 29, 2025 17:53 IST

    తీరం దాటిన తీవ్ర వాయుగుండం

    • బంగ్లాదేశ్ ఖేపుపర దగ్గర తీరం దాటిన వాయుగుండం

    • ఈశాన్య రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్‌కు భారీ వర్షసూచన

    • ఏపీలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం

    • కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం

    • తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు

    • ఈ నెల 31 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన

  • May 29, 2025 17:32 IST

    కవిత వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌

    • చిట్‌చాట్‌లో మాట్లాడేదానికి షోకాజ్‌ నోటీస్‌ ఎలా ఇస్తాం?: మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌

    • కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తా: వినోద్‌ కుమార్‌: మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌

    • కవితలో అంత ఆవేదన ఉన్న విషయం ఇప్పుడే చూశా: వినోద్‌

    • రాజకీయాల్లో ప్రకంపనలు సహజం: మాజీ ఎంపీ వినోద్‌

    • బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునేవాళ్లం: మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌

    • త్వరలోనే సమస్యలు సద్దుమణుగుతాయి: మాజీ ఎంపీ వినోద్‌

  • May 29, 2025 17:19 IST

    ఏపీ లిక్కర్‌ కేసు.. కస్టడీకి నిందితులు..

    • ఏపీ లిక్కర్‌ కేసులో నలుగురికి సిట్‌ కస్టడీ

    • 2 రోజుల కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు

    • రాజ్‌ కసిరెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పను రేపటి నుంచి రెండు రోజులు విచారించనున్న సిట్‌ అధికారులు

  • May 29, 2025 16:52 IST

    నాపైనా 23 కేసులు పెట్టారు.. అయినా తగ్గేదే లేదు: లోకేశ్

    • గతంలో J బ్రాండ్‌ మద్యంతో 30 వేలమందిని చంపేశారు: లోకేశ్

    • నకిలీ మద్యంతో వేలకోట్లు లూటీ చేశారు: లోకేశ్

    • రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే కూటమి ఏర్పడింది: లోకేశ్

    • అందరం జెండా, ఎజెండా పక్కన పెట్టి పనిచేశాం: లోకేశ్

    • ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటూ ముందుకుసాగుతున్నాం: లోకేశ్

    • రానున్న జూన్‌లో డీఎస్సీ నిర్వహిస్తాం: లోకేశ్

    • వచ్చే విద్యా సంవత్సరం నాటికి టీచర్ల నియామకం: లోకేశ్

  • May 29, 2025 16:50 IST

    అహంకారంతో విర్రవీగే వారికి ప్రజలే బుద్ధి చెప్పారు: సీఎం చంద్రబాబు

    • 2029లో జిల్లాలో 10కి 10 సీట్లు సాధిస్తాం: చంద్రబాబు

    • వైసీపీకి సీమలో 7 సీట్లు వస్తే.. కడప జిల్లాలో కూటమి 7 గెలిచింది: సీఎం చంద్రబాబు

    • ఓడిన పార్టీ అర్థం చేసేకోలేదు.. చేసుకోదు కూడా: చంద్రబాబు

    • టీడీపీ కార్యకర్తలే నా బలం.. బలగం: సీఎం చంద్రబాబు

    • ప్రజల జీవితాలు మార్చేందుకే పుట్టిన పార్టీ టీడీపీ: చంద్రబాబు

    • పాలన ఎలా ఉండకూడదో చెప్పే కేస్‌ స్టడీ.. వైసీపీ పాలన: చంద్రబాబు

    • విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్‌ నిర్మిస్తున్నాం: చంద్రబాబు

    • ఏడాదిలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం: సీఎం చంద్రబాబు

  • May 29, 2025 16:35 IST

    టీడీపీ కార్యకర్తలే నా బలం.. బలగం: సీఎం చంద్రబాబు

    • కడప టీడీపీ అడ్డా అని నిరూపించేందుకే మహానాడు పెట్టాం: సీఎం చంద్రబాబు

    • రాయలసీమ గర్జన.. రాష్ట్రమంతా మార్మోగాలి: చంద్రబాబు

    • కూటమి ప్రభుత్వంలో తొలి మహానాడు సూపర్‌ హిట్‌: చంద్రబాబు

    • కడప జిల్లా రాజకీయం మారుతోంది.. మార్పు కనిపిస్తోంది: చంద్రబాబు

    • మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని నిరూపించారు: చంద్రబాబు

  • May 29, 2025 16:27 IST

    జలీల్‌ఖాన్‌కు అస్వస్థత..

    • కడప మహానాడులో జలీల్‌ఖాన్‌కు అస్వస్థత

    • మహానాడు వేదికపై స్పృహతప్పి పడిపోయిన జలీల్‌ఖాన్‌

    • జలీల్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించిన టీడీపీ కార్యకర్తలు

  • May 29, 2025 16:03 IST

    తగ్గేదేలే: మంత్రి లోకేశ్

    • పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోంది: లోకేశ్

    • 94 శాతం స్ట్రైక్‌ రేట్‌తో 164 సీట్లు గెలవడం ఆల్‌టైమ్‌ రికార్డ్‌

    • ఈ విజయం టీడీపీ కార్యకర్తల నాటు దెబ్బ: లోకేశ్

    • జెండా పీకేస్తామన్నవాళ్లు అడ్రస్‌ లేకుండా పోయారు: లోకేశ్

    • వై నాట్‌ 175 అన్నవారికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు: లోకేశ్

    • CBN అంటే.. అభివృద్ధి, సంక్షేమం, మనందరి ధైర్యం: లోకేశ్

    • CBN అంటే.. పేదల చిరునవ్వు: లోకేశ్

    • గతంలో ప్రశ్నిస్తే కేసులు.. పోరాడితే అరెస్టులు: లోకేశ్

  • May 29, 2025 15:54 IST

    గద్దర్ అవార్డ్.. అల్లు అర్జున్ స్పందనిదే..

    • గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుపై స్పందించిన అల్లు అర్జున్‌

    • ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నా: అర్జున్‌

    • తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు: అల్లు అర్జున్‌

    • అవార్డు ఘనత సుకుమార్‌, నిర్మాతలు, పుష్ప టీమ్‌దే

    • ఈ అవార్డు అభిమానులకే అంకితం: అల్లు అర్జున్‌

  • May 29, 2025 15:54 IST

    కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ సీరియస్..

    • కేటీఆర్ అసలు రంగు బయటపడింది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    • కేటీఆర్ ట్విట్టర్‌లో కాదు..బయటకు రా అని కవిత కూడా అన్నారు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    • కుటుంబంలో ఉన్న సవాళ్లకు సమాధానం చెప్పలేని కేటీఆర్.. తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారు?: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    • కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

  • May 29, 2025 15:47 IST

    హిడ్మా అరెస్ట్‌..

    • ఒడిశా: మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్‌

    • కొరాపుట్‌లో హిడ్మాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

  • May 29, 2025 15:10 IST

    ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ వేటు?

    • పార్టీపై విమర్శలు, అంతర్గత వ్యవహారాలపై మాట్లాడినందుకు..

    • కాసేపట్లో కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం

    • కాసేపట్లో సబితతో పాటు BRS ముఖ్యనేతల ప్రెస్‌మీట్‌

  • May 29, 2025 15:10 IST

    ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మల్లారెడ్డి ఏమన్నారంటే..

    • కవిత వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

    • పార్టీలో చిన్న చిన్న సమస్యలు సహజనమే: మల్లారెడ్డి

    • పార్టీ నుంచి ఎవరూ ఎక్కడికీ పోరు: మల్లారెడ్డి

  • May 29, 2025 15:10 IST

    ఢిల్లీకి ఆ ఎమ్మెల్యేలు..

    • ఢిల్లీలో నలుగురు తెలంగాణ కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు

    • అడ్లూరు లక్ష్మణ్, మందుల సామెల్, సత్యనారాయణ, లక్ష్మీ కాంతారావు

    • సాయంత్రం మల్లికార్జున ఖర్జేను కలవనున్న మాదిగ ఎమ్మెల్యేలు

    • కేబినెట్‌ విస్తరణలో మాదిగలకు స్థానం కల్పించాలని కోరనున్ననేతలు

  • May 29, 2025 14:25 IST

    అంతా పసుపుమయం..

    • కడప: పసుపుమయమైన మహానాడు ప్రాంగణం

    • కాసేపట్లో టీడీపీ మహానాడు భారీ బహిరంగ సభ

    • టీడీపీ శ్రేణులతో కిక్కిరిసిన సభా ప్రాంగణం

    • సభకు వచ్చేవారి కోసం ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలు

    • బహిరంగ సభకు 5 లక్షలమంది వస్తారని అంచనా

  • May 29, 2025 14:25 IST

    వారివి కుమ్మక్కు రాజకీయాలు: ఎంపీ చామల

    • ఢిల్లీ: బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు: ఎంపీ చామల

    • కవిత వ్యాఖ్యలు ఇదే విషయం నిజం చేశాయి: ఎంపీ చామల

    • కాంగ్రెస్‌కు కవిత అవసరం లేదు: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

    • మాకు సమర్థ నాయకత్వం ఉంది.. వారి అవసరం లేదు: చామల

    • కవిత వాస్తవాలు చెప్పాలనుకుంటే లేఖలు, లీక్‌లు కాదు: చామల

    • గత పదేళ్లలో జరిగిన అవినీతిపై దర్యాప్తు కోరాలి: ఎంపీ చామల

  • May 29, 2025 14:25 IST

    ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో వైరల్

    • ఉగ్రవాదులను తిడుతూ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో

    • ఎపీ, తెలంగాణలో ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నారు: రాజాసింగ్‌

    • ఈ కుక్కలు అమాయకులు టిఫిన్ బాంబులతో చంపుతున్నారు: రాజాసింగ్‌

    • వీరికి MIMకు చెందిన అడ్వకేట్‌ సాయం చేస్తున్నారు: రాజాసింగ్‌

    • వీళ్లపై NIA దృష్టి పెట్టాలి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

  • May 29, 2025 14:25 IST

    హైకోర్ట్ స్టే..

    • కడప మేయర్‌ తొలగింపుపై హైకోర్టు స్టే

    • సింగిల్‌ జడ్జి తీర్పును నిలుపుదల చేసిన హైకోర్టు ధర్మాసనం

  • May 29, 2025 13:22 IST

    హైదరాబాద్‌: గద్దర్ అవార్డులు ప్రకటన

    • 2024 సంవత్సరానికి తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రకటన

    • 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో సినిమా అవార్డుల సంబరాలు

    • 2024 ఉత్తమ మొదటి చిత్రం కల్కి

    • 2024 రెండవ ఉత్తమ చిత్రం పొట్టేల్‌

    • 2024 మూడవ ఉత్తమ చిత్రం లక్కీభాస్కర్‌

    • 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో సినీ అవార్డు వేడుక: దిల్‌ రాజు

    • జ్యూరీ మెంబర్స్ అవార్డుల లిస్ట్ సిద్ధం చేశారు: దిల్‌ రాజు

    • గద్దర్‌ అవార్డులు ప్రకటన హర్షణీయం: జయసుధ

    • బెస్ట్ ఆఫ్ బెస్ట్ కే అవార్డులు: జయసుధ

    • అవార్డులు మాకు బూస్ట్ అప్‌ ఇస్తాయి: జయసుధ

    • యూనానిమస్‌గా జ్యూరీమెంబర్స్ కలిసి ఎంపికలు

  • May 29, 2025 11:52 IST

    రాయలసీమను సుభిక్షం చేసేందుకు ఎంతో చేస్తున్నాం: చంద్రబాబు

    రాయలసీమను సుభిక్షం చేసేందుకు పలు ప్రాజెక్టులు చేపట్టామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. తెలుగుగంగ, హంద్రినీవా, నగరి గాలేరు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఆ తర్వాత తాను బాధ్యతలు చేపట్టాక వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లామన్నారు. ఉద్యాన పంటలతో ఇప్పుడు అనంతపురం సంపదలో ముందంజలో ఉండటానికి కారణం టీడీపీనే అని చంద్రబాబు నొక్కి చెప్పారు.

  • May 29, 2025 11:43 IST

    పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు మొదలు పెడతాం

    కడప స్టీల్ ప్లాంట్ పనులపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. "కడప మహానాడులో మీ అందరి ముందు చెప్తున్నా.. పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు మొదలవుతున్నాయి". అని చంద్రబాబు వెల్లడించారు.

  • May 29, 2025 11:21 IST

    సొంత బాబాయ్‌ను చంపి ఆ నింద నాపై వేశారు: చంద్రబాబు

    గత ప్రభుత్వంలో ఐదేళ్లూ రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదని, గంజాయి-డ్రగ్స్ రాజ్యమేలాయని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. చివరి రోజు కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన ప్రసంగించారు. గత జగన్ ప్రభుత్వం నేరాలను వ్యవస్థీకృతంగా మార్చేశారని, వైసీపీ అధినేతే సొంత బాబాయ్‌ను చంపి ఆ నింద నాపై వేశారని చంద్రబాబు విమర్శించారు.

  • May 29, 2025 10:58 IST

    ఇదే.. తెలుగుదేశం పార్టీ ఆస్తి

    ఏడు పదులు దాటిన అవనిగడ్డ నియోజకవర్గం కోడూరుకి చెందిన పెద్దాయనకు తెలుగుదేశం పార్టీ అంటే వల్లమాలిన అభిమానం. తెలుగుదేశం పార్టీ మహా పండుగ కడప మహానాడుకి టీడీపీ గుర్తు-పేదవాడి రథం సైకిల్ పై వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. సుమారు 400 కిలోమీటర్లకు పైగా సైకిల్ యాత్ర చేశాడు. అనుకున్నది సాధించాడు.

    tdp-activist.gif

  • May 29, 2025 10:30 IST

    ఏపీలోని కడప జిల్లాలో టీడీపీ మూడో రోజు మహానాడు ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమం చివరి రోజు కావడంతో వివిధ జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.