Share News

Breaking News: APPSC గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - Jun 10 , 2025 | 03:04 PM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: APPSC గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల
Breaking News

Live News & Update

  • Jun 10, 2025 20:59 IST

    ఫలితాలు వచ్చేశాయ్..

    • APPSC గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల

    • 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు అభ్యర్థుల ఎంపిక

    • APPSC వెబ్‌సైట్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు

  • Jun 10, 2025 20:16 IST

    రేపు కాళేశ్వరం కమిషన్‌ విచారణకు కేసీఆర్‌

    • రేపు ఉ.8 గంటలకు ఎర్రవల్లి నుంచి హైదరాబాద్‌కు కేసీఆర్‌

    • ఫామ్‌హౌస్‌కు పార్టీ నేతలెవరూ రావొద్దని BRS ఆదేశాలు

    • కేసీఆర్‌కు మద్దతుగా భారీ జన సమీకరణకు BRS ప్లాన్‌

  • Jun 10, 2025 19:34 IST

    ఏలూరు సాక్షి కార్యాలయం దగ్గర హైడ్రామా

    • నిరసన తెలిపేందుకు వెళ్లిన దెందులూరు మహిళలు

    • సాక్షి భవనం ఆవరణలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

    • కుట్రలో భాగంగానే అగ్నిప్రమాదం సృష్టించారని మహిళల ఆరోపణ

    • సాక్షి కార్యాలయంపై కోడిగుడ్లతో మహిళలు దాడి

  • Jun 10, 2025 19:34 IST

    ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

    • రాష్ట్ర స్థాయి వేడుకగా కూటమి ఏడాది పాలన

    • ఎల్లుండి కూటమి ఏడాది పాలన వేడుకలు

    • సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్‌ పేరిట కార్యక్రమం

  • Jun 10, 2025 19:34 IST

    ఎంపీ పీఏ కోసం పోలీసుల గాలింపు..

    • కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసుల గాలింపు

    • రాఘవరెడ్డి కోసం 4 పోలీసు బృందాలు గాలింపు

    • తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడలో గాలింపు

    • మహానాడులో టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారని కేసు

    • హత్యాయత్నం తర్వాత నుంచి పరారీలో ఎంపీ పీఏ రాఘవ

    • టీడీపీ జెండాలు తొలగించి దాడి చేసిన కేసులో A-1 రాఘవరెడ్డి

  • Jun 10, 2025 17:17 IST

    ఏబీఎన్ చేతిలో రిమాండ్ రిపోర్ట్..

    • ABN చేతిలో కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్ రిపోర్ట్

    • మహిళలపై అనుచిత వ్యాఖ్యలు కొమ్మినేని ప్రణాళికతో చేశారన్న పోలీసులు

    • దురుద్దేశంతో కొమ్మినేని వ్యాఖ్యలు చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు

    • దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న రిమాండ్ రిపోర్ట్

  • Jun 10, 2025 15:22 IST

    హైదరాబాద్: బస్‌ భవన్ దగ్గర ఉద్రిక్తత

    • బస్ పాస్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఎమ్మెల్సీ కవిత ధర్నా

    • బస్‌ భవన్ లోపలికి కవిత వెళ్లకుండా పోలీసులు అడ్డగింపు

    • పోలీసులు, జాగృతి నేతల మధ్య వాగ్వాదం

  • Jun 10, 2025 15:22 IST

    కాల్పుల కలకలం..

    • ఆస్ట్రియా: గ్రాజ్ పట్టణంలోని స్కూల్లో కాల్పుల కలకలం

    • ఆస్ట్రియా: విద్యార్థి కాల్పుల్లో ఐదుగురు మృతి

    • కాల్పుల్లో పలువురు విద్యార్థులు, టీచర్లకు గాయాలు

  • Jun 10, 2025 15:22 IST

    8మంది గల్లంతు..

    • రాజస్థాన్‌: టోంక్‌ జిల్లాలో బానస్ నదిలో 8మంది గల్లంతు

    • బానస్ నదిలో స్నానానికి దిగి 8 మంది గల్లంతు

    • బాధితులంతా జైపూర్‌కు చెందిన యువకులు

  • Jun 10, 2025 15:20 IST

    మరోసారి రిమాండ్‌..

    • గుంటూరు: కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరోసారి రిమాండ్‌

    • 14 రోజుల రిమాండ్‌ విధించిన న్యాయస్థానం

    • మంగళగిరిలో కాకాణిపై అసభ్య పోస్టుల కేసు

    • పీటీ వారెంట్‌పై కాకాణిని తీసుకొచ్చిన సీఐడీ

    • కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించిన సీఐడీ

  • Jun 10, 2025 15:20 IST

    కాకాణి బ్యాచ్‌ ఆగడాలు

    • నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు ఏరియాలో కాకాణి బ్యాచ్‌ ఆగడాలు

    • అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసి కాకాణి బ్యాచ్‌ డబ్బు వసూళ్లు

    • వాహనదారుల ఫిర్యాదుతో ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు

    • ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న ముత్తుకూరు పోలీసులు

  • Jun 10, 2025 15:04 IST

    సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్‌ షర్మిల ఫైర్‌

    • సజ్జల మూర్ఖుడిలా మాట్లాడుతున్నారు: షర్మిల

    • మహిళలను పిశాచులతో పోల్చుతారా?: షర్మిల

    • మహిళలను రాక్షసులు అంటారా?: షర్మిల

    • సంకర జాతి అని అవమానిస్తారా?: షర్మిల

    • చేసిన తప్పే వైసీపీ మళ్లీమళ్లీ చేస్తోంది: షర్మిల

    • నాపైనా తప్పుడు ప్రచారం చేయించారు: షర్మిల

    • జగన్ నా అక్కచెల్లెళ్లమ్మలు అంటారు: షర్మిల

    • సొంత చెల్లిని నాకే మర్యాద లేదు: షర్మిల

    • ఇక రాష్ట్రంలో మహిళలను గౌరవిస్తారా?: షర్మిల

  • Jun 10, 2025 15:04 IST

    విశాఖ: AU కన్వెన్షన్‌ హాల్‌లో మంత్రుల బృందం సమీక్ష

    • ఈ నెల 21న యోగా డే ఏర్పాట్లపై మంత్రి లోకేష్‌ నేతృత్వంలో రివ్యూ

    • ప్రపంచమంతా ఏపీ వైపు చూసేలా యోగా డే వేడుకలు: లోకేష్‌

    • యోగా దినోత్సవానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలి: లోకేష్‌

  • Jun 10, 2025 15:04 IST

    సీఎం చంద్రబాబు ఏడాది పాలనపై సభ.. ఎప్పుడంటే..

    • అమరావతి: కూటమి ఏడాది పాలన సందర్భంగా ఈనెల 12న సభ

    • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్న చంద్రబాబు, పవన్‌

    • రానున్న నాలుగేళ్ల పాలనాకాలంపై దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు

    • ఏపీ సచివాలయం సమీపంలో బహిరంగ సభకు ఏర్పాట్లు