Share News

Breaking News: కాకాణి గోవర్థన్‌రెడ్డికి పోలీస్‌ కస్టడీ

ABN , First Publish Date - Jun 05 , 2025 | 02:48 PM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: కాకాణి గోవర్థన్‌రెడ్డికి పోలీస్‌ కస్టడీ
Breaking News

Live News & Update

  • Jun 05, 2025 21:52 IST

    తెలంగాణ కేబినెట్‌.. కీలక నిర్ణయాలు ఇవే..

    • తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూములను TGIICకి బదిలీ చేస్తూ నిర్ణయం

    • స్పెషల్‌ ఎక్సైజ్‌ సెస్‌ అమలుకు కేబినెట్‌ నిర్ణయం

    • విద్యాశాఖలో మరో డైరెక్టర్‌ నియామకానికి నిర్ణయం

    • విద్యుత్‌ శాఖలో 300 పోస్టుల సృష్టికి కేబినెట్‌ ఆమోదం

    • జహీరాబాద్ పారిశ్రామిక అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం

    • మహిళా సంఘాలకు బీమా నిధుల విడుదలకు ఆమోదం

    • ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం

  • Jun 05, 2025 21:52 IST

    ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం

    • ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం

    • NDSA, విజిలెన్స్‌ నివేదికలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌

    • నివేదికలపై మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం రేవంత్‌

    • ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయం

    • ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ, హెల్త్‌ కార్డు సహా ప్రతి నెలా రూ.700 కోట్లతో పెండింగ్ బిల్లుల చెల్లింపునకు నిర్ణయం

    • రూ.23 వేల కోట్లతో రోడ్ల నిర్మాణానికి టీజీ కేబినెట్‌ ఆమోదం

  • Jun 05, 2025 21:52 IST

    విచారణకు ఆదేశం..

    • తొక్కిసలాట ఘటనపై CID, జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశం

    • హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి అధ్యక్షతన జ్యుడిషియల్‌ విచారణ

    • 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశం

    • A1గా RCB, A2గా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, A3గా KSCA

    • నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డీజీపీకి ఆదేశం

  • Jun 05, 2025 21:30 IST

    కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌..

    • బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌

    • ముగ్గురు పోలీస్‌ ఉన్నతాధికారులపై సస్పెన్షన్‌ వేటు

    • బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌పై సస్పెన్షన్‌ వేటు

    • సీపీతో పాటు అదనపు సీపీ, డిప్యూటీ సీపీ సస్పెన్షన్‌

    • తొక్కిసలాట ఘటనపై CID విచారణకు కర్ణాటక సర్కార్‌ ఆదేశం

  • Jun 05, 2025 21:23 IST

    వారిపై కేసు నమోదు..

    • బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం

    • ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌పై కేసు నమోదు

    • హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు

  • Jun 05, 2025 21:23 IST

    ముందస్తు బెయిల్‌ పిటిషన్‌..

    • ఏపీ హైకోర్టులో పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

    • గుండ్లపాడు జంట హత్యల కేసులో బెయిల్‌ కోరుతూ పిటిషన్‌

    • కేసు పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు

    • తదుపరి విచారణ ఈనెల 12కి వాయిదా

  • Jun 05, 2025 21:23 IST

    తెలంగాణ కేబినెట్‌ భేటీ..

    • 5 గంటలుగా కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్‌ భేటీ

    • ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం

    • NDSA, విజిలెన్స్‌ నివేదికలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌

    • నివేదికలపై మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్న రేవంత్‌

  • Jun 05, 2025 19:29 IST

    యాదాద్రికి సీఎం రేవంత్.. ఎప్పుడంటే..

    • రేపు యాదాద్రి భువనగిరి జిల్లాకు తెలంగాణ సీఎం రేవంత్‌

    • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న రేవంత్‌

    • గందమల రిజర్వాయర్‌, ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు శంకుస్థాపనలు

    • యాదగిరిగుట్ట మెడికల్‌ కాలేజ్‌, వేద పాఠశాలకు భూమిపూజ

    • తుర్కపల్లి బహిరంగ సభలో పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్న రేవంత్‌

  • Jun 05, 2025 19:29 IST

    హైదరాబాద్‌: కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్‌ భేటీ

    • స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్‌లో చర్చ

    • తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూములను TGIICకి బదిలీ చేస్తూ నిర్ణయం

    • స్పెషల్‌ ఎక్సైజ్‌ సెస్‌ అమలుకు కేబినెట్‌ నిర్ణయం

    • విద్యాశాఖలో మరో డైరెక్టర్‌ నియామకానికి నిర్ణయం

    • విద్యుత్‌ శాఖలో 300 పోస్టుల సృష్టికి కేబినెట్‌ ఆమోదం

    • జహీరాబాద్ పారిశ్రామిక అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం

    • మహిళా సంఘాలకు బీమా నిధుల విడుదలకు ఆమోదం

    • ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం

  • Jun 05, 2025 19:27 IST

    మాజీ మంత్రికి పోలీస్ కస్టడీ..

    • నెల్లూరు: కాకాణి గోవర్థన్‌రెడ్డికి పోలీస్‌ కస్టడీ

    • 3 రోజుల పోలీస్‌ కస్టడీకి కోర్టు అనుమతి

    • అక్రమ మైనింగ్‌ కేసులో A4గా ఉన్న కాకాణి

    • రేపటి నుంచి 8 వరకు కాకాణిని ప్రశ్నించనున్న పోలీసులు

  • Jun 05, 2025 17:58 IST

    దేశదేశాలు తిరిగి వివరించాం: ఎంపీ లావు..

    • విదేశాల్లో 7 పార్లమెంట్‌ బృందాలుగా పర్యటించాం: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

    • ఆపరేషన్‌ సిందూర్‌ పరిణామాలపై విదేశీ ప్రతినిధులకు వివరించాం: ఎంపీ లావు

    • ఉగ్రవాదాన్ని పాక్‌ పెంచి పోషిస్తున్న తీరును తెలియజేశాం: లావు

    • పాక్‌కు ప్రపంచ దేశాల ఆర్థిక సాయం అందకుండా చూడాలని కోరాం: ఎంపీ లావు

    • భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది: శ్రీకృష్ణదేవరాయలు

    • పాక్‌ బెదిరింపులకు భయపడేదిలేదు: లావు శ్రీకృష్ణదేవరాయలు

  • Jun 05, 2025 17:26 IST

    ఆస్పత్రిలో మాగంటి.. హరీశ్ రావు ఏమన్నారంటే..

    • ఎమ్మెల్యే మాగంటి ICUలో ఉన్నారు: హరీష్‌రావు

    • గోపీనాథ్‌కు చికిత్స కొనసాగుతోంది: హరీష్‌రావు

  • Jun 05, 2025 17:14 IST

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే పరిస్థితి విషమం..

    • BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

    • గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో మాగంటి గోపీనాథ్‌కు చికిత్స

    • గుండె సమస్యతో AIGలో చేరిన జూబ్లీహిల్స్‌ MLA మాగంటి గోపీనాథ్‌

    • మాగంటి గోపీనాథ్‌ ఆరోగ్య పరిస్థితిపై..

    • కాసేపట్లో హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయనున్న AIG ఆస్పత్రి వర్గాలు

  • Jun 05, 2025 16:53 IST

    ఆల్ టైమ్ రికార్డ్..

    • ఆల్‌ టైమ్‌ హై చేరిన వెండి ధర

    • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,14,000

    • ఒక్కరోజే రూ.3,016 పెరిగిన వెండి ధర

  • Jun 05, 2025 16:53 IST

    మాజీ ఎమ్మెల్యేకు అస్వస్థత..

    • జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు తీవ్ర అస్వస్థత

    • గచ్చిబౌలి AIG ఆస్పత్రికి మాగంటి తరలింపు

    • AIG ఆస్పత్రికి చేరుకున్న హరీష్‌రావు, పలువురు BRS నేతలు

  • Jun 05, 2025 16:19 IST

    RCB సాయం..

    • బెంగళూరు ఘటనలో బాధిత కుటుంబాలకు RCB సాయం

    • మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం

  • Jun 05, 2025 16:19 IST

    తెలంగాణ ప్రభుత్వం, డీజీపీకి NHRC నోటీసులు

    • హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పీఎస్‌లో యువకుడి మృతిపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని NHRC నోటీసులు

    • పోలీసుల టార్చర్‌ కారణంగా యువకుడు మృతి అంటూ మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించిన NHRC

  • Jun 05, 2025 16:10 IST

    మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ

    • ఛత్తీస్‌గఢ్‌: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ

    • ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు లక్ష్మీనరసింహాచలం అలియాస్‌ గౌతమ్‌ మృతి

    • మృతుడిపై రూ.కోటి రివార్డు

    • మృతుడు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం వాసి

  • Jun 05, 2025 16:06 IST

    కొండా సురేఖకు స్వల్ప అస్వస్థత..

    • హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖకు స్వల్ప అస్వస్థత

    • సచివాలయంలో కళ్లు తిరిగి పడిపోయిన కొండా సురేఖ

    • షుగర్‌ లెవెల్స్‌ పడిపోవడంతో కొండా సురేఖకు అస్వస్థత

    • అప్రమత్తమైన మంత్రి సురేఖ వ్యక్తిగత సిబ్బంది

  • Jun 05, 2025 15:51 IST

    హైదరాబాద్: ట్రావెల్‌ బ్యాగ్‌లో మృతదేహం కేసు

    • హత్య కేసును ఛేదించిన బాచుపల్లి పోలీసులు

    • మృతురాలు నేపాల్‌ యువతిగా గుర్తింపు

    • నిందితుడు నేపాల్‌ వాసి విజయ్‌గా నిర్థారణ

    • మే 23న యువతిని హత్య చేసిన నిందితుడు విజయ్‌

    • యువతి మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టిన నిందితుడు

    • KPHBలో బ్యాగ్‌ కొన్నట్లు గుర్తించిన పోలీసులు

    • సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడి గుర్తింపు

  • Jun 05, 2025 15:48 IST

    బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం

    • తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించిన కర్ణాటక హైకోర్టు

    • తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

    • ఏర్పాట్లలో లోపాలపై కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

    • స్టేడియం దగ్గర అంబులెన్స్‌లు ఎందుకు లేవు?: కర్ణాటక హైకోర్టు

    • కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్‌ ఎలా నిర్వహిస్తారు?: హైకోర్టు

    • ఈనెల 10 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం

    • తదుపరి విచారణ ఈనెల 10కి వాయిదా

  • Jun 05, 2025 15:20 IST

    తొక్కిసలాట.. హైకోర్టు ఆదేశం..

    • బెంగళూరు తొక్కిసలాట ఘటనపై విచారణ

    • ఘటనను సుమోటోగా స్వీకరించిన కర్ణాటక హైకోర్టు

    • తొక్కిసలాట ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం

    • తొక్కిసలాటకు కారణాలపై ఇంకా రాని స్పష్టత

  • Jun 05, 2025 14:50 IST

    బెంగళూరు తొక్కిసలాట.. మృతులు వీరే..

    • బెంగళూరు తొక్కిసలాటలో 11 మంది మృతి, 50 మందికి గాయాలు

    • మృతులు మనోడ్‌(33), దేవి(29), అక్షత(27), పూర్ణచంద్ర(26)

    • ప్రజ్వల్‌(20), భూమి(20), శ్రవణ్‌(20), సహానా(19), లింగస్వామి

    • చిన్మయి శెట్టి(19), దివ్యాన్షి(13)గా గుర్తింపు

  • Jun 05, 2025 14:50 IST

    ఆ నిందితురాలికి బెయిల్.. ఏ కేసులో అంటే..

    • శర్మిష్ఠ పనోలికి కోల్‌కతా హైకోర్టు బెయిల్‌ మంజూరు

    • సోషల్‌ మీడియాలో వివాదాస్పద పోస్టుపై శర్మిష్ఠ అరెస్టు

  • Jun 05, 2025 14:48 IST

    గుడ్ న్యూస్.. ఇకపై హైదరాబాద్ నుంచే..

    • హైదరాబాద్‌లో రాఫెల్ విమానాల విడి భాగాల తయారీ కేంద్రం

    • ఆధునిక ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్న టాటా కంపెనీ

    • డసాల్ట్ ఏవియేషన్‌తో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్ ఒప్పందం

    • రాఫెల్ యుద్ధ విమానాలకు అవసరమైన విడిభాగాలను హైదరాబాద్‌లో తయారు చేయనున్న టాటా కంపెనీ

    • 2028 నాటికి రాఫెల్‌ విడిభాగాలు తయారయ్యేలా ప్రణాళికలు