HILT పాలసీపై తెలంగాణ హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - Dec 05 , 2025 | 07:24 AM
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తరువాత దాదాపు నాలుగేళ్ళ తరువాత ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Live News & Update
-
Dec 05, 2025 19:06 IST
హైదరాబాద్: కోకాపేట భూములకు ముగిసిన నాలుగో విడత వేలం
కోకాపేట గోల్డెన్ మైల్‌లోని 1.98 ఎకరాలకు HMDA ఈ-వేలం
ఎకరా రూ. 77.75 కోట్లకు దక్కించుకున్న COEUS ఎడ్యుకేషన్ సంస్థ
నాలుగో విడత వేలంలో HMDAకు రూ.154 కోట్ల ఆదాయం
మొత్తం ఈ-వేలంలో HMDAకు రూ. 3,862 కోట్ల ఆదాయం
-
Dec 05, 2025 17:50 IST
తెలంగాణలో గత 4 రోజుల్లో రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు
నాలుగు రోజుల్లోనే 5.89 లక్షల కార్టన్ బాక్సుల బీర్లు అమ్మకాలు
-
Dec 05, 2025 17:04 IST
ఇండిగో సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు కేంద్రం ఆదేశం
సంక్షోభానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు..
DGCA ఆదేశాలకు తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటన
ప్రయాణికులకు వసతితో పాటు..
ఇండిగో విమానాల రద్దుపై కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం
ఇండిగో సంస్థకోసం FDTL నిబంధనలను సడలించడం సరికాదు: కేంద్రం
ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడేది లేదు: కేంద్రం
-
Dec 05, 2025 16:47 IST
మేం ఒకేసారి రూ.20,614 కోట్ల రుణమాఫీ చేశాం: సీఎం రేవంత్
రేషన్ ద్వారా పేదలకు సన్నబియ్యం అందిస్తున్నాం: సీఎం రేవంత్
ప్రతి పేదోడికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: సీఎం రేవంత్
ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండకూడదన్నదే లక్ష్యం: రేవంత్
రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో అందజేసిన తెలంగాణను..
కేసీఆర్ అప్పులపాలు చేశారు: సీఎం రేవంత్‌రెడ్డి
డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు: సీఎం రేవంత్
రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు అందజేశాం: రేవంత్
వచ్చే ఏప్రిల్ లోపు నర్సంపేటకు 3,500 ఇళ్లు మంజూరు చేస్తాం: రేవంత్
-
Dec 05, 2025 16:47 IST
గడీల పాలనను ప్రజలు కూలగొట్టారు: సీఎం రేవంత్
పదేళ్లలో గత పాలకులు మాత్రమే భారీగా ఆస్తులు సంపాదించారు
వాళ్లు ఆశానికి ఎదిగారు తప్ప.. ప్రజలను పట్టించుకోలేదు: రేవంత్
వరి వేసుకుంటే ఉరేనని కేసీఆర్ అన్నారు: సీఎం రేవంత్
వరి పండించండి.. ప్రతిగింజ మేం కొంటాం: సీఎం రేవంత్
కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని దుష్ప్రచారం చేశారు: రేవంత్
24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ది: రేవంత్
రైతు భరోసా కింది రూ.9 వేలకోట్లు అందజేశాం: సీఎం రేవంత్
గత పాలకులు చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు
మేం 25 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశాం: రేవంత్
-
Dec 05, 2025 16:27 IST
ముఖ్య మంత్రి చంద్రబాబును కలిసి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఉండవల్లి లో చంద్రబాబు నివాసం లో భేటీ
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు చంద్రబాబును ఆహ్వానించిన కోమటిరెడ్డి
-
Dec 05, 2025 16:23 IST
ఐబొమ్మ రవి కేసులో నాంపల్లి కోర్టు తీర్పు
మూడు కేసుల్లో 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి
రేపటి నుంచి రవిని ప్రశ్నించనున్న సైబర్ క్రైం పోలీసులు
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ
-
Dec 05, 2025 13:29 IST
ఇండిగో సంక్షోభం తర్వాత DGCA కీలక ప్రకటన
పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేసిన DGCA
పైలట్లకు వారంపాటు విశ్రాంతి నిబంధన ఎత్తివేత
-
Dec 05, 2025 13:02 IST
HILT పాలసీపై తెలంగాణ హైకోర్టులో విచారణ
పిటిషన్లు దాఖలు చేసిన కేఏ పాల్, రిటైర్డ్ ప్రొఫెసర్
భూకేటాయింపుల జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని పిటిషన్లు
సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరిన పిటిషనర్లు
కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
-
Dec 05, 2025 11:22 IST
వికల్ప్ పేరుతో మావోయిస్టుల సంచలన లేఖ
దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి మాతోనే ఉన్నారు: వికల్ప్
లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు
హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ చెప్పారనేది అవాస్తవం
హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణం
కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణం
విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి,..
మరో కాంట్రాక్టర్ కారకులు
అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా..
హిడ్మా విజయవాడకు వెళ్లాడు
-
Dec 05, 2025 11:17 IST
అనిల్ అంబానీ ఆస్తులు అటాచ్
ఢిల్లీ: రూ.1,120 కోట్ల విలువైన అనిల్ అంబానీ ఆస్తులు అటాచ్
యస్ బ్యాంక్ మోసం కేసులో ఈడీ చర్యలు
అనిల్ అంబానీకి చెందిన 18కి పైగా ఆస్తులు ఇప్పటికే సీజ్
-
Dec 05, 2025 11:17 IST
పల్నాడు: కారు ప్రమాదంలో విద్యార్థుల మృతి కేసు
హైవేపై కంటైనర్‌ను ఆపేందుకు యత్నించిన RTO అధికారులు
RTO అధికారులు కారు అడ్డుగా పెట్టి కంటైనర్ ఆపే ప్రయత్నం
హైవేపై కంటైనర్ స్లో అవడంతో వెనుక నుంచి ఢీకొట్టిన కారు
ప్రమాదంలో అయ్యప్ప మాలలో ఉన్న ఐదుగురు విద్యార్థులు మృతి
-
Dec 05, 2025 11:17 IST
తీవ్ర సంక్షోభంలో ఇండిగో.. 500కి పైగా విమానాలు రద్దు
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల్లో ఆందోళనలు
సంస్థ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం
సాధారణ సేవలు ఫిబ్రవరి 10 వరకు సాధ్యం కాదన్న ఇండిగో సీఈవో
-
Dec 05, 2025 11:17 IST
సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధం: దానం నాగేందర్
ఎన్నికల్లో ఫైట్ చేయడం.. గెలవడం నా రక్తంలోనే ఉంది: దానం
అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి
మరో పదేళ్లు సీఎంగా రేవంత్ ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: దానం
-
Dec 05, 2025 08:38 IST
ఏలూరు: జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం
పెదవేగి మం. అమ్మపాలెంకు చెందిన మహిళకు పాజిటివ్
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళకు చికిత్స
-
Dec 05, 2025 08:38 IST
కృష్ణా: జగ్గయ్యపేట మం. చిల్లకల్లులో రౌడీషీటర్ నవీన్ హత్య
రౌడీషీటర్ పిల్ల సాయి బర్త్‌డే పార్టీలో వివాదం
రౌడీషీటర్లు నవీన్ రెడ్డి, పిల్ల సాయి మధ్య వివాదం
బర్త్‌డే పార్టీ ఘర్షణలో నవీన్‌ను కత్తితో పొడిచిన పిల్లసాయి
నవీన్‌ను ఆస్పత్రికి తరలించి పారిపోయిన పిల్లసాయి అనుచరులు
సోషల్ మీడియాలో పిల్ల సాయి వీడియోలు వైరల్
-
Dec 05, 2025 08:38 IST
ప్రకాశం: పొదిలిలో భూ ప్రకంపనలు
తెల్లవారుజామున 3 గంటలకు 2 సెకన్లపాటు కంపించిన భూమి
పొదిలి, దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో ఇటీవల వరుస భూప్రకంపనలు
-
Dec 05, 2025 07:25 IST
భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన
రాత్రి పుతిన్‌కు విందు ఇచ్చిన ప్రధాని మోదీ
నేడు హైదరాబాద్ హౌజ్‌లో శిఖరాగ్ర సమావేశం
నేడు రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్న పుతిన్
-
Dec 05, 2025 07:25 IST
నేడు నర్సంపేటకు సీఎం రేవంత్ రెడ్డి
రూ.531 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఇంటిగ్రేడెట్ స్కూల్ భవనానికి భూమిపూజ
నీటిపారుదల శాఖపై రేపు సీఎం సమీక్ష
-
Dec 05, 2025 07:25 IST
మన్యం జిల్లాకు చంద్రబాబు..
నేడు మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
పేరెంట్-టీచర్స్ మీటింగ్‌లో పాల్గొననున్న చంద్రబాబు
-
Dec 05, 2025 07:25 IST
రేపు భారత్-సౌతాఫ్రికా మధ్య మూడో టెస్ట్
రేపు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మ.1:30కు మ్యాచ్
మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమానంగా ఉన్న ఇరుజట్లు
-
Dec 05, 2025 07:24 IST
'అఖండ 2' సినిమా విడుదల వాయిదా
'అఖండ 2' విడుదల వాయిదా వేసినట్లు నిర్మాతల ప్రకటన
అనివార్య కారణాలతో మూవీ విడుదల వాయిదా: 14 రీల్స్ సంస్థ
త్వరలో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం: నిర్మాణ సంస్థ 14 రీల్స్