Womens Day 2025: 100 పింక్ ఆటోలను అందజేసిన సీఎం
ABN , Publish Date - Mar 08 , 2025 | 08:17 PM
చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం శనివారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారతా శాఖ తరఫున పింక్ ఆటోలను లబ్ధిదారులకు అందించారు.

చెన్నై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా మహిళా లబ్ధిదారులకు 100 పింక్ ఆటోలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) అందజేశారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం శనివారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారతా శాఖ తరఫున పింక్ ఆటోలను లబ్ధిదారులకు అందించారు. రూ.72 కోట్లతో కాంచీపురం, ఈరోడ్, ధర్మపురి, శివగంగ, థేని, కడలూరు, నాగపట్నం, రాణిపేట్, కరూర్ జిల్లాల్లో 'న్యూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్'ను నిర్మించనున్నట్టు సీఎం ప్రకటించారు.
Ranya Rao Gold Sumggling Case: రన్యారావు కేసులో కీలక మలుపు.. రంగలోకి సీబీఐ
కొత్తగా నిర్మించనున్న మహిళా హాస్టళ్లలో 700 పడకలు, బయోమెట్రిక్ ఎంట్రీ, వైఫై, స్వచ్ఛమైన తాగునీరు, 24 గంటలూ భద్రత వంటి సౌకర్యాలు కల్పిస్తామని స్టాలిన్ చెప్పారు. ఈ సందర్భగా అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు చెందిన మహిళలకు పర్యవారణ, వాతావరణ మార్పు శాఖ తరపున 50 ఆటోలను ఆయన అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో ఆయన సంభాషించారు.
మదర్ థెరిస్సా ఉమెన్స్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సెలర్ యశోద షణ్ముగసుందరానికి అవ్వయార్ అవార్డు-2025ను సీఎం ప్రదానం చేశారు. విధి నిర్వహణలో ప్రతిభచూపిన వారికి ఇచ్చే ''స్టేట్ గర్ల్ చైల్డ్ ప్రొటక్షన్ డే'' అవార్డులను కన్యాకుమారి జిల్లా కలెక్టర్ అళుగు మీన, కాంచీపురం జిల్లా కలెక్టర్ కలైసెల్వి మోహన్‌కు ప్రదానం చేశారు.
దీనికిముందు, మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం వీడియో సందేశం ఇచ్చారు. మహిళలు ఏరంగంలో ఉన్నా వారికి తగిన గౌరవం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ప్రతినెలా రూ.1,000 ఆర్థిక సాయంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఈ-సేవా కేంద్రాల్లో మహిళలు కొనుగోలు చేసే కో-ఆప్టెక్స్ ఉత్పత్తులపై 5 శాతం తగ్గింపు, సర్వీస్ చార్జీల్లో 10 శాతం తగ్గింపు ఇస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ
PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..
Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.