Tungabhadra: తుంగభద్ర ఎగువ కాలువకు నీటి విడుదల
ABN , Publish Date - Jul 11 , 2025 | 01:15 PM
తుంగభద్ర(Tungabhadra) జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్‌ఎల్‌సీ)కు గురువారం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర బోర్డు సెక్రటరీ ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్, హెచ్‌ఎల్‌సీ ఈఈ చంద్రశేఖర్, డ్యాం స్వీచ్ ఆన్ చేసి నీరు విడుదల చేశారు.

- వాయనం సమర్పించిన బోర్డు అధికారులు
- సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచన
బెంగళూరు: తుంగభద్ర(Tungabhadra) జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్‌ఎల్‌సీ)కు గురువారం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర బోర్డు సెక్రటరీ ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్, హెచ్‌ఎల్‌సీ ఈఈ చంద్రశేఖర్, డ్యాం స్వీచ్ ఆన్ చేసి నీరు విడుదల చేశారు. అంతక ముందు బోర్డు అధికారులు డ్యాంపై పూజలు చేశారు. అనంతరం సంప్రదాయబద్దంగా వాయనం వదిలారు.
ఈ సందర్భంగా బోర్డు సెక్రటరీ ఓఆర్‌కే రెడ్డి మాట్లాడుతూ తుంగభద్ర ఎగువకాలువకు తొలుత 100 క్యూసెక్కుల నీరు వదిలి, తరువాత ప్రతి రెండు గంటలోకోసారి నీరు పెంచుతామన్నారు. ఆంధ్ర, కర్ణాటక(Andhra, Karnataka) కోటా రెండు కలిపి నీరు విడుదల చేస్తామన్నారు. ఖరీఫ్ పంటల సాగుకు ఈనెల 10వ తేదీ నుంచి నవంబరు 30 వరకు దాదాపు 1300 క్యూసెక్కులు వదులుతున్నట్లు తెలిపారు.
తుంగభద్ర జలాశయానికి ఎన్నడులేని విధంగా జూలై మొదటి వారంలోనే డ్యాంలో నీరు పూర్తిస్థాయిలో చేరడంతో నదికి నీటిని విడుదల చేశామన్నారు. డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 100టీఎంసీలు కాగా ప్రస్తుతం 80 టీఎంసీలకు కుదించినట్లు తెలిపారు. ప్రస్తుతం డ్యాంపై భాగంలో వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో ఇన్‌ఫ్లో గణనీయంగా పెరిగిందన్నారు.
రైతులు సాగు విషయంలో నీరు వృథా చేయకుండా వాడుకోవాలన్నారు. 12వ తేతీ సాయంత్రం 6గంటల కల్లా ఆంధ్ర(Andhra) సరిహద్దులోని 105 కిలో మీటర్ వద్దకు తుంగభద్ర జాలాలు చేరుతాయన్నారు. పూజా కార్యక్రమంలో డ్యాం ఇంజనీర్లు, టీబీ డ్యాం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..
నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు
Read Latest Telangana News and National News