Share News

Delhi: ఆ వాహనాలకు బంకుల్లో ఇంధనం బంద్

ABN , Publish Date - Mar 01 , 2025 | 05:35 PM

కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా అధికారులతో పర్యావరణ శాఖ మంత్రి మంజిందార్ సింగ్ సిర్సా శనివారంనాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వాహన కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ సిర్సా చెప్పారు.

Delhi: ఆ వాహనాలకు బంకుల్లో ఇంధనం బంద్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్య నివారణకు ఢిల్లీ బీజేపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31వ తేదీ తర్వాత బంకుల్లో ఇంధనం పోయడం నిలిపివేయాలని నిర్ణయించింది. కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా అధికారులతో పర్యావరణ శాఖ మంత్రి మంజిందార్ సింగ్ సిర్సా (Manjinder Singh Sirsa) శనివారంనాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వాహన కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ సిర్సా చెప్పారు. పాత వాహనాలపై ఆంక్షలు, తప్పనిసరి యాంటీ స్మోగ్ చర్యలు, దశలవారిగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడంపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు.

Amit shah: మణిపూర్‌లో శాంతిభద్రతలపై సమీక్ష.. అమిత్‌షా కీలక ఆదేశాలు


''పెట్రోల్ పంపుల వద్ద గాడ్జెట్‌లు ఏర్పాటు చేస్తాం. వాటి సాయంతో 15 ఏళ్లు పైబడిన వాహనాలను గుర్తిస్తాం. వాటికి ఇంధనం సరఫరా ఆపేస్తాం'' అని మంత్రి తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖకు కూడా తెలియజేశామని చెప్పారు. ఇంధనం సరఫరా ఆంక్షలతో పాటు, ఢిల్లీలోని బహుళ అంతస్తుల భవనాలు, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లకు తప్పనిసరిగా యాంటీ స్మోగ్ గన్లను అమర్చాలని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా సుమారు 90 శాతం సీఎన్‌జీ బస్సులను దశలవారిగా ఉపసంహరించుకుని ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయనున్నట్టు చెప్పారు.


ఢిల్లీలో కొన్ని పెద్ద హోటళ్లు, పెద్ద ఆఫీస్ కాంప్లెక్స్‌లు, ఢిల్లీ విమానాశ్రయం, పెద్ద నిర్మాణ స్థలాలు ఉన్నాయని, వాటన్నింటికీ వెంటనె యాంటీ స్మోగ్ గన్స్‌ను ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరి చేయనున్నట్టు మంత్రి చెప్పారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లకు కూడా ఇది వర్తింపజేస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి

PM Modi: ప్రపంచ శక్తిగా భారత్ మారుతోంది: మోదీ

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2025 | 06:28 PM