Pahalgam Attack: ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:55 PM
పల్టాన్ బజార్ వంటి కీలక ప్రాంతాల్లో ప్రధానంగా ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో దుకాణాల యజమానులు అమ్మకాలు జరిపే మందుకు సమగ్ర వెరిఫికేషన్ జరపాలని సింగ్ ఆదేశించారు.

డెహ్రాడూన్ : హహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ, పారామిలటరీ దుస్తుల దుర్వినియోగంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొరడా ఝలిపించింది. దుకాణాల్లో వీటి అమ్మకాలపై నిఘా ఉంచడంతో పాటు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. యూనిఫాం, భద్రతా బలగాలకు సంబంధించి వస్తువులను అమ్మే దుకాణాల జాబితాను సిద్ధం చేయాలని స్టేషన్ ఇన్‌చార్జులందరికీ డెహ్రాడూన్ ఎస్ఎస్‌పీ అజయ్ సింగ్ ఆదేశాలు ఇచ్చారు.
Pahalgam terror attack: ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం
పల్టాన్ బజార్ వంటి కీలక ప్రాంతాల్లో ప్రధానంగా ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో దుకాణాల యజమానులు అమ్మకాలు జరిపే మందుకు సమగ్ర వెరిఫికేషన్ జరపాలని సింగ్ ఆదేశించారు. కస్టమర్ల ఆథార్, ఐడీ కార్డులు, ఫోన్ నెంబర్లు సరిచూసుకోవాలని, అడ్రెస్ తీసుకోవాలని, బైయర్ యూనిట్ పేరును ధ్రువీకరించుకోవాలని కోరింది. యూనిఫాంల దుర్వినియోగం జరక్కుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
''గతంలో ఓల్డ్ బెటాలియన్లు షాపింగ్ కోసం పల్టాన్ బజార్ వచ్చేవి. ఇక్కడ చాలా దుకాణాల్లో ఆర్మీ, పోలీసు యూనిఫాంలు అమ్ముతుంటారు. అధీకృత వ్యక్తులకు మాత్రమే మిలట్రీ, పోలీసు యూనిఫాంలు అమ్ముతున్నారా అనేది తెలుసుకునేందుకు ఇటీవల మేము తనిఖీలు జరిపాం. కస్టమర్ల ఐడీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని దుకాణదారులకు చెప్పాం'' అని ఎస్ఎస్‌పీ తెలిపారు. కాగా, ఈరోజు కూడా ఎస్‌ఎస్‌పీ తమ దుకాణాలకు వచ్చి యూనిఫాం అమ్మకాలపై తగిన సూచనలిచ్చినట్టు దుకాణదారు సాగర్ అహుజా తెలిపారు. ఎస్ఎస్‌పీ ఆదేశాలను తాము తు.చ. తప్పకుండా పాటిస్తున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Exercise Aakraman: ఎల్ఓసీ సమీపంలో భారత వాయుసేన 'ఎక్సర్‌సైజ్ ఆక్రమణ్'
Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ఎమ్మెల్యే అరెస్ట్
For National News And Telugu News