Ramdev Baba: అమెరికా 'టారిఫ్ టెర్రరిజం'... రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 09 , 2025 | 06:52 PM
కొన్ని శక్తివంతమైన దేశాలు ప్రపంచాన్ని విధ్యంసం దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నందున భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాందేవ్ బాబా అన్నారు.

నాగపూర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trumph)పై యోగా గురువు, ఎఫ్ఎంసీసీ జెయింట్ పతంజలి సహ-వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా (Ramdev Baba) మండిపడ్డారు. టారిఫ్ టెర్రరిజాన్ని ట్రంప్ ప్రోత్సహిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలు ఎంతైతే టారిఫ్ విధిస్తారో తామూ అంతే టారిఫ్ విధిస్తామంటూ 'రెసిప్రోకల్ టారిఫ్'లను ట్రంప్ విధిస్తుండంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు సరికొత్త మేథో వలసరాజ్యం శకాన్ని సృష్టిస్తూ పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
Tariff Cuts: ట్రంప్‌కు భయపడి కాదు.. ఇందువల్లే టారిఫ్‌లు తగ్గించాం.. భారత ప్రభుత్వం..
''ఇదొక సరికొత్త మేథో వలసరాజ్య శకం. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, ఆయన టారిఫ్ టెర్రరిజంలో ప్రపంచ రికార్డు సృష్టిస్తుంటారు. పేదలు, అభివృద్ధి చెందిన దేశాలను బెదిరిస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుంటారు. ప్రపంచాన్ని కొత్త శకంలోకి తీసుకెళ్తుంటారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఇండియా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశాన్ని పటిష్ట దేశంగా తీర్చిదిద్ది, ఇలాంటి విధ్వంసక శక్తులకు గట్టి జవాబిచ్చేందుకు భారతీయులంతా సమష్టిగా నిలబడాలి" అని మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా రామ్‌దేవ్ బాబా అన్నారు. కొన్ని శక్తివంతమైన దేశాలు ప్రపంచాన్ని విధ్యంసం దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నందున భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
అమెరికాలో హిందూ ఆలయం విధ్వంసంపై..
కాలిఫోర్నియాలోని హిందూ ఆలయాన్ని విధ్వంసం చేసిన ఘటనను రామ్‌దేవ్ బాబా ఖండించారు. ఈ తరహా మతపరమైన ఉగ్రవాదానికి కళ్లెం వేసేందుకు ఇండియా చొరవ తీసుకోవాలన్నారు. రెలిజియస్ టెర్రరిజంతో యావత్ ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటోందని, దీనికి అన్ని దేశాల అధిపతులు ఒక పరిష్కారం కనుగొనాలని, ఈ దిశగా ఇండియా తగిన చొరవ చూపించాలని సూచించారు.
ఔరంగజేబుది దోపిడీల కుటుంబం
మొఘల్ చక్రవరి ఔరంగబేబ్‌కు సంబంధించిన అడిగిన ఒక ప్రశ్నకు ఆయన ఎప్పుడూ భారత ప్రజల ఆరాధ్యనీయుడు కాదని సమాధానమిచ్చారు. ''ఆయన దోపిడీల కుటుంబానికి చెందిన వాడు. బాబర్ కానీ ఆయన కుటుంబం కానీ ఇండియాను దోచుకునేందుకు వచ్చారు. వేలాదిమంది మన మహిళలను వాళ్లు చిత్రహింసలు పెట్టారు. వాళ్లు మన ఐడల్స్ కాదు. ఛత్రపతి శివాజీ మనకు ఆరాధ్యుడు" అని రాందేవ్ బాబా చెప్పారు.
ఇవి కూడా చదవండి
Bihar Assembly Elections: నితీష్‌కు ఎన్నికల ఆఫర్‌పై తేజస్వి ఎంతమాట అన్నారంటే..?
California Hindu Temple: కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దాడి.. భారత్ ఖండన
Muralitharan alloted Land in Kashmir: స్పిన్ లెజెండ్ మురళీధరన్‌కు కశ్మీర్‌లో ఫ్రీగా భూమి కేటాయించారా?
Gold Smuggling Case: రన్యారావు కేసులో బిగ్ ట్విస్ట్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.