Indian Migrants: యూఎస్ నుంచి భారత్ చేరిన వలసదారులు ఏ రాష్ట్రాల వారు? వారినేం చేస్తారు?
ABN , Publish Date - Feb 05 , 2025 | 04:19 PM
భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తొలి బ్యాచ్‌లో 30 మంది పంజాబ్‌కు చెందిన వారున్నారు.

న్యూఢిల్లీ: అమెరికా నుంచి అక్రమ భారతీయ వలసదారులతో అమృత్‌సర్ చేరుకున్న యూఎస్ ప్రత్యేక విమానం తొలి బ్యాచ్‌లో 104 మంది ఉన్నారు. భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తొలి బ్యాచ్‌లో 30 మంది పంజాబ్‌కు చెందిన వారున్నారు. హర్యానా, గుజరాత్‌లకు చెందిన వారు చెరో 33 మంది ఉన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి చెరో ముగ్గురు, ఛండీగఢ్‌కు చెందిన వారు ఒకరు ఉన్నారు.
Indian Migrants: 104 మంది అక్రమ వలసదారులతో అమృత్‌సర్‌కు చేరుకున్న యూఎస్ విమానం
కాగా, డిపోర్టీలలో 25 మంది మహిళలు, 12 మంది మైనర్లు ఉన్నారు. వీరిలో నాలుగేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. 25 ఏళ్ల వయస్సులోపు వారు 48 మంది వరకూ ఉన్నారు. వీరితో విమానంలో ప్రయాణించిన వారిలో 11 మంది సిబ్బంది, డిపోర్షన్ ప్రక్రియను పర్యవేక్షించేదుకు 45 మంది అమెరికా అధికారులు ఉన్నారు.
పోలీసు భద్రతతో ప్రత్యేక బస్సుల్లో..
కాగా, విమానాశ్రయానికి చేరుకున్న వారిని నిర్బంధంలోకి తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు లేవని చెబుతున్నారు. డాక్యుమెంట్ల వెరిఫికేషన్, వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత వారిని సంబంధిత రాష్ట్రాలకు పంపుతారని తెలుస్తోంది. డిపోర్టీలను కలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యలెవరూ రాలేదని కూడా అధికారులు చెబుతున్నారు. డిపోర్టీలను సొంతిళ్లకు పంపేందుకు ప్రత్యేక బస్సులను ఆయన రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని, వారి భద్రత కోసం పోలీసు సిబ్బందిని కూడా బస్సుల్లో పంపుతారని అంటున్నారు.
ఎంతమంది యూఎస్‌లో ఉన్నారు?
యుఎస్‌లో వీసాగడువు ముగిసిపోయినా అక్కడే ఉండటం, సరైన డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా ఉంటున్న వారి సంఖ్య ఇతమిత్థంగా అధికారులు వెల్లడించడం లేదు. అయితే మెక్కికో, సాల్వడార్ తర్వాత చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారని, వీరి సంఖ్య సుమారు 7,25,000 ఉండొచ్చని 'ప్యూ రీసెర్చ్ సెంటర్' గణాంకాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Delhi Elections 2025 : అడుగడునా బారికేడ్లు..ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు.. ఢిల్లీ పోలీసులపై మంత్రి ఫైర్
Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. రాష్ట్రపతి నుంచి రాహుల్ వరకు ఓటేసిన ప్రముఖులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి