Home » United States
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇరాన్ విదేశీ వ్యవహారాల వ్యూహాత్మక మండలి సలహాదారు కమల్ ఖారాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. దౌత్య భాష అమెరికాకు తెలియదని, ఆ దేశంతో సుదీర్ఘ యుద్ధానికి ఇరాన్ ఆర్మీ సిద్ధంగా ఉందని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
గల్ఫ్ దేశాలపై దాడుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆదివారంనాడు తెలిపారు. పొరుగు దేశాలు దాడులు జరిపితే తమ దేశ రక్షణ కోసం ప్రతిస్పందించాల్సి వస్తుందని వివరించారు.
ఇరాన్ తాజాగా బహ్రెయిన్ రాజధాని మేనామలోని జుఫైర్ జిల్లాలోని అమెరికా నావికాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధానకార్యాలయంపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 21 మంది అమెరికా సైనికులు మృతి చెందినట్టు టెహ్రాన్ టైమ్స్ తెలిపింది.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఓడిపోయిన దేశంగా ఇరాన్ మారిందని, ఆ దేశం ఇంకెతమాత్రం మద్యప్రాచ్య ప్రాంతంపై ఆధిపత్యం చలాయించే శక్తి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ బుధవారం నాడు భీకరంగా విరుచుకుపడింది. ఇరాన్‌కు చెందిన యాక్-130 యుద్ధ విమానాన్ని టెహ్రాన్ గగనతలంలో ఇజ్రాయెల్ అడ్వాన్స్‌డ్ ఎఫ్-35 యుద్ధవిమానం కూల్చేసింది.
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త కూటమి మధ్య యుద్ధం ఐదోరోజైన బుధవారంనాడు మరింత తీవ్రమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత్తలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్ క్షిపణి లాంచర్లు, ఆయుధ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది.
అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ గత శనివారంనాడు తొలిసారి టెహ్రాన్‌పై జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే సోమవారంనాడు మరణించినట్టు ఆదేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది.
అమెరికా, ఇజ్రాయెల్ తాజాగా నాటాంజ్‌లోని ఇరాన్ ప్రధాన అణుక్షేత్రంపై దాడి చేసినట్టు ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఇరాన్ రాయబారి రెజా నజాఫి తెలిపారు. అయితే దీనిని ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ ఖండించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలుసుకోనున్నారు. ఈ విషయాన్ని మీడియాకు ట్రంప్ తెలిపారు.
రెండేళ్ల చిన్నారిని ఆమె తండ్రితో సహా యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇటీవల మినియాపోలిస్‌లో అదుపులోనికి తీసుకుంది.