Share News

Iran-Israel War: మిసైళ్లతో విరుచుకుపడిన ఇరాన్.. కానీ ఇజ్రాయెల్ దెబ్బకు..!

ABN , Publish Date - Jun 22 , 2025 | 03:08 PM

మిసైళ్లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీసింది ఇజ్రాయెల్. ఊహించని విధంగా గట్టి షాక్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..

Iran-Israel War: మిసైళ్లతో విరుచుకుపడిన ఇరాన్.. కానీ ఇజ్రాయెల్ దెబ్బకు..!
Iran-Israel War

ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకొని మిసైళ్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. తమ అణుకేంద్రాల మీద అమెరికా దాడులు చేసిన కొన్ని గంటలకు ఇరాన్ కౌంటర్ అటాక్స్ మొదలుపెట్టింది. అయితే వీటిని అంతే సమర్థంగా అడ్డుకుంది ఇజ్రాయెల్. అంతేగాక ఇరాన్‌‌ డెజ్‌ఫుల్ ఎయిర్‌‌పోర్ట్‌లోని రెండు ఎఫ్‌-5 జెట్స్‌ను కూల్చేసింది. ఈ యుద్ధ విమానాలను కూల్చేస్తున్న దృశ్యాలను రిలీజ్ కూడా చేసింది. ఇంతకుముందు ఎఫ్-14 టామ్‌కాట్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌‌లను పేల్చేసిన ఇజ్రాయెల్ మిలిటరీ.. ఇప్పుడు ఎఫ్-5 విమానాల పని పట్టింది.


ఆగని దాడులు..

ఇజ్రాయెల్ కూల్చేసిన ఎఫ్-5, ఎఫ్14 యుద్ధ విమానాలు చాలా పాతవి అని.. వీటిని ఇరాన్ అంతగా వాడటం లేదని తెలుస్తోంది. చాన్నాళ్లుగా ఇవి నిరుపయోగంగా ఉన్నాయని, విడిభాగాలు అందుబాటులో లేకపోవడంతో వీటిని పక్కనబెట్టారని సమాచారం. ఇస్ఫహాన్స్ విమానాశ్రయంతో పాటు మరికొన్ని ఎయిర్‌పోర్ట్‌ల మీద కూడా దాడులు చేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే ఇరాన్ దీనిపై స్పందించలేదు. కాగా, ఇరాన్ ప్రతిదాడులకు దిగిన నేపథ్యంలో తమ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్ సర్కారు. వరుసగా మిసైల్స్ దూసుకొస్తున్నందున సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. కాగా, ఇరాన్ 30 బాలిస్టిక్ మిసైల్స్‌తో ఇజ్రాయెల్ మీదకు తెగబడింది. ఈ దాడుల్లో చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయని.. దాదాపుగా 16 మంది పౌరులు గాయపడ్డారని సమాచారం. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తన గగనతలాన్ని మూసివేసింది ఇజ్రాయెల్. వరుసగా మిసైల్ అటాక్స్ జరుగుతుండటంతో ప్రజల భద్రతను దృ‌ష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి రక్షణ వర్గాలు వెల్లడించాయి.


ఇవీ చదవండి:

ఇరాన్‌పై దాడి తరువాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

ట్రంప్‌పై నెతన్యాహూ ప్రశంసల వర్షం

ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణు కార్యకలాపాలు ఆపదు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 03:12 PM