Share News

California Hindu Temple: కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దాడి.. భారత్ ఖండన

ABN , Publish Date - Mar 09 , 2025 | 02:36 PM

చినో హిల్స్‌లోని ప్రముఖ హిందూ ఆలయం బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిర్‌పై కొందరు భారత్ వ్యతిరేక రాతలు రాశారు. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

California Hindu Temple: కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దాడి.. భారత్ ఖండన

న్యూఢిల్లీ: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి జరిగింది. అక్కడి చినో హిల్స్‌లోని ప్రముఖ హిందూ ఆలయం బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిర్‌పై కొందరు భారత్ వ్యతిరేక రాతలు రాశారు. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఇందుకు బాధ్యులైన వారిపై స్థానిక అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

Vice President: అస్వస్థతకు గురైన ఉపరాష్ట్రపతి


కేంద్ర విదేశాంగశాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఈ ఘటనపై సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక ప్రకటన విడుదల చేశారు. ''కాలిఫోర్నియాలోని చినోహిల్స్‌లో హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు వచ్చిన వార్తలు చూశాం. ఇలాంటి దుశ్చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందుకు బాధ్యులైన వారిపై స్థానిక అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలిని డిమాండ్ చేస్తున్నాం. ప్రార్థనా స్థలాలకు తగిన భద్రత కల్పించాలని కూడా కోరుతున్నాం'' అని జైశ్వాల్ పేర్కొన్నారు.


కాగా, ఆ ఘటనను నార్త్ అమెరికాలో హిందూ కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలపై దృష్టి సారించిన అడ్వకసీ గ్రూప్ ''కొయలీషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ ఆమెరికా" సైతం ఖండించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకూ చినో హిల్స్ పోలీసు శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో కూడా కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలోని బాప్స్ శ్రీస్వామినారాయణ మందిరంపై ''హిందూస్ గో బ్యాగ్'' అంటూ విద్వేషపూరిత రాతలు రాశారు.


ఇవి కూడా చదవండి

Muralitharan alloted Land in Kashmir: స్పిన్ లెజెండ్ మురళీధరన్‌కు కశ్మీర్‌లో ఫ్రీగా భూమి కేటాయించారా?

Gold Smuggling Case: రన్యారావు కేసులో బిగ్ ట్విస్ట్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2025 | 02:39 PM