Share News

Indian Migrants: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి వెనక్కి.. ఇండియా చేరుకున్న వలసదారుల విమానం.. ఎంతమందంటే..

ABN , Publish Date - Feb 05 , 2025 | 03:33 PM

భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వీరంతా, పంజాబ్, చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది.

Indian Migrants: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి వెనక్కి.. ఇండియా చేరుకున్న వలసదారుల విమానం.. ఎంతమందంటే..

న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో అక్రమ వలసలపై ట్రంప్ సర్కార్ కఠిన చర్యల్లో భాగంగా భారత్‌కు చెందిన 104 మందిని స్వదేశానికి పంపింది. భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వీరంతా, పంజాబ్, చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులతో ప్రత్యేక విమానం భారత్‌కు రావడం ఇదే మొదటిసారి.

ChatGPT and AI Tools Ban : ఇకపై ఛాట్ జీపీటీ, డీప్ సీక్ వాడకాన్ని ఆపాలి.. కేంద్ర ప్రభుత్వం..


కాగా, విమానాశ్రయానికి చేరుకున్న వారిని నిర్బంధంలోకి తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు లేవని, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ఎయిర్‌పోర్ట్ నుంచి వారిని బయటకు పంపుతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో భారతీయ వలసదారులతో మరిన్ని విమానాలు అమెరికా నుచి రావచ్చని చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు చెప్పేందుకు అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి నిరాకరించారు. దేశ సరిహద్దులను పటిష్టం చేయడం, ఇమిగ్రేషన్ చట్టాలను కట్టుదిట్టం చేయడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపించడంపై అమెరికా గట్టి చర్యలు తీసుకుంటోందని చెప్పారు.


ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను గుర్తించి సైనిక విమానాల్లో వెనక్కి పంపుతోంది. ఇప్పటికే గటేమాలా, పెరు, హోండూరస్ తదితర దేశాలకు పలువురుని తరలించింది. భారత్ సైతం అక్రమ వసలకు తాము కూడా వ్యతిరేకమని చెబుతోంది. వీసా గడువు ముగిసినా సరైన డాక్యుమెంట్లు లేకుండా చట్టవిరుద్ధంగా భారతీయులు ఎక్కడున్నా వెనక్కి తీసుకువచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఇటీవల తెలిపారు. అయితే, అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న భారతీయుల సంఖ్యపై ఇప్పుడే చెప్పడం సరికాదన్నారు.


ఇవి కూడా చదవండి..

Delhi Elections 2025 : అడుగడునా బారికేడ్లు..ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు.. ఢిల్లీ పోలీసులపై మంత్రి ఫైర్

Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. రాష్ట్రపతి నుంచి రాహుల్ వరకు ఓటేసిన ప్రముఖులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 04:52 PM