UNESCO: సెంజి కోటకు యునెస్కో గుర్తింపు
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:17 AM
తమిళనాడు విల్లుపురం జిల్లాలోని చారిత్రక ప్రాంతం సెంజి కోటను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది...

చెన్నై, జూలై 12(ఆంధ్రజ్యోతి): తమిళనాడు విల్లుపురం జిల్లాలోని చారిత్రక ప్రాంతం సెంజి కోటను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. దేశంలో మహారాష్ట్రీయులు నిర్మించిన 12 కోటలకు ఈ మేరకు గుర్తింపునిస్తూ శుక్రవారం ప్రకటన వెలువరించింది. గతంలో తంజావూరు బృహదీశ్వరాలయం, కుంభకోణం ఐరావతేశ్వర ఆలయం, జయంకొండం గంగ కొండ చోళపురం ఆలయం, మహాబలిపురంలోని శిల్ప కళాఖండాలు, నీలగిరి కొండ రైలును ఆ సంస్థ ప్రపంచ వారసత్వ సంపదలుగా ప్రకటించింది. దీంతో తమిళనాట యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాల సంఖ్య ఆరుకు పెరిగింది. యునెస్కో ప్రతినిధి హవాజంగ్ జగామస్ నేతృత్వంలోని బృందం సెంజి కోటను గతేడాది సెప్టెంబర్‌లో క్షుణ్ణంగా పరిశీలించింది.