Tungabhadra: తుంగభద్రకు తగ్గిన ఇన్‌ఫ్లో..
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:45 PM
తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గడంతో 8 క్రస్ట్‌గేట్లు క్రిందకు దించి కేవలం 13క్రస్ట్‌గేట్ల గుండా మాత్రమే దిగువకు వరద నీరు విడుల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

- ఎగువన వర్షాలు తగ్గుముఖం
- 8 క్రస్ట్‌గేట్లు మూసివేత
- 13 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల
బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గడంతో 8 క్రస్ట్‌గేట్లు క్రిందకు దించి కేవలం 13క్రస్ట్‌గేట్ల గుండా మాత్రమే దిగువకు వరద నీరు విడుల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. తుంగభద్ర పై భాగం ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టటడంతో తుంగభద్ర జలాశయానికి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో బుధవారం అధికారులు 8 క్రస్ట్‌గేట్లను మూసేశారు.
బుధవారం సాయంత్ర 4గంటల సమయానికి అధికారులు సేకరించిన సమాచారం మేరకు ప్రస్తుతం జలాశయం ఎత్తు 1624.78 అడుగులకు నీటి మట్టం చేరుకోగా, జలాశయానికి 46,270 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వివిధ సాగునీటి కాలువలకు వదులుతుండగా,
జలాశయం 13క్రస్ట్‌గేట్లలో ఒక్కో గేటు 2.5అడుగులు చొప్పు ఎత్తి 36,699 క్యూసెసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు బోర్డు అధికారులు వివరించారు. ప్రస్తుతం జలాశయంలో 75.77 టీఎంసీల నీరు నిలువ ఉంచి. గత ఏడాది ఇదే సమయానికి 51,955 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వచ్చి చేరుతుండగా 23.079 టిఎంసి నీరు నిలువ ఉన్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే
Read Latest Telangana News and National News