Upendra Dwiveide: ట్రంప్ ఎప్పుడేమి చేస్తారో ఆయనకు కూడా తెలియకపోవచ్చు.. ఆర్మీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 09:28 PM
ద్వివేది తమ స్వస్థలమైన రేవాలోని టీఆర్‌ఎస్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ, సరిహద్దులు, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ యుద్ధం వంటి సవాళ్లతో పాటు కొత్తగా స్పేస్ వార్‌ఫేర్, శాటిలైట్, కెమికల్స్, బయోలాజికల్, రేడియోలాజికల్, సమాచార వార్‌ఫేర్ వంటి సవాళ్లలను సైన్యం ఎదుర్కొంటోందని ద్వివేది చెప్పారు.
రేవా: భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చితులు, భద్రతా సవాళ్ల పట్ల సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) అన్నారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. పాత సమస్యలు పరిష్కరించుకునే లోగా కొత్తవి ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రపంచ దేశాల మధ్య ఎప్పుడేమి జరుగుతుందో ఎవరూ చెప్పలేకున్నారని, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఇవాళ ఏం చేస్తున్నారు, రేపు ఏం చేయబోతున్నారనేది ఆయనకు కూడా తెలియకపోవచ్చని వ్యాఖ్యానించారు.
ద్వివేది తమ స్వస్థలమైన రేవాలోని టీఆర్‌ఎస్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ, సరిహద్దులు, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ యుద్ధం వంటి సవాళ్లతో పాటు కొత్తగా స్పేస్ వార్‌ఫేర్, శాటిలైట్, కెమికల్స్, బయోలాజికల్, రేడియోలాజికల్, సమాచార వార్‌ఫేర్ వంటి సవాళ్లలను సైన్యం ఎదుర్కొంటోందని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు చేశామని, అయితే పౌరుల పైన దాడులు జరిపినట్టు తప్పుడు ప్రచారం జరిగిందని అన్నారు. ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు చేశారు? ఇలాంటి వాటిని కూడా సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఆధునిక ఘర్షణలను ఎదుర్కోవడానికి త్రివిద దళాలు సమష్టిగా పనిచేస్తున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి..
మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు బలి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి