Supreme Court-POCSO Case: ఈ నేరం ప్రేమతో జరిగింది.. కామంతో కాదు: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:52 PM
పోక్సో కేసులో ఒక దోషికి విధించిన శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు అరుదైన తీర్పునిచ్చింది. ఈ నేరం ప్రేమతో జరిగిందని.. కామంతో కాదని పేర్కొంది. ఆ వ్యక్తి బాధితురాలినే వివాహం చేసుకోవడం..
ఇంటర్నెట్ డెస్క్: పోక్సో కేసులో ఒక దోషికి విధించిన శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు అరుదైన తీర్పునిచ్చింది. ఆ వ్యక్తి బాధితురాలినే వివాహం చేసుకోవడం.. ఓ బిడ్డ జన్మించడం.. వారు ప్రశాంత కుటుంబ జీవితాన్ని గడుపుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ నేరం ప్రేమతో జరిగిందని.. కామంతో కాదని పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సంక్రమించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి నిందితుడి శిక్షను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. బాలికను కిడ్నాప్ చేసి.. లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి చెన్నై ట్రయల్ కోర్టు 2018లో పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును మద్రాస్ హైకోర్టులో నిందితుడు సవాల్ చేశాడు. బాధితురాలిని తాను వివాహం చేసుకున్నానని.. బిడ్డతో సంతోషంగా ఉన్నామని పేర్కొన్నాడు.
అయితే మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేయడంతో నిందితుడు 2021లో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. బాధితురాలు కూడా కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేస్తూ.. తాను సదరు వ్యక్తితోనే జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నట్లు స్పష్టం చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం.. నిందితుడికి విధించిన శిక్షను రద్దు చేసింది. భార్యాబిడ్డలను విడిచిపెట్టకుండా జీవితాంతం గౌరవంగా చూసుకోవాలని అతడికి షరతు విధించింది.
ఇవి కూడా చదవండి..
PM Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి
Indias Heaviest Communication Satellite: ఇస్రో భారీ ప్రయోగం