Train Accident: రైలు ప్రమాద బాధితులు.. నష్ట పరిహారం ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?
ABN , Publish Date - Jan 24 , 2025 | 03:48 PM
Train Accident: రైలు ప్రమాదాలు తరచుగా జరుగుతోన్నాయి. వీటి కారణంగా పలువురు మరణిస్తు్న్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడి.. అంగవైకల్యం పొందుతున్నారు. అయితే వీరు రైల్వే శాఖ నుంచి నష్ట పరిహారాన్ని పొంద వచ్చు. అది ఎలాగంటే..

ఇటీవల కాలంలో దేశంలో రైలు ప్రమాదాలు తరచూ చోటు చేసుకొంటున్నాయి. రైళ్లు ఢీ కొనడం.. రైళ్లు పట్టాలు తప్పడం.. రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరగడం.. తదితర కారణాల వల్ల ప్రయాణికులు బాధితులుగా మారుతోన్నారు. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. మహారాష్ట్రలోని జలగావ్‌లో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయాంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీలోని అత్యవసర చైన్‌ను లాగారు. దీంతో రైలు ఆగిపోవడంతో.. ప్రయాణికులు బోగీ నుంచి పక్క ట్రాక్‌పైకి దూకేశారు. అదే సమయంలో అదే ట్రాక్ పైకి కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకొచ్చింది. దాంతో దాదాపు 20 మంది మరణించారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ రైలు ప్రమాదం కారణంగా బాధితులైన ప్రయాణికులు లేదా వారి కుటుంబ సభ్యులు రైల్వే శాఖ నుంచి నష్ట పరిహారాన్ని ఎలా తీసుకోవచ్చునంటే..
ఎవరు బీమా పొందుతారంటే..?
రైలులో ప్రయాణించే వారు రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలోనే బీమా చేసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రయాణించే రైలుకు ఏదైనా ప్రమాదం జరిగితే.. ఈ బీమా సహాయంతో పరిహారం పొందడం అత్యంత సులభం. ప్రమాదం జరిగిన సందర్భాలలో.. ప్రమాదం జరిగినప్పుడు, ప్రయాణీకులు లేదా వారి కుటుంబ సభ్యులు బీమా ప్రొవైడర్‌ను హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించాల్సి ఉంటుంది. ప్రమాదానికి గురైన ప్రయాణానికునికి సంబంధించిన వివరాలతోపాటు పాలసీ నంబర్, ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులకు పరిహారం లభిస్తుంది.
గాయపడిన వారికి సైతం నగదు..
అంతేకాదు.. ఓ వ్యక్తి రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. 30 రోజులకుపైగా ఆసుపత్రిలో ఉంటే.. అతడి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. అయితే స్వల్ప గాయాలు అయి.. చికిత్స పొంది10 రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే.. వారి ఖర్చులను మొత్తం తిరిగి చెల్లిస్తారు.
ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. నమోదు చేసుకొంటే చాలు..
రైలు ప్రమాదంలో గాయపడితే రూ. 2 లక్షల వరకు రైల్వే శాఖ పరిహారంగా అందిస్తోంది. ఇక ఓ వ్యక్తి ప్రమాదానికి గురై.. వికలాంగుడిగా మారితే.. అతడికి రూ. 7.5 లక్షల వరకు సహాయం అందుతోంది. రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే మాత్రం.. రూ. 10 లక్షల వరకు పరిహారం ఇవ్వాలనే నిబంధన ఉంది.
వీటికి సంబంధించి పరిహారం పొందేందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించాలి. ఈ వెబ్‌సైట్‌లో రైలులో ప్రయాణించిన ప్రయాణికుల వివరాల నమోదు చేయాలి. అందులో రైలు టికెట్, ఐడీ కార్డు మొదలైనవి ఉంటాయి. ఈ దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా రైల్వే విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని పత్రాలు ధృవీకరించిన అనంతరం క్లైయిమ్ దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి యొక్క బ్యాంకు ఖాతాలో నష్టపరిహారం కింద నగదు జమ అవుతోంది.
For National news And Telugu News