Share News

Rains: కన్నియాకుమారిలో కుండపోత.. స్తంభించిన జనజీవనం

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:36 PM

కన్నియాకుమారి జిల్లాలో గురువారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. కన్నియాకుమారిలోని మీనాక్షిపురం రోడ్డు, కోట్టార్‌ రోడ్డు, అసంబు రోడ్డు తదితర రహదారులలో మోకాలి లోతున నీరు ప్రవహించింది.

Rains: కన్నియాకుమారిలో కుండపోత.. స్తంభించిన జనజీవనం

చెన్నై: కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లాలో గురువారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. కన్నియాకుమారిలోని మీనాక్షిపురం రోడ్డు, కోట్టార్‌ రోడ్డు, అసంబు రోడ్డు తదితర రహదారులలో మోకాలి లోతున నీరు ప్రవహించింది. విద్యార్థులు గొడుగులు పట్టుకుని వెళ్లారు. సుశీంద్రం, అంజుగ్రామం, మయిలాడి, కొట్టారమ్‌ తదితర ప్రాంతాల్లోనూ చెదురుముదురుగా వర్షాలు కురిశాయి.


కాళికేశం, గిరిప్పారై ప్రాంతాల్లో వరద పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పేచ్చిపారై, పెరుంజాని, సిట్రారు జలాశయాల పరివాహక ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి. పేచ్చిపారై డ్యాంలో గురువారం ఉదయం నీటిమట్టం 44.21 అడుగులకు చేరింది. డ్యాంలో సెకనుకు 1285 ఘనపుటడుగుల జలాలు ప్రవేశిస్తున్నాయి. డ్యాం నుంచి సెకను 753 ఘనపుటడుగుల చొప్పున దిగువకు వదులుతున్నారు.


nani4.2.jpg

పెరుంజాని డ్యాంలోను నీటిమట్టం 69.45 అడుగులకు పెరిగింది. డ్యాంలోకి సెకనుకు 900 ఘనపుటడుగుల చొప్పున జలాలు ప్రవేశిస్తున్నాయి. ఈ వర్షాల వల్ల కాళికేశం, గిరిప్పారై, తడింగారోహణం ప్రాంతాల్లోని రబ్బరు తోటల్లో అడుగులోతున నీరు ప్రవహిస్తోంది. దీనితో రబ్బరు కోత పనులు ఆగిపోయాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 27 , 2025 | 12:36 PM