Poorest Counries: ప్రపంచంలో అత్యంత పేద దేశాలు.. ఫోర్బ్స్ ఇండియా జాబితా విడుదల..
ABN , Publish Date - Jun 03 , 2025 | 08:22 PM
World Poorest Counries: ప్రపంచంలోని అత్యంత పేద దేశాల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. వీటిలో భారతదేశం పొరుగుదేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయా? ఇండియా స్థానమెంతో ఇక్కడ తెలుసుకోండి.

World Top 10 Poor Countries: ప్రపంచంలోని 10 అత్యంత పేద దేశాల జాబితాను ఫోర్బ్స్ ఇండియా ఇటీవల విడుదల చేసింది. వీటిలో ఎనిమిది ఆఫ్రికాలో ఉన్నాయి. జనవరి 16, 2025 నాటికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థ అంచనా వేసిన తలసరి GDP, PPP ప్రకారం 2025లో ప్రపంచంలోని అత్యంత పేద దేశాలు ఈ జాబితాలో ఉన్నాయని ఫోర్బ్స్ ఇండియా నివేదిక పేర్కొంది. ఈ ర్యాంకింగ్ తీవ్ర పేదరికంతో పోరాడుతున్న దేశాలను హైలైట్ చేస్తోంది. భారతదేశంతో బలమైన సంబంధాలు కలిగిన ద్వీప దేశం మడగాస్కర్ 10వ స్థానంలో ఉంది. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.
ఫోర్బ్స్ ప్రకారం, ప్రపంచంలోని టాప్ 10 అత్యంత పేద దేశాల్లో అత్యల్ప తలసరి GDP కలిగి ఉన్న దేశం దక్షిణ సూడాన్. అత్యంత దురదృష్టకర దేశమనే బిరుదునూ ఆ దేశం కలిగి ఉంది. 2011లో స్వాతంత్ర్యం పొందిన ఈ చిన్న తూర్పు ఆఫ్రికా దేశంలో 11.1 మిలియన్ (1.1 కోట్లు) జనాభా ఉంది. మొత్తం GDP 29.99 బిలియన్ డాలర్లు. తర్వాతి స్థానాల్లో బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, యెమెన్, మొజాంబిక్, మలావి, కాంగో, సోమాలియా, లైబీరియా, మడగాస్కర్ ఉన్నాయి.
ఇవీ చదవండి:
శర్మిష్ఠ కేసులో ట్విస్ట్.. కేసు పెట్టి పరారైన వజాహత్.. గాలిస్తున్న పోలీసులు..
శర్మిష్ఠ పనోలికి బెయిల్ నిరాకరించిన కోల్‌కతా హైకోర్టు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి