Tomato: పొలాల్లోనే వదిలేశారు..
ABN , Publish Date - Jan 21 , 2025 | 01:40 PM
టమోటా(Tomato) రైతులకు కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు పంటలు కోసేందుకు కూడా వెనకాడు తున్నారు. కాయలను తెంచడానికి కూలీలకు అయ్యే ఖర్చు కూడా తిరిగి రాదని పొలాల్లోనే పంటను వదిలేసున్నాడు.

- ధరలు పడిపోవడంతో టమోటా రైతు విలవిల
- కూలి ఖర్చులు భరించలేక పంట కోయడానికీ వెనకడుగు
కంప్లి(బెంగళూరు): టమోటా(Tomato) రైతులకు కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు పంటలు కోసేందుకు కూడా వెనకాడు తున్నారు. కాయలను తెంచడానికి కూలీలకు అయ్యే ఖర్చు కూడా తిరిగి రాదని పొలాల్లోనే పంటను వదిలేసున్నాడు. మార్కెట్లో టమోటా ధర కిలో రూ.5 మాత్రమే పలుకుతుండంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంటను కోసే కూలీలకు రోజుకు రూ.350 ఇవ్వాల్సి వస్తుండటంతో రైతులు పంటను పొలంలోనే వదిలేస్తున్నారు. దేవసముద్రం క్రాస్(Devasamudram Cross) వద్ద రైతు తనకున్న రెండు ఎకరాలలో టమోటా పంట సాగుచేశారు. పంట పుష్కలంగా వచ్చింది.
ఈ వార్తను కూడా చదవండి: Road accident: కల్యాణం చూడకనే.. కన్ను మూశాడు..
తెగుళ్లు సోకడంతో ఈ సారి మందుల కోసం కూడా అధికంగా ఖర్చు చేశానని రైతు తెలిపారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేశామన్నారు. పిచికారి మందులు, రసాయనిక మందులు, కూలీలకు అధికంగా ఖర్చయ్యిందన్నారు. మంచిగా పంట పండిందని ఈ సారి లాభాలు వస్తాయనుకునే సమయంలో ఒక్కసారిగా మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ పంటలో కూడా నష్టాలే చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు రాని పరిస్థితి నెలకొంది. ఇతర పంటలతోపాటు టమోటా పంట కూడా ఈసారి కష్టాలను మిగిల్చిందని అందుకే పొలాల్లోనే వదిలేసినట్లు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!
ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్?
ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా
ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు
Read Latest Telangana News and National News