Share News

Terror Suspects Arrest: టెర్రర్ మాడ్యూల్ గుట్టురట్టు.. ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Nov 30 , 2025 | 06:10 PM

నార్త్ ఇండియాలో ఉంటున్న ఈ ముగ్గురు నిందితులకు ఐఎస్ఐ అసోయేటెడ్ టెర్రరిస్ట్ షెహజాద్ భట్టితో సంబంధాలున్నట్టు అధికారులు తెలిపారు.

Terror Suspects Arrest: టెర్రర్ మాడ్యూల్ గుట్టురట్టు.. ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురి అరెస్టు
Terrorists arrest

న్యూఢిల్లీ: పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI)తో సంబంధాలు కొనసాగిస్తున్న ముగ్గురిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. నార్త్ ఇండియాలో ఉంటున్న ఈ ముగ్గురికి ఐఎస్ఐ అసోయేటెడ్ టెర్రరిస్ట్ షెహజాద్ భట్టితో సంబంధాలున్నట్టు అధికారులు తెలిపారు.


అరెస్టయిన వారిలో ఒకరిని పంజాబ్‌కు చెందిన హరగుణ్‌ప్రీత్ సింగ్‌గా, రెండవ వ్యక్తిని మధ్యప్రదేశ్‌లోని దాటియాకు చెందిన వికాస్ ప్రజాపతిగా, మూడవ వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన ఆరిఫ్‌గా గుర్తించారు. 'పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షెహజాద్ భట్టి‌ నేతృత్వంలోని టెర్రర్ మాడ్యూల్‌‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అరెస్టు చేశాం' అని అడిషనల్ ఎస్పీ (స్పెషల్ సెల్) ప్రమోద్ కమార్ కుష్వాహ తెలిపారు.


'అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు ఈనెల 25న గురుదాస్‌పూర్ సిటీ పోలీస్ స్టేషన్ ముందు హ్యాండ్ గ్రనేడ్ విసిరారు. షెహజాద్ భట్టి ఈ దాడిని నిర్వహించాడు. పలు ప్రాంతాను టార్గెట్ చేసుకుని వీడియోగ్రఫీ, రెక్కీ జరిపి హ్యాండ్ గ్లనేడ్లు విసరుతుండం ఈ గ్రూప్ చేస్తుంటుంది' అని కుష్వాహ వివరించారు. కాగా, పాకిస్థాన్ బేస్ట్ టెర్రర్ మాడ్యూల్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించడం గత రెండు నెలల్లో ఇది రెండవది. సెప్టెంబర్‌లో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, సెంట్రల్ ఏజెన్సీలు పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి దేశంలో కీలక దాడులకు ప్లాన్ చేసిన టెర్రర్ మాడ్యూల్‌ గుట్టురట్టు చేసింది.


ఇవి కూడా చదవండి..

తమిళనాడులో ముగ్గురు మృతి.. నీటమునిగిన 57,000 హెక్టార్ల పంట

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 30 , 2025 | 06:16 PM