Share News

Gali, Sri Ramulu: ఆ ఇద్దరూ చెరో దారి అయ్యారుగా...

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:14 PM

బళ్లారికి చెందిన బీజేపీ అగ్రనాయకులు గాలి జనార్దన్‌రెడ్డి, బీ శ్రీరాములు(Gali Janardhan Reddy, B Sriramulu) మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో గత కొన్ని రోజులుగా జిల్లాలో వారు చర్చనీయాంశంగా మారారు.

Gali, Sri Ramulu: ఆ ఇద్దరూ చెరో దారి అయ్యారుగా...

- నాయకులు, కార్యకర్తలు ఎటువైపో..

- తారస్థాయికి గాలి, శ్రీరాములు మధ్య విభేదాలు

బళ్లారి(బెంగళూరు): బళ్లారికి చెందిన బీజేపీ అగ్రనాయకులు గాలి జనార్దన్‌రెడ్డి, బీ శ్రీరాములు(Gali Janardhan Reddy, B Sriramulu) మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో గత కొన్ని రోజులుగా జిల్లాలో వారు చర్చనీయాంశంగా మారారు. సండూరు ఉప ఎన్నికల్లో శ్రీరాములు బీజేపీ(BJP) అభ్యర్థి గెలుపునకు కృషి చేయలేదని గాలి జనార్దన్‌రెడ్డి బాహాటంగా విమర్శలు గుప్పించారు. పార్టీ ముఖ్యనాయకులకు దీనిపై ఫిర్యాదు కూడా చేసినట్లు పార్టీలో చర్చ సాగింది.

ఈ వార్తను కూడా చదవండి: Kishan Reddy: తమిళనాట పెరుగుతున్న జాతీయవాదం..


అయితే వారి అనుచరులు, మద్దతుదారులు ఎటువైపు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు వీరి స్నేహం విడదీయడం ఎవరి తరం కాదు అనుకునేంతగా చేతులు వేసుకుని తిరిగారు. ప్రస్తుతం సీన్‌ రివర్స్‌ అయింది. వీరి స్నేహం ఇంతగా చెడిపోయిందా..? అనే విధంగా దూరమయ్యారు. గడిచిన ఆరేడేళ్లుగా వీరి మధ్య విభేదాలు మాత్రమే ఉండేవి. సండూరు ఉప ఎన్నికల కారణంగానే వీరు విడిపోయారని తెలుస్తోంది. ఒక దశలో నీవెంత అంటే నీవెంత అనే మాటల వరకూ వెళ్లారు.


pandu1.2.jpg

అంతటితో ఆగలేదు. గాలి జనార్దన్‌రెడ్డికి కొందరు మద్దత్తు ఇస్తే శ్రీరాములకూ కొందరు అండగా నిలిచారు. శ్రీరాములు వర్గం వారు వాల్మీకులను జనార్దన్‌రెడ్డి(Janardhan Reddy) కించపరిచే విధంగా మాట్లాడారని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా వాల్మీకి నాయకుడు శ్రీరాములుపై జనార్దన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇలా గత వారం రోజులుగా ఎక్కడ చూసినా బళ్లారితో పాటు కర్ణాటకలో శ్రీరాములు, గాలి జనార్దన్‌రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం గురించే చర్చ సాగుతుంది.


ఎవరి వైపు ఉండాలో..?

ఈ ఇద్దరి స్నేహం బాగా ఉన్న రోజుల్లో కథ వేరు ఇప్పుడు వేరు. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు కారణంగా ఎటు వైపు వెళ్లాలో తెలియక కొందరు సీనియర్‌ బీజేపీ నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. మరి కొందరు ఇద్దరి దగ్గరకూ వెళ్లకుండా దూరంగా ఉంటున్నారు. సీనియర్‌ కార్యకర్తలు మాత్రం ఈ ఇద్దరు ఉంటే ఏంటీ పోతే ఏంటీ మాపని మాదే అని పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.


వేడుకలకు శ్రీరాములు వర్గం దూరం

బీజేపీ బళ్లారి జిల్లా అధ్యక్షుడుగా రెండోసారి అనీల్‌ నాయుడు ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి బుధవారం బీజేపీ(BJP) కార్యాలయంలో అభినంద సభను ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం గాలి జనార్దన్‌రెడ్డితో పాటు ఆయన మద్దతు దారులు పాల్గొన్నారు. శ్రీరాములు, ఆయన వర్గీయులు రాలేదు. దీనితో పార్టీలో కూడా చర్చసాగుతోంది.


ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్

Read Latest Telangana News and National News

Updated Date - Jan 31 , 2025 | 01:14 PM