Share News

Bihar Assembly Elections: నితీష్‌కు ఎన్నికల ఆఫర్‌పై తేజస్వి ఎంతమాట అన్నారంటే..?

ABN , Publish Date - Mar 09 , 2025 | 05:35 PM

ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ (Nitish Kumar)తో తిరిగి చెలిమికి ఆర్జేడీ మంతనాలు సాగిస్తోందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆర్జేడీ నేత నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆదివారంనాడు ఘాటు సమాధానం ఇచ్చారు.

Bihar Assembly Elections: నితీష్‌కు ఎన్నికల ఆఫర్‌పై తేజస్వి ఎంతమాట అన్నారంటే..?

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ (Nitish Kumar)తో తిరిగి చెలిమికి ఆర్జేడీ మంతనాలు సాగిస్తోందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆర్జేడీ నేత నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) ఆదివారంనాడు ఘాటు సమాధానం ఇచ్చారు. "ఇలాంటి ఐడియాలు మీకు ఎవరిస్తారు? ఆయనను మేము ఎందుకు ఆహ్వానించాలి? అలాంటి ఆఫర్ ఏమీ లేదు. డోంట్ టాక్ నాన్సెన్స్'' అని మండిపడ్డారు. తనకు, లాలూజీకి తప్పితే ఇతరులెవ్వరికీ ఆఫర్ ఇచ్చే అథారిటీ లేదనీ, అలాంటి ఆఫర్ ఏదీ తమ వద్ద లేనేలేదని స్పష్టం చేశారు.

Delimitaion: పార్లమెంటును తాకనున్న డీలిమిటేషన్ సెగ .. డీఎంకే ఎంపీలు తీర్మానం


రాజకీయ కూటములు తరచు మారే అలవాటు నితీష్ కుమార్‌కు ఉంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో ఉన్న ఆయన ఎన్నికలకు ముందు కానీ, ఆ తర్వాత కానీ ఫిరాయింపులకు పాల్పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ యాదవ్‌కు ఒకప్పుడు ప్రత్యర్థిగా ఉన్న నితీష్ 2015 రాష్ట్ర ఎన్నికల్లో ఆర్జేడీతో పొత్తుపెట్టుకుని విజయం సాధించారు. ఎన్నికలైన రెండేళ్ల తర్వాత ఆర్జేడీతో తెగతెంపులు చేరుకుని తిరిగి బీజీపేతో చేతులు కలిపి సీఎం అయ్యారు. 2020 ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ తర్వాత మళ్లీ రెండేళ్ల తర్వాత ఆర్జేడీ కూటమితో చెలిమిచేశారు. 2024లో లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరిసారిగా నితీష్ ఎన్డీయేలో చేరారు.


కౌంటర్..ఎన్‌కౌంటర్

కాగా, గత కొద్ది రోజులుగా నితీష్ కుమార్, తేజస్వి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. లాలూ ప్రసాద్‌ను తానే ముఖ్యమంత్రిని చేశానని నితీష్ ఇటీవల అసెంబ్లీలో తేజస్విపై విరుచుకుపడ్డారు. లాలూ సొంత కులస్థులే (యాదవులు) వ్యతిరేకించినా తాను మాత్రం లాలూను సపోర్ట్ చేశానని చెప్పారు. ఇందుకు తేజస్వి ఘాటు రిప్లయ్ ఇచ్చారు. ఆర్జేడీ సపోర్ట్‌తోనే నితీష్ రెండుసార్లు సీఎం అయ్యారని, ఆయన పార్టీని కాపాడింది కూడా తామేనని చెప్పారు. నితీష్ కంటే ముందే లాలూ ప్రసాద్ రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని గుర్తు చేసారు.


ఇవి కూడా చదవండి

California Hindu Temple: కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దాడి.. భారత్ ఖండన

Muralitharan alloted Land in Kashmir: స్పిన్ లెజెండ్ మురళీధరన్‌కు కశ్మీర్‌లో ఫ్రీగా భూమి కేటాయించారా?

Gold Smuggling Case: రన్యారావు కేసులో బిగ్ ట్విస్ట్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2025 | 05:37 PM