Share News

Railway reservation: వేసవి సెలవులు.. రైల్వే రిజర్వేషన్‌ ప్రారంభం

ABN , Publish Date - Feb 20 , 2025 | 01:04 PM

వేసవి సెలవుల రైల్వే రిజర్వేషన్‌(Railway reservation) ప్రారంభమైంది. పాఠశాలలు, కళాశాలలకు వార్షిక పరీక్షలు ముగిసి ఏప్రిల్‌ మూడో వారం నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అధిక శాతం మంది తమ తమ స్వగ్రామాలకు వెళుతుంటారు.

Railway reservation: వేసవి సెలవులు.. రైల్వే రిజర్వేషన్‌ ప్రారంభం

చెన్నై: వేసవి సెలవుల రైల్వే రిజర్వేషన్‌(Railway reservation) ప్రారంభమైంది. పాఠశాలలు, కళాశాలలకు వార్షిక పరీక్షలు ముగిసి ఏప్రిల్‌ మూడో వారం నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అధిక శాతం మంది తమ తమ స్వగ్రామాలకు వెళుతుంటారు. ఈ నేపథ్యంలో, గతంలో రైళ్లలో ప్రయాణించేందుకు 120 రోజుల ముందుగా రిజర్వేషన్‌ చేసుకొనే సదుపాయం ఉండగా, ఆ గడువును 60 రోజులకు తగ్గించారు.

ఈ వార్తను కూడా చదవండిం: భార్య శీలాన్ని శంకించిన ప్రబుద్ధుడు.. ఇద్దరు పిల్లల్ని హతమార్చిన కసాయి తండ్రి


city7.jpg

దీంతో, ఏప్రిల్‌లో ప్ర యాణానికి రిజర్వేషన్‌ ప్రారంభమైంది. దక్షిణ జిల్లాలైన తిరునల్వేలి, కన్నియాకుమారి, పాండ్యన్‌(Tirunelveli, Kanniyakumari, Pandyan), ఆనందపురం, గురువాయూర్‌ తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఏప్రిల్‌ రెండవ వారంలో ప్రయాణించేందుకు అధిక శాతం మంది రిజర్వేషన్‌ చేసుకుంటున్నారు. కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఇప్పటికే సెకండ్‌ క్లాస్‌ రిజర్వేషన్‌ వెయింట్‌ లిస్ట్‌కు చేరుకోగా, ఏసీ బోగీల్లో ఖాళీలున్నట్లు అధికారులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: సిరిసిల్లలో ‘కేటీఆర్‌ టీ స్టాల్‌’ వివాదం

ఈవార్తను కూడా చదవండి: రోస్టర్‌ విధానంలో లోపాలు సరిచేయండి

ఈవార్తను కూడా చదవండి: ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ఈవార్తను కూడా చదవండి: కులగణన రీ సర్వేలో కేటీఆర్‌ పాల్గొనాలి..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 20 , 2025 | 01:04 PM