Special Trains: తెలుగు రాష్ట్రాల్లో.. ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు..
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:23 PM
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆయా పట్టణాలకు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తూ.. రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. కాచిగూడ, సికింద్రాబాద్, నరసాపురంలకు ఈ రైళ్లను నడపనున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

చెన్నై: ప్రయాణికుల సౌకర్యార్ధం పలు ప్రత్యేక రైళ్లు పొడిగిస్తూ దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.
- నెం.07191 కాచిగూడ-మదురై(Kachiguda-Madhurai) ప్రత్యేక రైలు మే 12 నుంచి జూన్ 4వ తేది వరకు (సోమవారం), మరుమార్గంలో నెం.07192 మదురై-కాచిగూడ ప్రత్యేక రైలు మే 14 నుంచి జూన్ 4వ తేది వరకు (బుధవారం) పొడిగించారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: రూ.4.98 లక్షలకు ఊటీ కొండ రైలు అద్దెకు..
- నెం.7695 సికింద్రాబాద్-రామేశ్వరం ప్రత్యేక రైలు మే 7 నుంచి 28వ తేది వరకు (బుధవారం), మరుమార్గంలో నెం.07696 రామేశ్వరం-సికింద్రాబాద్(Rameshwaram-Secundrabad) ప్రత్యేక రైలు మే 9 నుంచి 30వ తేది వరకు (శుక్రవారం) నాలుగు సర్వీసుల చొప్పున పొడిగించారు.
- నెం.07153 నరసాపురం - బెంగళూరు(Narsapurasm-Bengaluru) ప్రత్యేక రైలు మే 9 నుంచి జూన్ 27వ తేది వరకు (శుక్రవారం), నెం.07154 ఎస్‌ఎంవీటీ బెంగళూరు-నరసాపురం ప్రత్యేక రైలు మే 10 నుంచి జూన్ 28వ తేది వరకు (శనివారం) తలా 8 సర్వీసులుగా పొడిగించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా
మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..
Read Latest Telangana News and National News