Home » Narasapuram
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆయా పట్టణాలకు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తూ.. రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. కాచిగూడ, సికింద్రాబాద్, నరసాపురంలకు ఈ రైళ్లను నడపనున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగిస్తూ దక్షిణ రైల్వే(Southern Railway) ప్రకటన విడుదల చేసింది.
పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురంలో భారీ దొంగతనం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్‌లో రూ. 11 లక్షల నగదు, 4 వందల గ్రాముల బంగారం బ్యాగ్ చోరీకి గురైంది. గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి నరసాపురం నుంచి నగదు బంగారం తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగింది.
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ తన పోస్ట్‌పోల్ సర్వేను విడుదల చేసింది. ఏపీలో బీజేపీ మూడు లోక్‌సభ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆరా సర్వేలో తేలిందన్నారు.
వేసవి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నరసాపురం- బెంగళూరు (వయా. కాట్పాడి, జోలార్‌పేట) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.
పశ్చిమ గోదావరి: ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం నుంచి రెండు రోజులపాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించ నున్నారు. ఎన్డీఏ కూటమి తరపున జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది.
Narasapuram MP Candidate: నరసాపురం నుంచి కూటమి తరఫున భూపతిరాజు శ్రీనివాసవర్మను బీజేపీ ప్రకటించింది. ఇంతకీ ఎవరీ వర్మ..? రఘురామకృష్ణం రాజును ఎందుకు కూటమి వద్దనుకుంది..? తెరవెనుక ఏం జరిగింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
ప.గో.జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కేసులో 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టంగా చెప్పారన్నారు.
ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. టికెట్ రాదని తెలిసి కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరేమో ఒక నియోకవర్గంలోని అభ్యర్థులు మరొక నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదు.