Share News

Speaker Appau: మైనారిటీ ఓట్లు చీల్చేందుకే విజయ్‌కి బీజేపీ పరోక్ష మద్దతు..

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:36 PM

అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను చీల్చేందుకే కేంద్రంలోని బీజేపీ పాలకులు తమిళగవెట్రి కళగంకు మద్దతునిస్తున్నారని, ఆ పార్టీ నాయకుడు విజయ్‌ తల్లి క్రైస్తవురాలు కావడంతో, ఆ ఓట్లను చీల్చవచ్చునని కలలు కంటున్నారని స్పీకర్‌ అప్పావు విమర్శించారు.

Speaker Appau: మైనారిటీ ఓట్లు చీల్చేందుకే విజయ్‌కి బీజేపీ పరోక్ష మద్దతు..

- స్పీకర్‌ అప్పావు ఆరోపణ

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను చీల్చేందుకే కేంద్రంలోని బీజేపీ పాలకులు తమిళగవెట్రి కళగంకు మద్దతునిస్తున్నారని, ఆ పార్టీ నాయకుడు విజయ్‌ తల్లి క్రైస్తవురాలు కావడంతో, ఆ ఓట్లను చీల్చవచ్చునని కలలు కంటున్నారని స్పీకర్‌ అప్పావు(Speaker Appau) విమర్శించారు. తిరునల్వేలిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల శివగంగ జిల్లా తిరుభువనం ఆలయ వాచ్‌మన్‌ లాక్‌పడెత్‌కు నిరసనగా టీవీకే ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో విజయ్‌ మాట్లాడిన మూడు నిమిషాల ప్రసంగాన్ని విన్నానని,


గతంలో జరిగిన లాక్‌పడెత్‌ కేసుకు సంబంధించి జయరాజ్‌ ఫెన్సిక్‌ కేసులో మృతి చెందిన వ్యక్తిపేరు కూడా ఆయనకు తెలియలేదని, ఆ డైలాగులు ఎవరు రాసి చదవమని చెప్పారో తెలియటం లేదన్నారు. జయరాజ్‌ ఫెనిక్స్‌ కేసును సరిగా దర్యాప్తు జరుగకపోవడంవల్లే సీబీఐ విచారణకు సీఎం స్టాలిన్‌ కోరారని చెప్పారు. వాచ్‌మన్‌ అజిత్‌కుమార్‌ లాక్‌పడెత్‌తో సంబంధాలున్న వారందరిపైనా కేసులు నమోదయ్యాయయని, ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) స్వయంగా అజిత్‌కుమార్‌ కుటుంబీకులకు భేషరతుగా క్షమాపణలు చెప్పుకున్నారని తెలిపారు.


nani4.jpg

ఇటీవల టీవీకేలో ఆదాయపు పన్నుల శాఖకు చెందిన మాజీ అధికారి అరుణ్‌రాజ్‌ చేరడం వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రమేయం ఉందంటున్నారని తెలిసిందన్నారు. కొన్నేళ్త క్రితం విజయ్‌ నివాసాల్లో ఐటీ దాడులు జరిగినప్పుడు అరుణ్‌రాజ్‌ జోక్యం చేసుకుని సానుకూలంగా వ్యవహరించారని, అందువల్లే ఆయన్ని పార్టీలో చేర్చుకున్నారని అప్పావు ఆరోపించారు. ఇక పుదుచ్చేరికి చెందిన బుస్సీ ఆనంద్‌కు అమిత్‌షాతో చిరకాల సంబంధాలున్నాయని తెలిపారు. విజయ్‌ అడగకపోయినా ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించడం, ఆయనకంటూ ప్రత్యేకంగా ఓ విమానాన్ని కూడా కొనిచ్చారని ఇదంతా కేంద్రంలోని బీజేపీ పెద్దల చలువే కదా అని ఆయన ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 17 , 2025 | 12:37 PM