Sanchar Saathi App: సంచార్ సాథీతో నిఘాకు తావే లేదు.. లోక్‌సభలో సింధియా
ABN , Publish Date - Dec 03 , 2025 | 02:59 PM
సంచర్ సాథీ యాప్‌తో వ్యక్తిగత జీవాతాలపై నిఘా పెడుతున్నారంటూ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి స్పందిస్తూ, వినియోగదారులు అక్కర్లేదనుకుంటే యాప్‌ను డిలీట్ చేయవచ్చని, యాక్టివేట్ చేసుకోకుంటే సరిపోతుందని అన్నారు.
న్యూఢిల్లీ: భారత్‌లో విక్రయించే ఫోన్లలో ముందుగానే 'సంచార్ సాథీ' (Sanchar Saathi) యాప్ ఇన్‌స్టాల్ చేసి ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు దుమారం రేపుతుండటంతో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) మరోసారి స్పష్టత ఇచ్చారు. ఈ యాప్‌తో స్నూపింగ్ సాధ్యం కాదని బుధవారంనాడు లోక్‌సభలో వివరించారు.
సంచర్ సాథీ యాప్‌తో వ్యక్తిగత జీవితాలపై నిఘా పెడుతున్నారంటూ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి స్పందిస్తూ, వినియోగదారులు అక్కర్లేదనుకుంటే యాప్‌ను డిలీట్ చేయవచ్చని, యాక్టివేట్ చేసుకోకుంటే సరిపోతుందని అన్నారు. స్నూపింగ్‌కు ఎంత మాత్రం సాధ్యం కాదని, ఇది రక్షణ కోసం ఉద్దేశించిన యాప్ అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుని హక్కు ఎలా ఉంటుందో అదే విధంగా ఇతర యాప్‌ల మాదిరిగానే అక్కర్లేదనుకుంటే ఈ యాప్‌ను కూడా తొలగించుకోవచ్చని, యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశించడానికి ముందు ఈ వెసులుబాటు ఉండేలా తాము చర్యలు తీసుకున్నామని వివరించారు. ఫోనులో యాప్ ఉందంటే ఆటోమాటిక్‌గా ఆపరేట్ అవుతుందని కాదని, యూజర్లు రిజిస్టర్ అయితేనే అది ఆపరేట్ అవుతుందని చెప్పారు.
'ప్రజల భాగస్వామ్యం ఉంటేనే యాప్ విజయవంతమవుతుంది. కానీ ఇప్పుడు పబ్లిక్ ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుని తామిచ్చిన ఆదేశాల్లో మార్పులు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం' అని సింధియా తెలిపారు. సింధియా మంగళవారంనాడు కూడా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వివరణ ఇచ్చారు. ఇది పూర్తిగా ఐచ్ఛికంగా, ప్రజాస్వామ్య తరహాలో తీసుకువచ్చిన యాప్ అని, వినియోగదారులు యాప్‌ను యాక్టివేట్ చేసుకుని దాని ప్రయోజనాలు పొందవచ్చని, అలా కాదనుకుంటే ఏ సమయంలోనైనా ఆ యాప్‌ను డిలీట్ చేయవచ్చని తెలిపారు. పార్లమెంటు వెలుపల కూడా మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా ఒక ఫోను కొంటే ముందుగానే కొన్ని యాప్స్ ఇన్‌స్టాల్ అయి వస్తాయని, గూగల్ మ్యాప్‌లు కూడా వస్తాయని అన్నారు. అక్కర్లేదనుకుంటే వాటిని తొలగిస్తామి, ఇప్పుడు కూడా అంతేనని, యాప్ వాడకూడదని అనుకుంటే దానిని డిలీట్ చేయవచ్చని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
విజయవంతంగా హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్.. ఎలైట్ క్లబ్‌లో భారత్
బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల మృతి.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి