Share News

Pawar praises Fadnavis: అలుపెరుగని సీఎం.. ఫడ్నవిస్‌పై శరద్ పవార్ ప్రశంసలు

ABN , Publish Date - Jul 22 , 2025 | 06:46 PM

ఫడ్నవిస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రజాజీవితం, సాధించిన విజయాలపై 'మహారాష్ట్ర నాయక్' అనే పేరుతో కాఫీ టేబుల్ బుక్‌ను విడుదల చేశారు. ఈ పుస్తకంలో శరద్ పవార్ ఒక ఆర్టికల్ కూడా రాశారు.

Pawar praises Fadnavis: అలుపెరుగని సీఎం.. ఫడ్నవిస్‌పై శరద్ పవార్ ప్రశంసలు
Devendra Fadnavis

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) మంగళవారంతో 55వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆసక్తికరంగా పార్టీలకు అతీతంగా ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రాభివృద్ధికి అలుపెరగని కృషి చేస్తున్నారని ప్రశంసించారు.


ఫడ్నవిస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రజాజీవితం, సాధించిన విజయాలపై 'మహారాష్ట్ర నాయక్' అనే పేరుతో కాఫీ టేబుల్ బుక్‌ను విడుదల చేశారు. ఈ పుస్తకంలో పవార్ ఒక ఆర్టికల్ కూడా రాశారు. ఫడ్నవిస్ ఎంతో చురుకైన పనీతీరు ప్రదర్శిస్తుంటారని, ఆయన అంకితభావం, శక్తి శ్లాఘనీయమనీ, అలుపెరగకుండా ఎలా పనిచేస్తుంటారని తరచు తాను ఆశ్చర్యపోతుంటానని పవార్ ఆ వ్యాసంలో ప్రశంసల జల్లు కురిపించారు.


ప్రధాని అభినందనలు

ఫడ్నవిస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ప్రగతి, పేదలు, బడుగు వర్గాల అభ్యున్నతికి పఢ్నవిస్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆయురారోగ్యాలతో అచిరకాలం ప్రజాసేవ కొనసాగించాలని అభిలషించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఫడ్నవిస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి, జవాబుదారీతనం, సుపరిపాలనతో మహారాష్ట్రను ప్రగతిపథం వైపునకు నడుపుతున్న ప్రజాకర్షణ కలిగిన నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ అని ప్రశంసించారు. ఆయురారోగ్యాలతో చిరకాల ప్రజాసేవ సాగించాలని సిద్ధవినాయకుని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

నన్ను మీరు కొడితే.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 06:58 PM