Shashi Tharoor: వాళ్లెవరు, వాళ్ల హోదా ఏమిటి.. నిలదీసిన శశిథరూర్
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:23 PM
జాతీయ భద్రతపై శశిథరూర్ గత శనివారంనాడు చేసిన వ్యాఖ్యలు ఆయనకూ, మురళీధరన్‌కూ మధ్య మాటలయుద్ధానికి దారితీసింది. కొచ్చిలో ఓ హైస్కూలు విద్యార్థి అడిగిన ఒక ప్రశ్నకు శశిథరూర్ సమాధానమిస్తూ, మన సాయుధ దళాలకు, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం సరైనదేనని తాను నమ్మడం వల్ల అనేక మంది తనను విమర్శించారని, అయితే తన వైఖరి సరైనదేనని నమ్మి దానిపై నిలబడ్డానని చెప్పారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా వెళ్తున్న తిరువనంతపురం ఎంపీ శశథరూర్ (Sashi Tharoor)కు, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు కె.మురళీధరన్ (K Muralidharan)కు మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. జాతీయభద్రత విషయంలో పార్టీలకు అతీతంగా స్పందించాలంటూ శశిథరూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మురళీధరన్ గత ఆదివారంనాడు ఘాటుగా స్పందించారు. ఆయన తమతో లేడని, ఇకపై కేరళలో జరిగే కాంగ్రెస్ కార్యక్రమాలకు ఆయనను పిలవమని స్పష్టం చేశారు. దీనిపై శశిథరూర్ తాజాగా స్పందించారు. అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఏదో ఒక ప్రాతిపదిక ఉండొచ్చనీ, వాళ్లెవరు? వాళ్ల హోదా ఏమిటి? నేను తెలుసుకోవాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
థరూర్ వెర్సస్ మురళీధరన్
జాతీయ భద్రతపై శశిథరూర్ గత శనివారంనాడు చేసిన వ్యాఖ్యలు ఆయనకూ, మురళీధరన్‌కూ మధ్య మాటలయుద్ధానికి దారితీసింది. కొచ్చిలో ఓ హైస్కూలు విద్యార్థి అడిగిన ఒక ప్రశ్నకు శశిథరూర్ సమాధానమిస్తూ, మన సాయుధ దళాలకు, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం సరైనదేనని తాను నమ్మడం వల్ల అనేక మంది తనను విమర్శించారని, అయితే తన వైఖరి సరైనదేనని నమ్మి దానిపై నిలబడ్డానని చెప్పారు. రాజకీయాలు అంటేనే పోటీ అని, తనలాంటి వాళ్లు పార్టీని గౌరవిస్తారని, అయితే జాతీయ భద్రత విషయానికి వచ్చేసరికి మనం ఇతర పార్టీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం వస్తుందని అన్నారు. అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి పార్టీలు ధానిని అవిధేయతగా భావిస్తుంటాయని, అదే పెద్ద సమస్య అని అన్నారు. జాతీయ భద్రతకు తాను ఎప్పుడూ తొలి ప్రాధాన్యతనిస్తానని, ఏ రాజకీయ పార్టీ అయినా దేశాన్ని మెరుగుపరచాలనే కోరుకుంటుందని చెప్పారు. సిద్ధాంతాల పరంగా పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్నా సురక్షితైన భారత్‌కు అవన్నీ కట్టుబడి ఉండాలన్నారు. జాతీయ ఐక్యతకు రాజకీయాలు అడ్డుకారాదని అన్నారు.
దీనిపై మురళీధరన్ వెంటనే స్పందించారు. థరూర్ తమలో లేరని, ఆయన తన వైఖరి మార్చుకునేంత వరకూ తిరువనంతపురంలో జరిగే కాంగ్రెస్ కార్యక్రమాలను ఆయనను పిలిచేది లేదని చెప్పారు. ఆయన కాంగ్రెస్‌పైన, ఇందిరాగాంధీపై పదేపదే దాడి చేస్తున్న కారణంగా ఆయనతో సహకరించేందుకు తాము సిద్ధంగా లేమని అన్నారు. థరూర్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడని, ఆయనపై ఏ చర్యలు తీసుకోవాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానమే నిర్ణయించాలని పేర్కొన్నారు.
ఎవరు వాళ్లు?
తమలో ఒకరు కాదంటూ కాంగ్రెస్ యూనిట్ నేత తనపై చేసిన వ్యాఖ్యలపై శశిథరూర్ సూటిగా స్పందించారు. ఈ మాటలు అంటున్న వాళ్లకు ఏదో ఒక ప్రాతిపదిక ఉన్నట్టు కనిపిస్తోందని అన్నారు. అసలు వాళ్లు ఎవరు, పార్టీలో వారి హోదా ఏమిటనేది తాను తెలుసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
జగదీప్ రాజీనామాకు ఆమోదం.. ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి