Share News

Lalit Modi: లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:42 PM

ఈ కేసులో లలిత్ మోదీ 2023 డిసెంబర్ 19న ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తనను బీసీసీఐ ఉపాధ్యక్షుడుగా నియమించారని, ఆ సమయంలో తాను ఐపీఎల్ చైర్మన్‌గా కూడా ఉన్నానని తన పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.

Lalit Modi: లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi)కి సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తనకు రూ.10.65 కోట్ల జరిమానా విధించడాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ మొత్తాన్ని బిసీసీఐ (BCCI) చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు తోసిపుచ్చింది. అయితే చట్టం ప్రకారం తనను తాను రక్షించుకునే హక్కు లలిత్ మోదీకి ఉందని న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, ఆర్.మహదేవన్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.


ఈ కేసులో లలిత్ మోదీ 2023 డిసెంబర్ 19న ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తనను బీసీసీఐ ఉపాధ్యక్షుడుగా నియమించారని, ఆ సమయంలో తాను ఐపీఎల్ చైర్మన్‌గా కూడా ఉన్నానని తన పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన వేసిన పిటిషన్‌లో అర్ధం లేదని, ఫెమా కింద వ్యక్తిగతంగా ఆయనకు ఫెనాల్టీ వేసినందున, ఆ మొత్తం బీసీసీఐ చెల్లించాల్సిన పని లేదని హైకోర్టు పేర్కొంటూ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. రూ.లక్ష రూపాయలు జరిమానా కూడా కోర్టు విధించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


బోర్టు బైలాస్ ప్రకారం బీసీసీఐ అధికారిక విధుల్లో ఉన్నప్పుడు ఆ సంస్థే వారికి నష్టపరిహారం చెల్లించాలని లలిత్ మోదీ వాదనను హైకోర్టు తోసిపుచ్చడాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్ధించింది. లలిత్ మోదీ పిటిషన్‌ను కొట్టివేసింది. ఐపీఎల్‌లో ఉండగా లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో లండన్‌కు పారిపోయారు.


ఇవి కూడా చదవండి..

ఐదేళ్లు పక్కా... సీఎం, డిప్యూటీ సీఎం ఐక్యతారాగం

కూలిన ఐదంతస్తుల భవంతి, ప్రమాదకర స్థితిలో మరిన్ని..

For National News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 04:45 PM