Ranveer Allahbadia: అల్హాబాదియాకు సుప్రీంలో ఊరట.. ప్రసారాలకు అనుమతి
ABN , Publish Date - Mar 03 , 2025 | 04:06 PM
పాడ్‌కాస్ట్ ప్రసారాలు నైతిక ప్రమాణాలకు లోబడి ఉండేలా చూసుకోవాలని, అన్ని వయసుల వారు చూసేలా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

న్యూఢిల్లీ: 'ఇండియాస్ గాట్ లాటెండ్' వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర దూమారం రేపిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. సోషల్ మీడియాలో పాడ్‌కాస్ట్‌లు, షోలు పునఃప్రారంభించేందుకు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో పాడ్‌కాస్ట్ ప్రసారాలు నైతిక ప్రమాణాలకు లోబడి ఉండేలా చూసుకోవాలని, అన్ని వయసుల వారు చూసేలా ఉండాలని షరతులు విధించింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు కూడా పరిమితులున్నాయని, అసభ్య పదజాలం వాడటం మంచిది కాదని మందలించింది.
Delhi Budget 2025: బడ్జెట్‌పై ప్రజల నుంచి సూచనలు కోరిన సీఎం
సంజయ్ రైనా యూట్యూబ్ షోలో తల్లిదండ్రులు, శృంగారంపై అల్హాబాదియా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపడం, పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్‌లు నమోదు కావడంతో ఆయన క్షమాపణ చెప్పారు. తనపై వేర్వేరు చోట్ల నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను ఒకేచోట చేర్చాలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ సందర్భంగా అహ్లాబాదియాను తీవ్రంగా మందలించిన సుప్రీం ధర్మాసనం..ఆయన పాడ్‌కాస్ట్ ప్రసారాలను ఆపేయాలని ఆదేశించింది. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ అరెస్టు నుంచి ఆయనకు రక్షణ కల్పించింది.
కాగా, తన షోలు ప్రదర్శించరాదనే ఆంక్షలను సడలించాలని, తన వద్ద 280 మంది ఉద్యోగులకు ఇదే ఉపాధి అని అల్హాబాదియా మరో పిటిషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై సోమవారంనాడు విచారణ జరిపిన ధర్మాసనం పాడ్‌కాస్ట్‌ను రద్దు చేయాలన్న ప్రాసిక్యూషన్ వాదనను తిరస్కరిస్తూ దానిని పునఃప్రారంభించేందుకు యూట్యూబర్‌కు అనుమతి ఇచ్చింది. గౌహతిలో నమోదైన కేసులో దర్యాప్తునకు హాజరు కావాలని కూడా ధర్మాసనం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
MK Stalin: కొత్త దంపతులు వెంటనే పిల్లల్ని కనండి
Mamata Banerjee: డూప్లికేట్ ఎపిక్ నంబర్లు ఉంటే.. నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదు!
Raksha Khadse: కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.