Share News

Jai Shankar: నా అమెరికా పర్యటనపై రాహుల్ వ్యాఖ్యలు నిరాధారం: జైశంకర్

ABN , Publish Date - Feb 03 , 2025 | 06:28 PM

బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లోని సెక్రటరీ, ఎన్ఎస్ఏను కలిసేందుకు అమెరికా వెళ్లానని, మన కాన్సుల్ జనరల్ సమావేశానికి అధ్యక్షత వహించాననీ, అయితే ఏ దశలోనూ ప్రధానమంత్రికి ఆహ్వానం విషయంపై చర్చ జరగలేదని ఎస్ జైశంకర్ తెలిపారు.

Jai Shankar: నా అమెరికా పర్యటనపై రాహుల్ వ్యాఖ్యలు నిరాధారం: జైశంకర్

న్యూఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని కోరేందుకు గత డిసెంబర్‌లో తాను అమెరికా వెళ్లినట్టు రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) ఖండించారు. రాహుల్ మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టారు.

Rahul Gandhi: దేశంలో మకాం వేసిన చైనా: రాహుల్ గాంధీ


''2024 డిసెంబర్‌లో నా అమెరికా పర్యటనపై విపక్ష నేత అవాస్తవాలు మాట్లాడారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లోని సెక్రటరీ, ఎన్ఎస్ఏను కలిసేందుకు వెళ్లాను. ఆ తర్వాత మన కాన్సుల్ జనరల్ సమావేశానికి అధ్యక్షత వహించాను. ఏ దశలోనూ ప్రధానమంత్రికి ఆహ్వానం విషయంపై చర్చ జరగలేదు. మన ప్రధాని సహజంగా అలాంటి ఈవెంట్లకు వెళ్లరనే విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేక ప్రతినిధులనే భారత్ పంపుతుంటుంది. రాహుల్ రాజకీయ ఉద్దేశాలతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు విదేశాల్లో మన దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి'' అని జైశంకర్ అన్నారు.


రాహుల్ ఏమన్నారు?

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించాల్సిందిగా కోరేందుకు విదేశాంగ మంత్రి పలుమార్లు అమెరికా వెళ్లారని అన్నారు. మనకంటూ ఒక ఉత్పత్తి వ్యవస్థ, సొంత టెక్నాలజీ ఉంటే అమెరికా అధ్యక్షుడే ఇక్కడకు వచ్చి ప్రధానిని ఆహ్వానిస్తారని వ్యాఖ్యానించారు. దేశంలో ఉత్పత్తి, సాంకేతికరంగాలపై భారత్ పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


తప్పుపట్టిన కిరణ్ రిజిజు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. దేశ ప్రధాని గురించి ప్రతిపక్ష నేత ఇలాంటి నిరాధార ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. రెండుదేశాల మధ్య సంబంధాలకు చెందిన అంశంపై సరైన నిర్ధారణ లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. దీనికి వెంటనే రాహుల్ సమాధానిమిస్తూ ''మీ ప్రశాంతతకు భంగం కలిగించినందుకు క్షమాపణ చెబుతున్నాను'' అన్నారు.


Microsoft: మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు షాక్‌!

Cancer in India: దేశానికి క్యాన్సర్‌ సవాల్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 06:37 PM