Share News

Bengaluru: ఆయన మకాం వెనుక అసలు కథ అదేనట.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Jul 17 , 2025 | 01:58 PM

నాయకత్వ మార్పు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్ సింగ్‌ సుర్జేవాలా బెంగళూరులోనే మకాం వేశారు. 15రోజుల వ్యవధిలో మూడు విడతలలో 9 రోజులపాటు బెంగళూరులో గడిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై అభివృద్ధితోపాటు ఇతరత్రా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

Bengaluru: ఆయన మకాం వెనుక అసలు కథ అదేనట.. విషయం ఏంటంటే..

- మీపై ఫిర్యాదులకు సమాధానం చెబుతారా..

బెంగళూరు: నాయకత్వ మార్పు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్ సింగ్‌ సుర్జేవాలా(Randeep Singh Surjewala) బెంగళూరులోనే మకాం వేశారు. 15రోజుల వ్యవధిలో మూడు విడతలలో 9 రోజులపాటు బెంగళూరులో గడిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై అభివృద్ధితోపాటు ఇతరత్రా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మంగళవారం ఏకంగా 11మంది మంత్రులతో చర్చలు జరిపారు. మాకు వ్యతిరేకత లేదని, పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటున్నామని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


దీంతో సుర్జేవాలా ఒకింత ఆగ్రహానికి లోనైనట్టు తెలుస్తోంది. ప్రధానంగా మంత్రి దినేశ్‌ గుండూరావు, ప్రియాంక ఖర్గే, బోసరాజు, శరణప్రకాశ్‌ పాటిల్‌, మధుబంగారప్ప, ఎస్‌ఎస్‌ మల్లికార్జున, వెంకటేశ్‌, డీ సుధాకర్‌, లక్ష్మీ హెబ్బాళ్కర్‌లతో చర్చలు జరిపన వేళ వారిపై వచ్చిన ఆరోపణలను, ఫిర్యాదులను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇక కియోనెక్స్‌ చైర్మన్‌ శరత్‌ బచ్చేగౌడ, కేఎ్‌సఐసీ అధ్యక్షురాలు ఖనీజా ఫాతిమా, కాలుష్య నియంత్రణమండలి చైర్మన్‌ నరేంద్రస్వామి సహా పలువురితో చర్చలు జరిపారు. ప్రజాపనులశాఖలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు బిల్లులు క్లియర్‌ కావడం లేదనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యేలు, మంత్రులను ఒక్కొక్కరిగా రప్పించుకుని సుర్జేవాలా సభలు జరపడాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. సుర్జేవాలా షాడో సీఎం అంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ హల్‌చల్‌ అయ్యింది. అందుకు మంత్రులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.


వైద్యవిద్యాశాఖ మంత్రి శరణప్రకాశ్‌ పాటిల్‌ మాట్లాడుతూ మా శాఖకు సంబంధించిన రెండేళ్ల ప్రగతిని వివరించానని, పెండింగ్‌ పనులను ప్రస్తావించానన్నారు. ఇది మౌల్యమాపనం కాదని, నా పనితీరు పట్ల సుర్జేవాలా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. గృహ నిర్మాణశాఖ మంత్రి జమీర్‌ అహ్మద్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్‌ స్పందిస్తూ రెండేళ్లుగా మా శాఖలో సాధన నివేదికను సుర్జేవాలాకు సమర్పించానన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 17 , 2025 | 01:58 PM