Ramayana: మహాకుంభ్‌లో 'ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' స్క్రీనింగ్
ABN , Publish Date - Jan 21 , 2025 | 08:44 PM
ప్రయాగ్‌రాజ్‌లోని నేత్రకుంభ్ సమీపంలో ఉన్న సెక్టార్ 6 దివ్వ ప్రేమ శిబిర్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభవుతుందని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ వివరించింది.

ప్రయాగ్‌రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఈవెంట్‌గా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న 'మహాకుంభమేళా 2025' (Maha kumbh mela 2025) ఇప్పుడు మరింత శోభను సంతరించుకోనుంది. వాల్మీకి రామాయణం ఆధారంగా జపాన్-ఇండో సంయుక్త భాగస్వామ్యంతో రూపొందించిన యానిమే చిత్రం ''రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ'' (Ramayana: The Legend of Price Rama) ప్రదర్శనను మహాకుంభమేళాలో నిర్వహిస్తున్నట్టు ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ (Excel Entertainment) మంగళవారంనాడు ప్రకటించింది.
Mahakumbh: మహాకుంభ్‌కు మోదీ.. ఎప్పుడంటే
జనవరి 23వ తేదీన ఈ స్పెషల్ స్కీనింగ్ నిర్వహిస్తు్న్నామని, విద్యా్ర్థులు, భక్తులు అంతా ఆహ్వానితులేనని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది. రామాయణం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్న చిన్నారులకు ఈ చిత్రం చక్కటి అనూభూతినిస్తుందని తెలిపింది. ప్రయాగ్‌రాజ్‌లోని నేత్రకుంభ్ సమీపంలో ఉన్న సెక్టార్ 6 దివ్వ ప్రేమ శిబిర్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభవుతుందని వివరించింది.
సినిమా గురించి..
''రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్'' చిత్రం తొలిసారిగా ఆల్ట్రా హెచ్‌డీ 4కే ఫార్మెట్‌లో దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో జనవరి 24న విడుదలవుతోంది. హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీన్ వెర్షన్లలో యానిమే ఫిల్మ్‌గా ఈ చిత్రం విడుదలవుతుండటం విశేషం. గ్రీక్ పిక్చర్ ఇండియా, ఏఏ ఫిల్మ్స్, ఎక్సెల్ ఎంట్‌టైన్మెంట్ ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Gautam Adani: 50 లక్షల మందికి ప్రసాదం పంపిణీ చేయనున్న గౌతమ్ అదానీ
Hero Vijay: ఆ ఎయిర్‌పోర్టుపై ప్రభుత్వానిది కపటనాటకం..
Read More National News and Latest Telugu News