Share News

Narendra Modi: ఇన్వెస్ట్ మెంట్స్ గురించి మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇదే సరైన సమయమని వెల్లడి

ABN , Publish Date - Feb 12 , 2025 | 07:23 AM

ఇండియాలో పెట్టుబడులకు ఇది అనుకూల సమయమని ప్రధాని మోదీ తెలిపారు. CEO ఫోరమ్‌లో పాల్గొన్న ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Narendra Modi: ఇన్వెస్ట్ మెంట్స్ గురించి మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇదే సరైన సమయమని వెల్లడి
Narendra Modi

భారతదేశంలో పెట్టుబడుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూల సమయమని ప్రధాని అన్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ CEO ఫోరమ్‌లో ప్రసంగించిన క్రమంలో పేర్కొన్నారు. 2047 నాటికి 'అభివృద్ధి చెందిన భారతదేశం' అనే లక్ష్యంతో ఇండియా ప్రస్తుతం పని చేస్తుందన్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు తమ పెట్టుబడులను భారతదేశంలో పెట్టేందుకు ఇది మంచి అవకాశమని ప్రధాని సూచించారు. ఈ క్రమంలో CEO ఫోరమ్‌లో పాల్గొన్న కంపెనీలను ఆహ్వానించారు ప్రధాని.


విజయాల ప్రస్తావన

దేశంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, AI, అంతరిక్ష సాంకేతికత, 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో సాధించిన విజయాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. భారతదేశం గత పదేళ్లలో అనేక మార్పులను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని మోదీ అన్నారు. ఈ క్రమంలో త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు ప్రధాని. మేము స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మార్గంతో భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు.


పెట్టుబడికి గమ్యస్థానం..

భారతదేశం క్రమంగా ప్రాధాన్యత కలిగిన ప్రపంచ పెట్టుబడికి గమ్యస్థానంగా మారుతోందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ క్రమంలో ఇండియా పలు ఆధునిక ప్రాజెక్టులను ప్రారంభించింది. ఇటివల సెమీకండక్టర్, క్వాంటం మిషన్‌ను కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా', 'మేక్ ఫర్ ది వరల్డ్' కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. భారతదేశంలో సాంకేతికత, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా పెట్టుబడుల కోసం కీలకమైన ప్రాంతంగా ఉందన్నారు.


కొత్త ప్రాజెక్టులు..

ఈ నేపథ్యంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంపై మరోసారి అంగీకారం తెలిపిన విదేశీ వ్యాపారవేత్తలు, భారత్‌లో తమ ప్రాజెక్టులకు కొత్త గమ్యస్థానాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. 2025 నాటికి భారతదేశం మరింత ఉత్పత్తి, వాణిజ్య, ఆర్థిక అభివృద్ధికి సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపర్చడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆహ్వానించేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఫ్రాన్స్ తర్వాత ఈరోజు, రేపు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి.


ఇవి కూడా చదవండి:


New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

EPFO: ఈ వినియోగదారులకు అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా లేదా..

Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్‌ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..


Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 12 , 2025 | 07:26 AM