Prashant Kishor: నటుడు విజయ్ పార్టీకి ఒంటరిగా ఎన్ని సీట్లు వస్తాయంటే.. పీకే జోస్యం ఇదే
ABN , Publish Date - Mar 01 , 2025 | 09:13 PM
రాజకీయ మార్పును ఆశిస్తూ బీహార్‌లో జన్ సురాజ్ పార్టీ, తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ ఎన్నికలకు వెళ్తున్నాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. తమిళనాడులో మార్పు తేవాలనే ఆశయంతో ఉన్న ఆయనకు ఎన్నికల వ్యూహకర్తగా తనకున్న అనుభవం జోడించి సహకరిస్తానని చెప్పారు.

చెన్నై: రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (2026) నటుడు దళపతి విజయ్ (Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందా? ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుందా? అనే ఊహాగానాల నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. అన్నాడీఎంకేతో పొత్తు లేకుండానే టీవీకే తమిళనాడులో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. టీవీకేకు అన్నాడీఎంకే మద్దతు అవసరమనే అభిప్రాయాన్ని ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తోసిపుచ్చారు.
Maharashtra: అసెంబ్లీలో విపక్ష నేత హోదా మాకు ఇవ్వాలి: సంజయ్ రౌత్
టీవీకే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల జరిగిన ఆ పార్టీ వార్షికోత్సవంలో కూడా ప్రశాంత్ కిషోర్ సూచించారు. ''ప్రస్తుతానికైతే ఆ పార్టీ ఒంటిరిగానే ఎన్నికలను వెళ్లే ఆలోచనలో ఉంది. అందులో మార్పు ఉంటుందని నేను అనుకోవడం లేదు'' అని అన్నారు. డీఎంకే ఓటు బ్యాంకును ఎదుర్కోవాలంటే టీవీకేతో పొత్తుకు అన్నాడీఎంకే మొగ్గుచూపే అవకాశంపై అడిగినప్పుడు, అలాంటిదేమీ ఉండకపోవచ్చని అన్నారు. గతంలోని ఎలక్టోరల్ డాటా ఆధారంగానే భవిష్యత్ ఫలితాలు ఉంటాయని ఊహించరాదని చెప్పారు. డిఎంకే కూటమి గతంలో 47 శాతం ఓట్ల షేర్ సాధించిందని, అదే భవిష్యత్తులోనూ కొనసాగుతుందనే గ్యారెంటీ ఏమీ లేదని అన్నారు.
ఒంటరి పోరులో టీవీకేకి వచ్చే సీట్లు ఎన్ని?
రాజకీయ మార్పును ఆశిస్తూ బీహార్‌లో జన్ సురాజ్ పార్టీ, తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ ఎన్నికలకు వెళ్తున్నాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. తమిళనాడులో మార్పు తేవాలనే ఆశయంతో ఉన్న ఆయనకు ఎన్నికల వ్యూహకర్తగా తనకున్న అనుభవం జోడించి సహకరిస్తానని, ఆయన సైతం బీహార్‌లో తనకు సహకరిస్తారని తెలిపారు. బీహార్‌లో విజయ్‌కు పెద్దసంఖ్యలో అభిమానులు ఉన్నట్టు చెప్పారు. టీవీకేకి తప్పనిసరిగా తమిళనాడులో విజయావకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 సీట్లు ఆయన గెలుచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయన్నారు. ''ఈ వీడియోను మీరు జాగ్రత్త చేయండి. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మీరు ప్లే చేయవచ్చు'' అని ప్రశాంత్ కిషోర్ ఆ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.