Share News

Prashant Kishor: రాసి ఇస్తా... అలా జరక్కపోతే నేను తప్పుకుంటా: పీకే సంచలన జోస్యం

ABN , Publish Date - Mar 05 , 2025 | 09:47 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, నితీష్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ సంచలన జోస్యం చెప్పారు.

Prashant Kishor: రాసి ఇస్తా... అలా జరక్కపోతే నేను తప్పుకుంటా: పీకే సంచలన జోస్యం

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections), నితీష్ కుమార్ (Nitish Kuamr) తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) సంచలన జోస్యం చెప్పారు నితీష్ కుమార్ వరుసగా ఐదోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదన్నారు. ఆయన ఏ కూటమిలో ఉన్నప్పటికీ ఆయనకు సీఎం అయ్యే అవకాశాలు ఉండవని, ఎన్డీయేతో కలిసి పోటీ చేసి ఎన్నికలు ముగిసాక మళ్లీ కూటమి మారే అవకాశాలుంటాయని చెప్పారు. ఏ కూటమిలో ఉన్నా ఆయన సీఎం కావడానికి ప్రజలు అంగీకరించరని చెప్పారు.

Tejaswi Yadav: నితీష్‌ను రెండు సార్లు సీఎం చేసిందే నేనే


నితీష్ కుమార్ మినహా...

నవంబర్ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ కాకుండా వేరేవాళ్లు సీఎం అవుతారని పీకే కుండబద్ధలు కొట్టారు. ''నేను రాసి ఇస్తా. నేను చెప్పింది జరక్కపోతే నా సొంత రాజకీయ ప్రచారం నుంచి తప్పుకుంటా'' అని మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత ఎన్డీయే అధికారంలోకి వస్తే నితీష్ ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ఉంటారని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా ప్రకటించాలని పీకే సవాలు చేశారు. ఒకవేళ అలా చేస్తే ఆ పార్టీ (బీజేపీ) సీట్లు గెలువడం కష్టమవుతుందన్నారు.


బీజేపీ మరోసారి నితీష్‌ కుమార్‌కు సీఎం పగ్గాలు ఇవ్వడానికి నిరాకరిస్తే ఆయన మళ్లీ సీఎం పదవి కోసం కూటమి మారేందుకు ప్రయత్నించవద్దని, అయితే ఆయన ఏ కూటమిలోకి వెళ్లినా ఆ పార్టీకి వచ్చే తక్కువ సీట్లతో ఆయనకు ఉన్నత పదవి (సీఎం) దక్కడం అసాధ్యమని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

Aurangzeb Row: అబూ అజ్మీని యూపీ పంపండి.. గట్టి ట్రీట్‌మెంట్ ఇస్తాం: యోగి

Arvind Kejriwal: ట్రంప్‌ను మించిన సెక్యూరిటీతో ధ్యాన కేంద్రానికి కేజ్రీవాల్

Former Minister: హీరో విజయ్‌ది పగటికలే.. అందరూ ఎంజీఆర్‌ కాలేరు

Hero Vishal: హీరో విశాల్‌ ప్రశ్న.. విజయ్‌ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2025 | 09:55 PM