Share News

Prashant Kishore: జన్‌ సురాజ్ ఓట్లు చీల్చే పార్టీ.. కానీ ట్విస్ట్ ఉంటుంది

ABN , Publish Date - Jul 27 , 2025 | 04:07 PM

రెండో దెబ్బ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీయూపై పడుతుందని, జేడీయూ కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లు పెద్ద సంఖ్యలో జన్ సురాజ్‌ వైపు మళ్లుతున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. జన్ సురాజ్ ఊపు ఇదేవిధంగా కొనసాగితే మూడో దెబ్బ బీజేపీపై పడుతుందని అన్నారు.

Prashant Kishore: జన్‌ సురాజ్ ఓట్లు చీల్చే పార్టీ.. కానీ ట్విస్ట్ ఉంటుంది
Prashant Kishore

పాట్నా: ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో పార్టీల ప్రచార వేడి క్రమంగా పెరుగుతోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరుతెచ్చుకుని కొద్దికాలం క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) తన రాజకీయ పార్టీ 'జన్ సురాజ్' (Jan Suraaj)పై గట్టి అంచనాలే పెట్టుకున్నారు. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ 'జన్ సురాజ్'ను 'ఓట్లను చీల్చే' పార్టీగా అభివర్ణించారు. కానీ ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉంటుందన్నారు.


'జన్ సురాజ్ ఓట్లను చీల్చే పార్టీ. కానీ మేము చాలా ఓట్లు చీల్చుకుంటాం..అంతిమంగా ఎన్నికల్లో గెలుస్తాం' అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. తమ పార్టీ రాష్ట్ర రాజకీయ డైనమిక్స్‌లో గణనీయంగా మార్పులు తీసుకువస్తుందని చెప్పారు. జన్ సురాజ్ ప్రభావంతో చిన్న పార్టీల వర్కర్లు, సపోర్ట్ బేస్ ఇప్పటికే తమ క్యాంపులోకి వచ్చేసిందని, చిన్న పార్టీలు ఉనికి కోల్పోయినందున వాటి గురించి ప్రజలు చర్చించుకోవడం మానేశారని అన్నారు. ప్రస్తుతం బీహార్‌లో రాజకీయ సంభాషణలన్నీ ఆర్జేడీ సారథ్యంలోని కూటమి, బీజేపీ-జేడీయూ కూటమి, జన్ సురాజ్ చుట్టూనే నడుస్తున్నాయని తెలిపారు.


జేడీయూకు దెబ్బ

రెండో దెబ్బ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీయూపై పడుతుందని, జేడీయూ కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లు పెద్ద సంఖ్యలో జన్ సురాజ్‌ వైపు మళ్లుతున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. జన్ సురాజ్ ఊపు ఇదేవిధంగా కొనసాగితే మూడో దెబ్బ బీజేపీపై పడుతుందని అన్నారు. రెండు రకాల బీజేపీ మద్దతుదారులు జన్‌సురాజ్ వైపు మొగ్గుచూపుతున్నారని, నాయకత్వంపైన, లోకల్ స్థాయిలో పనితీరుపై భ్రమలు తొలగిపోయిన వారు, పైస్థాయిలో మోదీ బాగా పనిచేస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో వైవిధ్యం కోరుకుంటున్న వారు ఈ జాబితాలోకి వస్తారని చెప్పారు.


ముస్లిం ఓటు బ్యాంకు సంప్రదాయంగా లాలూ ఆర్జేడీకి విధేయంగా ఉంటుందని, 30 ఏళ్లుగా ఇదే జరుగుతోందని, అయితే వారంతా ఇప్పుడు తమ వైపు మళ్లే అవకాశాలు ఉంటాయని చెప్పారు.


ప్రశాంత్ కిషోర్ తీసుకువచ్చిన 'జన్ సురాజ్' ఉద్యమం రాష్ట్ర ప్రజలను ఆకర్షించిందనే చెప్పాలి. అయితే, ఇదంతా ఓట్లుగా మార్చుకోగలదా ఆనే ప్రశ్న కూడా ఉంది. ప్రశాంత్ కిషోర్‌ నిజాయితీ, అట్టడుగు స్థాయి నుంచి చేపడుతున్న ప్రచారం బీహార్ రాజకీయాలపై ఏమేరకు ప్రభావం చూపనుందనే చర్చ కూడా జరుగుతోంది. ఆర్జేడీ సారథ్యంలోని మహాఘట్‌బంధన్, ఎన్డీయే కూటమి మధ్య పొత్తులు ఖరారై పోటీ రెండు కూటముల మధ్యే ఉంటుందని అనుకుంటున్న తరుణంలో జన్ సురాజ్ తెరపైకి వచ్చింది. దీంతో ప్రధాన పార్టీల సంప్రదాయ ఓట్ బ్యాంకును ఆ పార్టీ ఏమేరకు గండికొట్టనుందనేది ఆసక్తికరంగా మారుతోంది.


ఇవి కూడా చదవండి..

ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి వెళ్లిన రాజ్‌ఠాక్రే..ఎందుకంటే

హరిద్వార్ మానసా దేవీ ఆలయం వద్ద తొక్కిసలాట.. ఆరుగురి మృతి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 04:17 PM